Amazon: అమెజాన్‌లో పిడకలపై రివ్యూలు... సోషల్ మీడియాలో వైరల్

Amazon | ఇ-కామర్స్ సైట్లల్లో పిడకల్ని అమ్మడమే పెద్ద వింత అనుకుంటే, వాటిపై ఏకంగా రివ్యూలు రాయడం ఇప్పుడు మరో వింత.

news18-telugu
Updated: May 15, 2019, 5:43 PM IST
Amazon: అమెజాన్‌లో పిడకలపై రివ్యూలు... సోషల్ మీడియాలో వైరల్
Amazon: అమెజాన్‌లో పిడకలపై రివ్యూలు... సోషల్ మీడియాలో వైరల్ (image: Amazon)
news18-telugu
Updated: May 15, 2019, 5:43 PM IST
ఆ మధ్య అమెజాన్‌లో కొబ్బరిచిప్పను రూ.1365 ధరకు అమ్మిన వ్యవహారం గుర్తుంది కదా? అది సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. ఇప్పుడు అమెజాన్‌లో పిడకలపై రివ్యూల వ్యవహారం వైరల్‌గా మారింది. అమెజాన్ లాంటి ఇ-కామర్స్ సైట్లల్లో పిడకల్ని అమ్మడం కొత్తేమీ కాదు. పల్లెటూళ్లల్లో పిడకలు దొరుకుతాయో లేదో తెలియదు కానీ... ఇ-కామర్స్ సైట్లల్లో మాత్రం 365 రోజులు అక్కడ పిడకలు దొరుకుతాయి. సంక్రాంతి సమయంలో వీటి సేల్స్ ఊపందుకుంటాయి. పిడకలు మాత్రమే కాదు రెడీమేడ్‌గా గొబ్బెమ్మలు కూడా ఉంటాయి. అయితే పల్లెటూళ్లల్లో పుట్టిపెరిగినవారికి ఇదంతా చిత్రవిచిత్రంగా అనిపిస్తుంది. పిడకల్ని ఆన్‌లైన్‌లో అమ్మడం ఏంటని ఆశ్చర్యపోతారు. కానీ సిటీ జనాలకు ఇదేం కొత్త కాదు. పిడకల్ని, గొబ్బెమ్మల్ని ఆర్డర్ చేసి మరీ తెప్పించుకుంటారు. ఇ-కామర్స్ సైట్లల్లో పిడకల్ని అమ్మడమే పెద్ద వింత అనుకుంటే, వాటిపై ఏకంగా రివ్యూలు రాయడం ఇప్పుడు మరో వింత.

cow dung, cow dung price, cow dung business ideas, cow dung cakes for sale, cow dung cake price, cow dung cake amazon, cow dung reviews, cow dung online sale, పిడకలు, పిడకల సేల్, ఆన్‌లైన్‌లో పిడకలు, అమెజాన్ పిడకలు, పిడకల రివ్యూ
(image: Amazon)


cow dung, cow dung price, cow dung business ideas, cow dung cakes for sale, cow dung cake price, cow dung cake amazon, cow dung reviews, cow dung online sale, పిడకలు, పిడకల సేల్, ఆన్‌లైన్‌లో పిడకలు, అమెజాన్ పిడకలు, పిడకల రివ్యూ
(image: Amazon)


ఒక్క అమెజాన్‌లో మాత్రమే కాదు ఫ్లిప్‌కార్ట్‌లోనూ పిడకలు అమ్మకానికి ఉన్నాయి. క్వాలిటీని, క్వాంటిటీని బట్టి రూ.500-600 మధ్య ధర ఉంటుంది. పిడకల్ని కొన్నవాళ్లు వాటిపై రివ్యూలు రాయడం చూసి నెటిజన్లు షాకవుతున్నారు. "అగ్నిహోత్ర కోసం ఈ పిడకల్ని వాడాం. మంచి సువాసనతో మొత్తం కాలిపోయింది. మెషీన్‌తో కాదు చేత్తో తయారు చేసిన పిడకలివి" అంటూ ఒకరు రివ్యూ రాశారు. ఇంకొకరైతే తమకు వచ్చిన పార్శిల్‌ని వీడియో తీసి మరీ అప్‌లోడ్ చేశారు. పిడకలు బాగున్నాయని కొందరు, ఏం బాగాలేవని మరికొందరు, క్వాలిటీ బాగుందని ఇంకొందరు ఇలా రివ్యూలు రాశారు. అంతేకాదు 3 స్టార్, 4 స్టార్, 5 స్టార్ రేటింగ్స్ కూడా ఇవ్వడం విశేషం. ఆ రివ్యూలు, రేటింగ్‌ల స్క్రీన్‌షాట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మరీ పిడకలపై ఇ-కామర్స్ సైట్‌లో రివ్యూలేంటన్న సెటైర్లు వినిపిస్తున్నాయి.



OnePlus 7 Series: అదిరిపోయిన వన్‌ప్లస్ 7, వన్‌ప్లస్ 7 ప్రో స్మార్ట్‌ఫోన్స్


ఇవి కూడా చదవండి:

Paytm Credit Card: పేటీఎం నుంచి క్రెడిట్ కార్డ్... లావాదేవీలపై క్యాష్‌బ్యాక్

Credit Card: క్రెడిట్ కార్డ్ కావాలా? ఈ టిప్స్ మీకోసమే...

Aadhaar: ఆధార్ కార్డు వాడట్లేదా? డీయాక్టివేట్ అయిపోతుంది
First published: May 15, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...