JioMart: మీ వాట్సప్ ద్వారా జియోమార్ట్‌లో సరుకులు కొనొచ్చు ఇలా

JioMart | రిలయెన్స్ జియోమార్ట్ సేవలు ప్రారంభమయ్యాయి. వాట్సప్‌లో వస్తువులు ఎలా ఆర్డర్ చేయాలో తెలుసుకోండి.

news18-telugu
Updated: April 27, 2020, 5:50 PM IST
JioMart: మీ వాట్సప్ ద్వారా జియోమార్ట్‌లో సరుకులు కొనొచ్చు ఇలా
JioMart: మీ వాట్సప్ ద్వారా జియోమార్ట్‌లో సరుకులు కొనొచ్చు ఇలా (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
రిలయెన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఇటీవల ఫేస్‌బుక్‌తో 5.7 బిలియన్ డాలర్ల ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. ఈ ఒప్పందం కుదిరిన కొన్ని రోజుల్లోనే జియోమార్ట్ ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్ అందుబాటులోకి వచ్చింది. ఇందుకోసం కంపెనీ వాట్సప్ నెంబర్‌ను ప్రారంభించింది. కస్టమర్లు 50,000 పైగా ఉత్పత్తుల్ని వాట్సప్‌లో ఆర్డర్ చేయొచ్చు. ఇందులో నిత్యావసర వస్తువులు, ఇతర ఉత్పత్తుల్ని ఆర్డర్ చేయొచ్చు. రిలయెన్స్ రీటైల్‌ సొంత ప్రొడక్ట్స్‌తో పాటు ఇతర బ్రాండ్ల ఉత్పత్తుల్ని కొనొచ్చు. ప్రస్తుతం జియోమార్ట్ మహారాష్ట్రలోని నవీ ముంబై, థానె, కళ్యాణ్ ప్రాంతాల్లో ప్రారంభమైంది. త్వరలో దేశవ్యాప్తంగా ఈ సేవలు ప్రారంభమయ్యే అవకాశముంది. త్వరలోనే జియోమార్ట్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ యాప్స్ కూడా రిలీజ్ అయ్యే అవకాశముంది. మరి మీ ప్రాంతంలో జియోమార్ట్ సేవలు ప్రారంభమయ్యాక వాట్సప్‌లో ఎలా ఆర్డర్ చేయాలో తెలుసుకోండి.

JioMart via WhatsApp: వాట్సప్‌లో జియోమార్ట్ ఆర్డర్ చేయండి ఇలా



ముందుగా జియోమార్ట్ వాట్సప్ నెంబర్ 88500 08000 మీ కాంటాక్ట్స్‌లో సేవ్ చేయండి.
నెంబర్ సేవ్ చేసిన తర్వాత వాట్సప్ ఓపెన్ చేసి ఈ నెంబర్‌కు 'Hi' అని మెసేజ్ చేయండి.
జియో మార్ట్ నుంచి మీ వాట్సప్‌కు ఆటోమెటెడ్ టెక్స్ట్‌ మెసేజ్ వస్తుంది.
ఆ మెసేజ్‌లో ఓ లింక్ ఉంటుంది. ఆ లింక్ ద్వారా మీ ప్రాంతం, మీరు కొనాలనుకుంటున్న ప్రొడక్ట్స్ సెలెక్ట్ చేయండి.
ఈ లింక్ 30 నిమిషాలు మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత లింక్ పనిచేయదు.30 నిమిషాలు దాటితే మళ్లీ 'Hi' అని మెసేజ్ చేయాలి.
లింక్ క్లిక్ చేసి మీ వివరాలు ఎంటర్ చేసిన తర్వాత Proceed పైన క్లిక్ చేయాలి.
ఆ తర్వాత జియోమార్ట్ మీ ప్రాంతంలో అందుబాటులో ఉన్న ప్రొడక్ట్స్ లిస్ట్‌ని చూపిస్తుంది.
మీరు కొనాలనుకునే ఐటెమ్స్ సెలెక్ట్ చేసి Place Order పైన క్లిక్ చేయాలి.
మీ ఆర్డర్ సిద్ధమైన తర్వాత మర్చంట్ నుంచి మీకు సమాచారం అందుతుంది.
మీరు నేరుగా స్టోర్‌కు వెళ్లి జియోమార్ట్‌లో ఆర్డర్‌ చేసిన ప్రొడక్ట్ తీసుకోవచ్చు.

జియోమార్ట్ ఆన్‌లైన్ టు ఆఫ్‌లైన్-O2O బిజినెస్ ప్లాట్‌ఫామ్. మీకు దగ్గర్లో ఉన్న రీటైల్ స్టోర్స్‌లోని ప్రొడక్ట్స్‌ని మీరు ఇంట్లో కూర్చొని ఆర్డర్ చేయొచ్చు. యాప్ లాంఛ్ అయిన తర్వాత ఫ్రీ హోమ్ డెలివరీ, ఎక్స్‌ప్రెస్ డెలివరీ లాంటి సేవల్ని కూడా ప్రారంభించనుంది జియోమార్ట్. దేశవ్యాప్తంగా మూడు కోట్ల ఆన్‌లైన్ స్టోర్స్‌ని 20 కోట్ల మంది కస్టమర్లకు కనెక్ట్ చేయాలన్నది జియోమార్ట్ ప్లాట్‌ఫామ్ లక్ష్యం.

ఇవి కూడా చదవండి:

Fitness Apps: స్మార్ట్ టీవీ ఉందా? ఈ ఫిట్‌నెస్ యాప్స్‌ ట్రై చేయండి

Realme X50m 5జీ: రియల్‌మీ ఎక్స్50ఎం 5జీ స్మార్ట్‌ఫోన్ రిలీజ్... ఫీచర్స్ ఇవే

WhatsApp: వాట్సప్ వాడేవారికి త్వరలో ఈ తిప్పలు తప్పవు
First published: April 27, 2020, 5:44 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading