హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Jio 5G: దీపావళికి జియో 5జీ సేవలు: ముకేష్ అంబానీ

Jio 5G: దీపావళికి జియో 5జీ సేవలు: ముకేష్ అంబానీ

Jio 5G: దీపావళికి జియో 5జీ సేవలు: ముకేష్ అంబానీ

Jio 5G: దీపావళికి జియో 5జీ సేవలు: ముకేష్ అంబానీ

Jio 5G rollout | దీపావళికి జియో 5జీ సేవల్ని ప్రారంభిస్తామని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ముకేష్ అంబానీ (Mukesh Ambani) ప్రకటించారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

దీపావళికి జియో 5జీ సేవల్ని ప్రారంభిస్తామని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ముకేష్ అంబానీ (Mukesh Ambani) ప్రకటించారు. జియో 5జీ ట్రూ 5జీ (Jio True 5G) అని ప్రకటించారు. ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతాలో దీపావళికి జియో 5జీ సేవలు ప్రారంభం అవుతాయని, ఆ తర్వాత ఇతర నగరాలు, పట్టణాల్లో జియో 5జీ వస్తుందన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద, అడ్వాన్స్‌డ్ 5జీ నెట్వర్క్‌గా జియో 5జీ ఉంటుందని చెప్పారు. జియో 5జీ సేవలతో బ్రాడ్‌బ్యాండ్ స్పీడ్, నెట్వర్క్ కెపాసిటీ, కనెక్టెడ్ యూజర్స్ పెరుగుతారని అన్నారు. 2023 డిసెంబర్ నాటికి అంటే 18 నెలల్లో జియో అన్ని పట్టణాలకు విస్తరిస్తుంది. జియో ట్రూ 5జీ నెట్వర్క్ విస్తరించేందుకు రూ.2 లక్షల కోట్లు పెట్టుబడి పెడుతున్నామని ప్రకటించారు.


జియో 5జీ నెట్వర్క్ ద్వారా ఇప్పటికే మేడ్ ఇన్ ఇండియా 5జీ సిద్ధంగా ఉంది. మొబైల్ బ్రాండ్‌లో అడ్వాన్స్‌డ్ వర్షన్‌గా జియో 5జీ ఉంటుందని, లక్షలాది లొకేషన్లలో హైక్వాలిటీ, సరసమైన ధరకే 5జీ సేవలు లభిస్తాయన్నారు. అన్ని వర్గాల కనెక్టెడ్, ఇంటెలిజెన్స్ సొల్యూషన్స్ కోసం 5జీ ఉపయోగపడుతుందన్నారు. 10 కోట్లకు పైగా ఇళ్లకు 5జీ కనెక్ట్ చేస్తామని ప్రకటించారు. దీంతో పాటు లక్షలాది మంది చిరు వ్యాపారులు, వేలాది పెద్ద బిజినెస్‌లు, కోట్లాది స్మార్ట్ సెన్సార్లను కనెక్ట్ చేస్తామన్నారు. 4జీపై ఆధారపడాల్సిన అవసరం లేకుండా స్టాండలోన్ 5జీ సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు.


రిలయన్స్ జియో వేలంపాటలో 5జీ స్పెక్ట్రం కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. 700MHz, 800MHz, 1800MHz, 3300MHz, 26GHz బ్యాండ్స్ స్పెక్ట్రమ్‌ను సొంతం చేసుకుంది. జియో లో-బ్యాండ్, మిడ్-బ్యాండ్, mmWave స్పెక్ట్రమ్ కొనుగోలు చేసింది. జియో మొత్తం యాజమాన్యంలోని స్పెక్ట్రమ్ ఫుట్‌ప్రింట్ అప్‌లింక్ + డౌన్‌లింక్ కలిపి 26,772 MHz కి గణనీయంగా పెరిగింది. Jio 22 సర్కిల్‌లలో ప్రతి 700 MHz, 800 MHz బ్యాండ్‌లలో కనీసం 2X10 MHz అనుబంధ స్పెక్ట్రమ్‌తో అత్యధిక మొత్తంలో Sub-GHz స్పెక్ట్రమ్, 1800 MHz బ్యాండ్‌లో కనీసం 2X10 MHz (ఆరు కీలక సర్కిల్‌లలో 2X20 MHzతో), 2300 MHz బ్యాండ్‌లో 40 MHz, అన్ని 22 సర్కిల్‌లలో 3300 MHz బ్యాండ్‌లో 100 MHz, 22 సర్కిల్‌లలో ప్రతి మిల్లీమీటర్ వేవ్ బ్యాండ్ (26 GHz)లో 1,000 MHzని ఉపయోగించే హక్కు Jioకి ఉంది.

Published by:Santhosh Kumar S
First published:

Tags: Jio, Jio TRUE 5G, Mukesh Ambani, Reliance Jio, RIL