హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Heart Communication App: ఇది మనసులో మాటను గుర్తుపట్టి ఎమోజీలు ఇచ్చే యాప్.. ఎలా పని చేస్తుందంటే?

Heart Communication App: ఇది మనసులో మాటను గుర్తుపట్టి ఎమోజీలు ఇచ్చే యాప్.. ఎలా పని చేస్తుందంటే?

ఇది క్రీస్తుశకం 270 సంవత్సరం నాటి ఘటన. రోమ్ దేశాన్ని క్లాడియస్ చక్రవర్తి పాలిస్తున్న రోజులు. క్లాడియస్‌కు పెళ్లి అంటే పడదు. పెళ్లిళ్లపై నిషేధం కూడా విధించాడు. అదే సమయంలో వాలెంటైన్ అనే ఓ మతగురువు అందరికీ ప్రేమ సిద్ధాంతాన్ని బోధించేవారు. దగ్గరుండి పెళ్లిళ్లు చేయించేవాడు.

ఇది క్రీస్తుశకం 270 సంవత్సరం నాటి ఘటన. రోమ్ దేశాన్ని క్లాడియస్ చక్రవర్తి పాలిస్తున్న రోజులు. క్లాడియస్‌కు పెళ్లి అంటే పడదు. పెళ్లిళ్లపై నిషేధం కూడా విధించాడు. అదే సమయంలో వాలెంటైన్ అనే ఓ మతగురువు అందరికీ ప్రేమ సిద్ధాంతాన్ని బోధించేవారు. దగ్గరుండి పెళ్లిళ్లు చేయించేవాడు.

ఇద్దరు మనుషుల మనసులు మాట్లాడుకునేలా ఓ యాప్‌ను రూపొందిస్తున్నారు పరిశోధకులు. ప్రస్తుతం ప్రయోగదశలో ఉన్న ఈ యాప్‌ను వీలైనంత త్వరగా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

టెక్నాలజీ మనుషుల్ని దూరం చేస్తోంది అంటుంటారు. అదెంతవరకు నిజమో కానీ... అదే టెక్నాలజీ మనుషుల మనసుల్ని దగ్గర చేస్తోంది. ఇప్పటికే చాలా అధ్యయనాలు ఈ విషయాన్ని నిరూపించాయి. తాజాగా మరోసారి శాస్త్రవేత్తలు ఈ తరహా ప్రయత్నం చేస్తున్నారు. ఇద్దరు మనుషుల మనసులు మాట్లాడుకునేలా ఓ యాప్‌ను రూపొందిస్తున్నారు పరిశోధకులు. ప్రస్తుతం ప్రయోగదశలో ఉన్న ఈ యాప్‌ను వీలైనంత త్వరగా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అమెరికాలోని సీఎంయూకు చెందిన శాస్త్రవేత్తలు ఈ యాప్‌ను రూపొందిస్తున్నారు. అన్నట్లు ఇది మీ గుండె చప్పుడు (హార్ట్‌ బీట్‌ రేటు) ఆధారంగా పని చేస్తుంది. అంతేకాదు ఈ యాప్‌ కేవలం స్మార్ట్‌ వాచ్‌ల ద్వారా మాత్రమే పనిచేయనుంది..

అసోసియేషన్‌ ఫర్‌ కంప్యూటింగ్‌ మెషినరీ (ఏసీఎం), కంప్యూటర్‌ హ్యూమన్‌ ఇంటరాక్షన్ (సీహెచ్‌ఐ) ఎదుట ఇటీవల పరిశోధకులు బృందం ఈ యాప్‌ను ప్రదర్శించింది. ఆ వివరాల ప్రకారం... ఈ యాప్‌ను భార్య - భర్త, ప్రేయసి - ప్రియుడు ఈ యాప్‌ను స్మార్ట్‌ వాచ్‌లో ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి. అప్పుడు ఆ యాప్‌ హార్ట్‌ రేట్‌లో మార్పులు గమనించి మనసులోని భావాన్ని అంచనా వేస్తుంది. అంటే గుండె వేగంగా కొట్టుకుంటే, హార్ట్ బీట్‌లో తేడాను గమనించి కోపం లేదా అమితానందం ఎమోజీని సజెస్ట్‌ చేస్తుంది. అప్పుడు ఆ ఎమోజీని సెండ్‌ చేస్తే సరిపోతుంది. లేదు వేరే ఎమోజీ కావాలంటే దానిని పంపొచ్చు. లేదంటే ఎక్సర్‌సైజ్‌, భోజనం చేయడం లాంటి ఎమోజీలు కూడా సజెస్ట్‌ చేస్తుంది.

అలా స్మార్ట్‌ వాచ్‌ యాప్‌ ద్వారా వచ్చిన ఎమోజీలతో రిప్లైలు ఇవ్వొచ్చు. ఈ రిప్లైలు గుండె చప్పుడు ఆధారంగా పని చేయవు. వచ్చిన ఎమోజీ బట్టే రిప్లై ఎమోజీని సజెస్ట్‌ చేస్తుంది. లేదంటే మీకు కావాల్సిన ఎమోజీ కూడా పంపొచ్చు. ఉదాహరణకు ఒక వ్యక్తి హార్ట్‌ రేట్‌ ఆధారంగా హత్తుకునే ఎమోజీ, షేక్‌ హ్యాండ్‌ ఇచ్చే ఎమోజీ వస్తే... రిప్లైగా షేక్‌ హ్యాండ్‌ ఎమోజీ, థంబ్‌ ఎమోజీ ఇవ్వమని సజెషన్‌ వస్తాయి. ఇదన్నమాట సంగతి. శాస్త్రవేత్తలు ఈ యాప్‌ను గతేడాది ఏప్రిల్‌, మే నెలలో 20 జంటలపై ప్రయోగం చేశాయి. కరోనా మహమ్మారి వల్ల వాళ్లు ఒకరికొకరు దూరంగా ఉన్న సమయంలో ఈ యాప్‌ను వినియోగించేలా చేశారు. ఈ సమయంలో బయో సిగ్నల్స్, హార్ట్‌ రేట్‌ లాంటివి పరిశీలించారు. వాటికి తగ్గట్టుగా యాప్‌ పని చేసిందట.

మనసులో మాట చెప్పలేని వాళ్లకు ఈ యాప్‌ భలే ఉంటుంది కదా. గుండెచప్పుడును పసిగట్టి ఎదుట వ్యక్తికి తమ భావాలు తెలిసిపోయేలా చేస్తుంది. అయితే ఇద్దరూ యాప్‌ వాడాలి. ముందుగా చెప్పినట్లు ఈ యాప్‌ ప్రయోగ దశలో ఉంది. వినియోగానికి సిద్ధమైనప్పుడు ఇంకా మెరుగైన ఫలితాలు, ఆప్షన్లు రావొచ్చు.

First published:

Tags: Technology

ఉత్తమ కథలు