దిగ్గజ టెలికాం సంస్థ జియో మరో అత్యంత చౌకైన స్మార్ట్ ఫోన్ జియోఫోన్ నెక్స్ట్ (Jio Phone Next)ను విడుదల చేసి సంచలనం సృష్టించింది. ఈ ఫోన్ లో అనేక అద్భుత ఫీచర్లు ఉన్నాయి. ఈ ఫోన్ ప్రగతి ఆపరేటింగ్ సిస్టమ్(Pragati OS)పై పని చేస్తుంది. ఈ ఆపరేటింగ్ సిస్టమ్ ను గూగుల్, జియో కలిసి అభివృద్ధి చేశాయి. భారతీయ వినియోగదారులు అవసరాలను తీర్చడమే లక్ష్యంగా Google, Jio సంయుక్తంగా ఈ JioPhone Nextను అభివృద్ధి చేశాయి. ఈ ఆపరేటింగ్ సిస్టమ్(Operating System) సరికొత్త ఫీచర్లతో యూజర్లు మంచి అనుభూతిని ఇవ్వనుంది. గూగుల్ ప్లే స్టోర్(Google Play Store) లో అందుబాటులో ఉన్న మిలియన్ల కొద్దీ యాప్(Mobile Apps) లు ఈ ఆపరేటింగ్ సిస్టమపై పని చేస్తాయి. ప్రత్యేకమైన సెక్యూరిటీ ఫీచర్లు(Security Features) సైతం ఈ ఆపరేటింగ్ సిస్టమ్ లో ఉన్నాయి.
1. Voice first capabilities: కేవలం మాట్లాడడం ద్వారా ఫోన్ ను ఆపరేట్ చేయవచ్చు. (ఉదాహరణ: యాప్ లు ఓపెన్ చేయడం, సెట్టింగ్స్ మేనేజ్ చేయడం.) ఇంటర్నెట్ నుంచి సైతం సమాచారాన్ని కావాల్సిన భాషలో పొందొచ్చు.
2. Read Aloud: రీడ్ ఎలౌడ్ ఫీచర్ సహాయంతో యూజర్లు స్క్రీన్ పైన ఉన్న టెక్స్ట్ ను తమకు కావాల్సిన భాషలో చదివి వినిపించుకోవచ్చు.
3. Translate Now: ఇందులో ట్రాన్స్‌లేట్ నౌ అనే ఫీచర్ సైతం ఉంది. ఈ యాప్‌లో మొబైల్ స్క్రీన్ లేదా ఇమేజ్‌ను తమకు నచ్చిన భాషలో ట్రాన్స్‌లేట్ చేసుకునే సదుపాయం ఉంటుంది.
4. Easy and Smart Camera: ఈ ఫోన్లో స్మార్ట్, పవర్ ఫుల్ కెమెరాను పొందుపర్చారు. Potrait Modeతో పాటు అనేక రకాల ఫొటోగ్రఫీ మోడ్స్ ను ఇది సపోర్ట్ చేస్తుంది. అటోమోటిక్ బ్లర్డ్ బ్యాక్ గ్రౌండ్ ఫీచర్ ద్వారా యూజర్లు ఆకట్టుకునే ఫొటోలను పొందవచ్చు. నైడ్ మోడ్ ద్వారా లైట్ తక్కువగా ఉన్న సమయంలోనూ యూజర్లు మంచి ఫొటోలను తీసుకోవచ్చు.
JioPhone Next: జియోఫోన్ నెక్స్‌ట్ వచ్చేసింది... ఎంట్రీ ధర రూ.1,999 మాత్రమే
5. Access to millions of apps: గూగుల్ ప్లే స్టోర్ లోని మిలియన్ల కొద్ది యాప్ లను ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ లో గూగుల్, జియో యాప్స్ కు సంబంధించిన ప్రీ లోడ్ యాప్ లు ఉంటాయి.
6. Automatic feature updates: ఈ ఫోన్ లో సెక్యూరిటీ, నూతన ఫీచర్లకు సంబంధించిన అప్ డేట్లను ఎప్పటికప్పుడు అందించేలా ఓఎస్ ను తీర్చిదిద్దారు.
7. Easily share with friends: ఈ ఫోన్ లోని ‘Nearby Share’ ఫీచర్ ద్వారా ఇంటర్ నెట్ లేకుండానే యాప్స్, ఫైల్స్, ఫొటోలు, వీడియోలు, మ్యూజిక్ ను ఇతరులకు షేర్ చేయొచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Google, Google Play store, Jio, Jio phone, Mukesh Ambani, Reliance Jio