Revolt RV400: మరోసారి అమ్మకానికి రివోల్ట్ ఆర్‌వి 400 ఎలక్ట్రిక్ బైక్.. రేపటి నుంచి బుకింగ్స్​ షురూ

ప్రతీకాత్మకచిత్రం

ఎలక్ట్రిక్​ మోటో సైకిల్​ తయారీ సంస్థ రివోల్ట్ మోటార్స్​ తన ప్రతిష్టాత్మక ఆర్​వీ400 ఎలక్ట్రిక్ బైక్ బుకింగ్స్​ను మళ్లీ ప్రారంభించింది. గత నెలలో రివోల్ట్​ ఆర్​వీ 400 బైక్​ బుకింగ్స్​ ప్రారంభించగా అనూహ్యమైన రెస్పాన్స్​ వచ్చిన విషయం తెలిసిందే.

  • Share this:
ఎలక్ట్రిక్​ మోటో సైకిల్​ తయారీ సంస్థ రివోల్ట్ మోటార్స్​ తన ప్రతిష్టాత్మక ఆర్​వీ400 ఎలక్ట్రిక్ బైక్ బుకింగ్స్​ను మళ్లీ ప్రారంభించింది. గత నెలలో రివోల్ట్​ ఆర్​వీ 400 బైక్​ బుకింగ్స్​ ప్రారంభించగా అనూహ్యమైన రెస్పాన్స్​ వచ్చిన విషయం తెలిసిందే. కేవలం రెండు గంటల్లోనే స్టాక్​ మొత్తం అయిపోయింది. రెండు గంటల వ్యవధిలోనే రూ. 50 కోట్లకు పైగా విలువైన మోటార్​ సైకిళ్లను విక్రయించింది. దీన్ని బట్టి రివోల్డ్​ ఆర్​వీ 400 క్రేజ్​ ఏంటో అర్ధం చేసుకోవచ్చు. కాగా, స్టాక్​ అయిపోవడంతో అప్పుడు బుకింగ్స్​ను అర్ధాంతరంగా నిలిపేసిన రివోల్డ్​ సంస్థ.. డిమాండ్​ను దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు మరోసారి బుకింగ్స్​ను ఆహ్వానిస్తుంది. హైదరాబాద్​తో సహా దేశవ్యాప్తంగా ఉన్న ఆరు ప్రధాన నగరాల్లో ఈ నెల15 నుండి బుకింగ్స్​ మెదలవుతాయని సంస్థ తెలియజేసింది. కంపెనీ అధికారిక వెబ్​సైట్​ ద్వారా బుకింగ్ చేసుకోవచ్చని తెలిపింది.​ గతంలో బుక్​ చేసుకోలేకపోయిన వారు ఇప్పుడు బుక్​ చేసుకోవచ్చిని పేర్కొంది.

గత నెలలో బుక్ చేసుకున్న కస్టమర్లకు సెప్టెంబర్ నుంచి ఈ–బైక్​లు డెలివరీలు ప్రారంభమవుతాయని స్పష్టం చేసింది. కొత్తగా ప్రారంభించిన బుకింగ్స్​పై రతన్​ ఇండియా ఎంటర్​ప్రైజెస్​ బిజినెస్​ ఛైర్మన్ అంజలి రతన్​ మాట్లాడుతూ “గత నెలలో రివోల్డ్​ బైకుల కోసం బుకింగ్స్​ ప్రారంభించగా ఊహించని రెస్పాన్స్ వచ్చింది. అప్పుడు బుక్​ చేసుకోలేకపోయిన కస్టమర్ల కోసం మరోసారి బుకింగ్స్​ ప్రారంభించనున్నాం. బుకింగ్స్​ ప్రక్రియ పూర్తయ్యాక సాధ్యమైనంత త్వరలోనే వీటిని కస్టమర్ల వద్దకు డెలివరీ చేస్తాం.” అని అన్నారు. కాగా, ప్రస్తుతం ఢిల్లీ, ముంబై, పూణే, చెన్నై, అహ్మదాబాద్, హైదరాబాద్ నగరాల్లో సేవలు అందిస్తుంది.

గతంలో అనూహ్యమైన రెస్పాన్స్..
ఆర్​వీ 400 ఎలక్ట్రిక్​ బైక్​లో అద్భుతమైన ఫీచర్లను అందజేశారు. దీనిలోని​ 3.24 KWh లిథియం అయాన్ బ్యాటరీ 75 వోల్ట్​ పవర్​ ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్​ గంటకు 85 కి.మీ వేగంతో దూసుకుపోతుంది. దీనిలో లొకేటర్/ జియో ఫెన్సింగ్, కస్టమైజ్డ్ సౌండ్​ వంటి కనెక్టివిటీ ఫీచర్లను అందించారు. అంతేకాదు, మై రివోల్ట్ యాప్ ద్వారా ఆపరేట్​ చేసుకునే అవకాశం కల్పించారు. ఆర్​వీ 400లో ఎకో, నార్మల్, స్పోర్ట్ అనే మూడు రైడింగ్ మోడ్‌లు ఉంటాయి. రైడింగ్ స్టైల్, డ్రైవర్ అవసరాలకు తగ్గట్లు దీన్ని మార్చుకోవచ్చు.
Published by:Krishna Adithya
First published: