మీ వాట్సప్ హ్యాక్ అయిందా?

ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌తో యూజర్లకు ఫుల్ సెక్యూరిటీ ఇస్తున్నామని వాట్సప్ చెబుతుంటే... ఇప్పుడు ఆ యాప్‌లో లోపాలు బయటపడటం కలవరపరుస్తోంది. హ్యాకర్లు యూజర్ల వాట్సప్ అకౌంట్స్ హ్యాక్ చేసి ఫేక్ మెసేజెస్ పంపుతున్నట్టు ఓ పరిశోధనలో తేలింది.

news18-telugu
Updated: August 9, 2018, 2:07 PM IST
మీ వాట్సప్ హ్యాక్ అయిందా?
ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌తో యూజర్లకు ఫుల్ సెక్యూరిటీ ఇస్తున్నామని వాట్సప్ చెబుతుంటే... ఇప్పుడు ఆ యాప్‌లో లోపాలు బయటపడటం కలవరపరుస్తోంది. హ్యాకర్లు యూజర్ల వాట్సప్ అకౌంట్స్ హ్యాక్ చేసి ఫేక్ మెసేజెస్ పంపుతున్నట్టు ఓ పరిశోధనలో తేలింది.
  • Share this:
మీ వాట్సప్ ఓసారి చెక్ చేసుకోండి. మీకు తెలియకుండా ఏవైనా మెసేజెస్ పోస్ట్ అయ్యాయేమో చూడండి. అలా జరిగినట్టైతే మీ వాట్సప్ హ్యాక్ అయిందని అర్థం. ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌తో వాట్సప్ సెక్యూరిటీ సిస్టమ్ చాలా స్ట్రాంగ్‌గా ఉందని మీరు భ్రమపడితే బుక్కయినట్టేనని, వాట్సప్‌ను సైతం హ్యాక్ చేస్తున్నారని ఓ అధ్యయనం తేల్చింది. ఇజ్రాయిల్‌లోని సైబర్ సెక్యూరిటీ సంస్థ చెక్‌పాయింట్‌కు చెందిన పరిశోధకులు ఈ విషయాన్ని వెల్లడించారు.

వాట్సప్‌లో లోపాలున్నాయి. వాట్సప్‌లో ఉన్న లోపంతో హ్యాకర్లు సందేశాలను అడ్డుకునే, మార్చే అవకాశముంది. ప్రైవేట్‌గా, గ్రూపులో పంపిన మెసేజెస్‌కు ముప్పు ఉంది. అంతేకాదు తప్పుడు సమాచారాన్ని సృష్టించి వైరల్ చేయొచ్చు.

చెక్‌పాయింట్


ఇప్పటికే వాట్సప్‌లో ఫేస్ న్యూస్ వైరల్‌గా మారి అనేక దారుణాలకు, సమస్యలకు కారణమవుతున్న సమయంలో ఇలా లోపాలు బయటపడటం కలకలం రేపుతోంది.

ఈ అంశాన్ని జాగ్రత్తగా పరిశీలించాం. దీని వల్ల ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌కు వచ్చిన ముప్పేమీ లేదు. వాట్సప్ సందేశాలను పంపినవాళ్లు, స్వీకరించినవాళ్లు మాత్రమే చదవగలరు.
వాట్సప్ వివరణ.


ఇటీవలే ఫార్వర్డ్ సందేశాలకు 'ఫార్వర్డెడ్' లేబుల్ పెట్టామని, అంతేకాదు ఎక్కువగా షేర్లు చేసుకోకుండా నియంత్రిస్తున్నామంటోంది వాట్సప్. ఏదేమైనా ఇలా పలు వివాదాలతో వాట్సప్ వార్తల్లోకి రావడం యూజర్లను కలవరపరుస్తోంది.వాట్సప్ కొత్త ఫీచర్‌తో మీకు షాకే!
Published by: Santhosh Kumar S
First published: August 9, 2018, 2:04 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading