• HOME
  • »
  • NEWS
  • »
  • TECHNOLOGY
  • »
  • RESEARCHERS USE ROBOT DOG SPOT TO REMOTELY MAP RADIATION LEVELS IN RUSSIAS CHERNOBYL NS GH

Robot Dog: రష్యా అణుకేంద్రంలో పనిచేస్తున్న రోబో డాగ్.. ఈ వీడియో చూస్తే వావ్ అంటారు..

Robot Dog: రష్యా అణుకేంద్రంలో పనిచేస్తున్న రోబో డాగ్.. ఈ వీడియో చూస్తే వావ్ అంటారు..

Robot dog

Robot Dog: రష్యా శాస్త్రవేత్తలు రేడియేషన్ స్థాయులను గుర్తించడానికి రోబో డాగ్‌లను వాడుతున్నారు. రేడియేషన్ ఏ స్థాయిలో ఉందో తెలుసుకునేందుకు సెంట్రల్ ఎంటర్‌ప్రైజ్ ఫర్ రేడియో యాక్టివ్ వేస్ట్ మేనేజ్‌మెంట్, బ్రిస్టల్ యూనివర్సిటీ పరిశోధకులు ఈ ప్రయత్నం చేశారు.

  • Last Updated:
  • Share this:
రష్యా శాస్త్రవేత్తలు రేడియేషన్ స్థాయులను గుర్తించడానికి రోబో డాగ్‌లను వాడుతున్నారు. ఆ దేశంలో ఉన్న చెర్నోబిల్ ప్రాంతంలో రేడియేషన్ ఏ స్థాయిలో ఉందో తెలుసుకునేందుకు సెంట్రల్ ఎంటర్‌ప్రైజ్ ఫర్ రేడియో యాక్టివ్ వేస్ట్ మేనేజ్‌మెంట్, బ్రిస్టల్ యూనివర్సిటీ పరిశోధకులు ఈ ప్రయత్నం చేశారు. గతంలో రష్యాలోని చెర్నోబిల్ ప్రాంతంలో న్యూక్లియర్ రియాక్టర్ ప్రమాదం జరిగింది. తాజాగా అక్కడి నాలుగో నంబర్ రియాక్టర్ చూట్టూ ఉన్న ప్రాంతాన్ని అన్వేషించడానికి రోబో డాగ్‌ను శాస్త్రవేత్తలు సిద్ధం చేశారు. వాటిని స్పాట్ అని పిలుస్తున్నారని న్యూయార్క్ పోస్ట్‌ వార్తాసంస్థ ఒక కథనం ప్రచురించింది. రేడియేషన్‌ను కొలవడానికి ఉపయోగించే పరికరాలను స్పాట్ వెనుక భాగంలో అమర్చారు. దీని ద్వారా రేడియేషన్ సర్వేలు నిర్వహించడం పరిశోధకులకు సులభం కానుంది.

సర్వే, మ్యాపింగ్ కోసం..
చెర్నోబిల్ వద్ద చేసిన ఈ ప్రయోగం న్యూక్లియర్ ఇండస్ట్రీ అవసరాలకు రోబోటిక్ ప్లాట్‌ఫామ్‌లను అభివృద్ధి చేయడానికి ఉపయోగపడుతుందని యూనివర్సిటీకి చెందిన సీనియర్ పోస్ట్ డాక్టోరల్ రిసెర్చర్ డేవిడ్ మెగ్సన్ స్మిత్ చెబుతున్నారు. ప్రతిపాదిత జోన్లో రేడియేషన్ స్థాయిలను సర్వే చేసి.. 3డీ మ్యాపింగ్ చేయాలని రోబో డాగ్ కు టాస్క్ ఇచ్చినట్టు ఉక్రెయిన్‌కు చెందిన వార్తాసంస్థ ఉక్రెయిన్‌ ఫార్మ్ పేర్కొంది. రేడియో ధార్మిక వ్యర్థాలను తాత్కాలికంగా నిల్వ చేసిన రెండు సెక్టార్లలో ఈ ప్రయోగం చేశారు. ప్రయోగం జరుగుతున్న సమయంలో బ్రిస్టల్ విశ్వవిద్యాలయం పరిశోధకులు డ్రోన్లు, రిమోట్ తో ఆపరేట్ చేసే సెన్సార్లు, స్కానర్‌లను కూడా పరీక్షించారు.


ఘోరమైన ప్రమాదం..
చెర్నోబిల్ 1986లో ప్రమాదం జరిగింది. రియాక్టర్ డిజైన్, తయారీలో లోపాలు, అనుభవం లేని సిబ్బంది వల్ల ప్రమాదం జరిగిందని వార్తలు వచ్చాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు చెర్నోబిల్ ప్లాంట్ కార్మికులు మరణించారు. పేలుడు వల్ల ఏర్పడిన తీవ్రమైన రేడియేషన్ సిండ్రోమ్ కారణంగా కొన్ని వారాల్లో 28 మంది చనిపోయారు. గత సంవత్సరం బ్రిస్టల్ యూనివర్సిటీ పరిశోధకులు అక్కడికి వెళ్లారు. రెడ్ ఫారెస్ట్ అనే విద్యుత్ ప్లాంట్ చుట్టూ నాలుగు చదరపు మైళ్ల పరిధిలో మొదటిసారి డ్రోన్ ఆధారంగా మ్యాపింగ్ సర్వే చేసేందుకు వారు అప్పట్లో ఏర్పాట్లు చేశారు.
Published by:Nikhil Kumar S
First published:

అగ్ర కథనాలు