బీపీ చెక్ చేసే ఐఫోన్ యాప్!

బీపీ ఎంతుందో చెక్ చేయడానికి చాలా యాప్స్ ఉన్నాయి. ఇప్పుడు యాపిల్‌ ఐఫోన్ కోసం అలాంటి యాప్ తయారు చేస్తున్నారు పరిశోధకులు.

news18-telugu
Updated: September 10, 2018, 12:21 PM IST
బీపీ చెక్ చేసే ఐఫోన్ యాప్!
image: Reuters
  • Share this:
కొత్త "ఐఫోన్ ఎక్స్" యాప్ ఇకపై మీ బీపీని చెక్‌ చేసి వెంటనే రిజల్ట్ ఇస్తుంది. ఫింగర్ ప్రెస్సింగ్ మెథడ్ ద్వారా మీ బ్లడ్ ప్రెజర్‌ని కచ్చితంగా అంచనా వేసే యాప్‌ను మిచిగాన్ స్టేట్ యూనివర్సిటీ పరిశోధకులు తయారు చేస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకమైన పరికరాలు అవసరం లేదు. స్క్రీన్‌పై వేలిని గట్టిగా నొక్కితే చాలు... మీ బీపీ ఎంతుందో తెలిసిపోతుంది. ప్రస్తుతం ఈ యాప్‌కు సంబంధించిన వివరాలను సైంటిఫిక్ రిపోర్ట్స్ జర్నల్‌లో ప్రచురించారు.

ఇప్పటికే ఉన్న బీపీ మానిటరింగ్ యాప్స్ కన్నా ఇది భిన్నంగా ఉంటుంది. సెల్ఫీలు తీసుకున్నప్పుడు, టచ్‌స్క్రీన్‌పై క్లిక్ చేసినప్పుడు బీపీ ఎంతుందో రికార్డ్ చేస్తుంది. ఇలా ఎప్పటికప్పుడు బీపీని మానిటర్ చేస్తుండటం వల్ల రక్తపోటుపై అవగాహన పెరగడం, నియంత్రించుకోవడం మాత్రమే కాదు... గుండెజబ్బులు రాకుండా కాపాడుకోవడంతో పాటు, అకాల మరణాలను తగ్గించొచ్చన్నది పరిశోధకులు చెబుతున్నారు. ఈ యాప్ 2019 చివరినాటికి అందుబాటులోకి రానుంది.

ఇవి కూడా చదవండి:

ఫోర్ట్‌నైట్ గేమ్: 21 రోజుల్లో 2.3 కోట్ల యూజర్స్టాప్ 5 బడ్జెట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్!

Video: క్రెడిట్ కార్డ్స్... తీసుకోవాల్సిన జాగ్రత్తలు!

స్పోర్ట్స్, రేసింగ్ గేమ్ యాప్స్‌దే హవా!క్రెడిట్ కార్డ్ పేమెంట్స్‌లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు!

సెప్టెంబర్ 12న 'జియో ఫోన్ 2' ఫ్లాష్ సేల్

ఇండియాలో లాంఛైన వివో వీ11 ప్రో!

 
First published: September 10, 2018
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>