హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

JioMart: వాట్సప్‌లో కిరాణా సరుకులు సింపుల్‌గా కొనండి ఇలా

JioMart: వాట్సప్‌లో కిరాణా సరుకులు సింపుల్‌గా కొనండి ఇలా

JioMart: వాట్సప్‌లో కిరాణా సరుకులు సింపుల్‌గా కొనండి ఇలా

JioMart: వాట్సప్‌లో కిరాణా సరుకులు సింపుల్‌గా కొనండి ఇలా

JioMart | ఇంట్లోకి సరుకులు కొనాలనుకుంటున్నారా? వాట్సప్ (WhatsApp) ద్వారా ఆర్డర్ చేసి మీకు కావాల్సిన కిరాణా సరుకుల్ని జియోమార్ట్ నుంచి తెప్పించుకోవచ్చు. ఈ ప్రాసెస్ చాలా సింపుల్.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ జియో మార్ట్ (JioMart) ద్వారా గ్రాసరీ సేవల్ని అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం రిలయన్స్ రీటైల్ స్టోర్స్, జియోమార్ట్ స్టోర్లతో పాటు ఇతర కిరాణా షాపులతో సహకారం తీసుకుంటోంది. సరుకులు ఆర్డర్ చేసిన వెంటనే కస్టమర్లకు డెలివరీ చేస్తోంది. వాట్సప్‌లో జియోమార్ట్ కోసం (JioMart on WhatsApp) జియో ప్లాట్‌ఫామ్స్, మెటా సంస్థలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. వాట్సప్‌లో మొదటిసారి ఎండ్ టు ఎండ్ షాపింగ్ ఎక్స్‌పీరియెన్స్ పొందొచ్చు. కస్టమర్లు జియోమార్ట్ కేటలాగ్ బ్రౌజ్ చేసి ప్రొడక్ట్స్ యాడ్ చేసి వాట్సప్‌లోనే షాపింగ్ చేయొచ్చు.


భారతదేశంలో జియోమార్ట్‌తో మా భాగస్వామ్యాన్ని ప్రారంభిస్తున్నందుకు సంతోషిస్తున్నాము. ఇది వాట్సప్‌లో మా మొట్టమొదటి ఎండ్-టు-ఎండ్ షాపింగ్ అనుభవం. ప్రజలు ఇప్పుడు చాట్‌లో జియోమార్ట్ నుంచి కిరాణా సామాగ్రిని కొనుగోలు చేయవచ్చు. ఇలాంటి చాట్-బేస్డ్ అనుభవాలు రాబోయే సంవత్సరాల్లో ప్రజలను, వ్యాపారాలను కమ్యూనికేట్ చేయడానికి మార్గంగా మారుతాయి.
ఫేస్‌బుక్ పోస్ట్‌లో మార్క్ జుకర్‌బర్గ్, ఫౌండర్, సీఈఓ, మెటా


జియోమార్ట్ వాట్సప్ చాట్‌లోనే అందుబాటులో ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా మొదటగా, భారతదేశంలోని వినియోగదారులు, మునుపెన్నడూ ఆన్‌లైన్‌లో షాపింగ్ చేయని వారు కూడా సులువుగా షాపింగ్ చేసేలా వాట్సప్‌లో జియోమార్ట్ అందుబాటులో ఉంది. వాట్సప్ యాప్ క్లోజ్ చేయాల్సిన అవసరం లేకుండా ఆర్డర్ పూర్తి చేయొచ్చు.


ప్రపంచంలోనే అగ్రగామి డిజిటల్ సొసైటీగా భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్లడమే మా విజన్. 2020లో జియో ప్లాట్‌ఫామ్స్, మెటా భాగస్వామ్యాన్ని ప్రకటించినప్పుడు, ఎక్కువ మంది వ్యక్తులను, వ్యాపారాలను ఆన్‌లైన్‌లోకి తీసుకురావడానికి, ప్రతీ భారతీయుని రోజువారీ జీవితాలకు సౌలభ్యాన్ని అందించడానికి నిజమైన వినూత్న పరిష్కారాలను రూపొందించాలని మార్క్, నేను అనుకున్నాం. వాట్సప్‌లో జియోమార్ట్‌తో మొట్టమొదటి ఎండ్-టు-ఎండ్ షాపింగ్ అనుభవం మేము గర్విస్తున్న వినూత్న కస్టమర్ అనుభవం. కోట్లాది మంది భారతీయులకు ఆన్‌లైన్ షాపింగ్ సులభంగా, అనుకూలంగా అందించే దిశగా మా నిబద్ధత కొనసాగుతచుంది.

ముకేష్ అంబానీ, ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్, రిలయన్స్ ఇండస్ట్రీస్


రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) 45వ వార్షిక సర్వసభ్య సమావేశంలో వాట్సప్ ద్వారా జియోమార్ట్ సేవలు ఎలా పనిచేస్తాయో రిలయన్స్ రీటైల్ వెంచర్స్ లిమిటెడ్ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ ఇషా అంబానీ వివరించారు. ప్రత్యేకంగా ఓ యాప్ డౌన్‌లోడ్ చేయాల్సిన అవసరం లేకుండా సింపుల్‌గా వాట్సప్‌లోనే సరుకులు ఆర్డర్ చేయొచ్చు. ఎలాగో తెలుసుకోండి.


how to place JioMart order on whatsapp, how to place order on JioMart, isha ambani, JioMart whatsapp order, reliance, reliance agm, reliance agm 2022, reliance agm 2022 live, reliance agm 2022 live updates, reliance agm updates, reliance industries, Reliance JioMart, reliance news, ril, ril agm, జియోమార్ట్ వాట్సప్ ఆర్డర్, <a href='https://telugu.news18.com/tag/mukesh-ambani/'>ముకేష్ అంబానీ</a> , రిలయన్స్ ఏజీఎం, రిలయన్స్ జనరల్ మీటింగ్, రిలయన్స్ బోర్డ్ మీటింగ్, రిలయన్స్ యాన్యువల్ మీటింగ్


జియోమార్ట్ షాప్‌లో వాట్సప్ ద్వారా సరుకులు కొనండి ఇలా


Step 1- ముందుగా మీ స్మార్ట్‌ఫోన్‌లో జియోమార్ట్ ఛాట్ బాట్ నెంబర్ +917977079770 సేవ్ చేయాలి.


Step 2- వాట్సప్ ఓపెన్ చేసి జియోమార్ట్ ఛాట్ బాట్ ఓపెన్ చేయాలి.


Step 3- Hi అని టైప్ చేయాలి.


Step 4- దగ్గర్లో ఉన్న షాపుల్లోని సరుకుల వివరాలు కనిపిస్తాయి.


Step 5- సరుకులు కేటగిరీ, సబ్ కేటగిరీస్ వారీగా ఉంటాయి.


Step 6- మీకు కావాల్సిన సరుకులు సెలెక్ట్ చేసి యాడ్ చేయాలి.


Step 7- మీకు కావాల్సిన సరుకులు దొరకకపోతే సెర్చ్ ఆప్షన్ ఉపయోగించవచ్చు.


Step 8- సరుకులు కార్ట్‌లో యాడ్ చేసిన తర్వాత కార్ట్ చెక్ చేయాలి.


Step 9- ఆర్డర్ కన్ఫామ్ చేసి డెలివరీ అడ్రస్ అప్‌డేట్ చేయాలి.


Step 10- వాట్సప్ పే, ఇతర పేమెంట్స్ మెథడ్స్ ద్వారా పేమెంట్స్ చేయొచ్చు. లేదా క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ సెలెక్ట్ చేయొచ్చు.


Step 11- ఆర్డర్ ప్లేస్ అవుతుంది.


Step 12- మీ ఆర్డర్ స్టేటస్ వివరాలు వాట్సప్‌లో అప్‌డేట్ అవుతాయి.

Published by:Santhosh Kumar S
First published:

Tags: Isha Ambani, JioMart, Reliance Industries, Reliance retail, RIL

ఉత్తమ కథలు