హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Jio OS: స్మార్ట్‌ఫోన్ యూజర్లకు శుభవార్త... త్వరలో జియో ఆపరేటింగ్ సిస్టమ్

Jio OS: స్మార్ట్‌ఫోన్ యూజర్లకు శుభవార్త... త్వరలో జియో ఆపరేటింగ్ సిస్టమ్

Jio OS: స్మార్ట్‌ఫోన్ యూజర్లకు శుభవార్త... త్వరలో జియో ఆపరేటింగ్ సిస్టమ్

Jio OS: స్మార్ట్‌ఫోన్ యూజర్లకు శుభవార్త... త్వరలో జియో ఆపరేటింగ్ సిస్టమ్

RIL AGM 2020 | తక్కువ ధరలో ఆండ్రాయిడ్ బేస్డ్ 5జీ స్మార్ట్‌ఫోన్ కూడా తీసుకొస్తామని ముఖేష్ అంబానీ ప్రకటించారు. జియో-గూగుల్ కలిసి భారతదేశాన్ని 2జీ రహితంగా మార్చేస్తామన్నారు.

  స్మార్ట్‌ఫోన్ యూజర్లకు శుభవార్త. త్వరలో జియో ఆపరేటింగ్ సిస్టమ్ రాబోతోంది. ప్రస్తుతం టాప్‌లో ఉన్న స్మార్ట్‌ఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆండ్రాయిడ్ అన్న సంగతి తెలిసిందే. ఆండ్రాయిడ్ తర్వాత యాపిల్‌కు చెందిన ఐఓఎస్ ఉంటుంది. త్వరలో మేడ్ ఇన్ ఇండియా ఆపరేటింగ్ సిస్టమ్ తీసుకురాబోతోంది రిలయెన్స్ జియో. ఈ విషయాన్ని రిలయెన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్-RIL 43వ యాన్యువల్ జనరల్ మీటింగ్‌లో ఈ విషయాన్ని కంపెనీ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ ప్రకటించారు. గూగుల్‌తో కలిసి కొత్త స్మార్ట్‌ఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్ రూపొందిస్తున్నట్టు తెలిపారు. ఈ ఆపరేటింగ్ సిస్టమ్ ఆండ్రాయిడ్ ఆధారంగా పనిచేస్తుందన్నారు. అంతేకాదు... తక్కువ ధరలో ఆండ్రాయిడ్ బేస్డ్ 5జీ స్మార్ట్‌ఫోన్ కూడా తీసుకొస్తామని ముఖేష్ అంబానీ ప్రకటించారు. జియో-గూగుల్ కలిసి భారతదేశాన్ని 2జీ రహితంగా మార్చేస్తామన్నారు.

  రిలయెన్స్ జియో సరసమైన ధరకే 4జీ డివైజ్‌లను అందించింది. 10 కోట్లకు పైనా ఫీచర్ ఫోన్ యూజర్లు జియో ఫోన్‌కు అప్‌గ్రేడ్ అయ్యే అవకాశం కల్పించింది. ప్రస్తుతం భారతదేశంలో 35 కోట్ల ఫీచర్ ఫోన్స్ ఉన్నాయి. వారందరి కోసం తక్కువ ధరలో ఎంట్రీ లెవెల్ 4జీ లేదా 5జీ స్మార్ట్‌ఫోన్ అందిస్తాం.

  ముఖేష్ అంబానీ, ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్, రిలయెన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్-RIL

  మరోవైపు జియో 5జీని కూడా ప్రకటించింది రిలయెన్స్. 5జీ స్పెక్ట్రమ్ అందుబాటులోకి రాగానే జియో 5జీ ట్రయల్స్ ప్రారంభమౌతాయని ముఖేష్ అంబానీ తెలిపారు.

  Published by:Santhosh Kumar S
  First published:

  Tags: Jio, Mukesh Ambani, Reliance, Reliance Industries, Reliance Jio, RIL

  ఉత్తమ కథలు