రిలయెన్స్ జియో యూజర్లకు మరో శుభవార్త. జియో 5జీ వచ్చేస్తోంది. రిలయెన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్-RIL 43వ యాన్యువల్ జనరల్ మీటింగ్లో ఈ విషయాన్ని కంపెనీ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ ప్రకటించారు. మేడ్ ఇన్ ఇండియా జియో 5జీ తీసుకొస్తునట్టు తెలిపారు. ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమాన్ని ప్రకటించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి జియో 5జీని అంకితం చేశారు ముఖేష్ అంబానీ. 5జీ స్పెక్ట్రమ్ అందుబాటులోకి రాగానే జియో 5జీ ట్రయల్స్ ప్రారంభమౌతాయని తెలిపారు. అంతేకాదు... ప్రపంచవ్యాప్తంగా ఇతర ఆపరేటర్లకు జియో ప్లాట్ఫామ్స్ ద్వారా జియో 5జీని ఎక్స్పోర్ట్ చేస్తామన్నారు. వచ్చే ఏడాది జియో 5జీ ట్రయల్స్ ప్రారంభం కానున్నాయి. భారతదేశంలో 5జీ స్పెక్ట్రమ్ అందుబాటులోకి రాగానే యూజర్లకు జియో 5జీ సేవలు లభించనున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: 5G, Jio, Reliance, Reliance Industries, Reliance Jio, RIL