హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

RIL AGM 2020: జియో మరో సంచలనం... Jio TV+ ప్రకటించిన రిలయెన్స్

RIL AGM 2020: జియో మరో సంచలనం... Jio TV+ ప్రకటించిన రిలయెన్స్

RIL AGM 2020 | గతేడాది రిలయెన్స్ జియో సెట్ టాప్ బాక్స్, జియో ఫైబర్ ప్రకటించిన రిలయెన్స్ జియో... యూజర్ల నుంచి వచ్చిన ఫీడ్ బ్యాక్‌ను దృష్టిలో పెట్టుకొని జియో టీవీ+ రూపొందించింది.

    రిలయెన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్-RIL మరో సంచలనం సృష్టించింది. ఇప్పటికే జియో ద్వారా అనేక సంచలనాలు సృష్టించిన రిలయెన్స్... కొత్తగా Jio TV+ ప్రకటించింది. ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ అయిన నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, హాట్‌స్టార్ లాంటి ప్రపంచవ్యాప్తంగా ఉన్న 12 స్ట్రీమింగ్ యాప్స్‌ని ఒకే చోట అందించడం జియో టీవీ+ ప్రత్యేకత. వాయిస్ సెర్చ్ ద్వారా జియో టీవీ+ పనిచేస్తుంది. ప్రత్యేకంగా స్ట్రీమింగ్ యాప్ ఓపెన్ చేయకుండా వాయిస్ సెర్చ్ చేయొచ్చు. వేర్వేరు లాగిన్ ఐడీలు కూడా అవసరం లేదు. నేరుగా వాయిస్ సెర్చ్ ద్వారా వేర్వేరు ప్లాట్‌ఫామ్స్‌లోని కంటెంట్ సెర్చ్ చేయొచ్చు. వీటితో పాటు ప్రధాన ఛానెల్స్ కూడా జియో టీవీ+ లో లభిస్తాయి. గతేడాది రిలయెన్స్ జియో సెట్ టాప్ బాక్స్, జియో ఫైబర్ ప్రకటించిన రిలయెన్స్ జియో... యూజర్ల నుంచి వచ్చిన ఫీడ్ బ్యాక్‌ను దృష్టిలో పెట్టుకొని జియో టీవీ+ రూపొందించింది.

    First published:

    Tags: Jio, Reliance, Reliance Industries, Reliance Jio, RIL

    ఉత్తమ కథలు