JioFiber Set-top Box: నెల రోజుల్లో వచ్చేస్తున్న జియోఫైబర్ సెట్-టాప్ బాక్స్... ప్రత్యేకతలివే

Reliance JioFiber Set-top Box | జియోఫైబర్ సెట్-టాప్ బాక్స్‌తో ఐపీటీవీ సేవల్ని పొందొచ్చు. అంటే వేరుగా డీటీహెచ్ కనెక్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు.

news18-telugu
Updated: October 30, 2019, 11:54 AM IST
JioFiber Set-top Box: నెల రోజుల్లో వచ్చేస్తున్న జియోఫైబర్ సెట్-టాప్ బాక్స్... ప్రత్యేకతలివే
JioFiber Set-top Box: నెల రోజుల్లో వచ్చేస్తున్న జియోఫైబర్ సెట్-టాప్ బాక్స్... ప్రత్యేకతలివే (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
జియోఫైబర్ సెట్-టాప్ బాక్స్ కోసం ఎదురుచూస్తున్నవారికి శుభవార్త. ప్రస్తుత కస్టమర్లతో పాటు, కొత్త కస్టమర్లకు జియోఫైబర్ సెట్-టాప్ బాక్స్ డిసెంబర్ నాటికి అందుబాటులోకి రానుందన్న వార్తలొస్తున్నాయి. జియో ఫరెవర్ యాన్యువల్ ప్లాన్స్ తీసుకున్నవారికి జియోఫైబర్ సెట్-టాప్ బాక్స్‌తో పాటు ఇతర డివైజ్‌లు డిసెంబర్‌లో లభిస్తాయని డేటాక్వెస్ట్ కథనం పబ్లిష్ చేసింది. అదే నెలలో జియోఫైబర్ సెట్-టాప్ బాక్స్‌తో పాటు లైవ్ టెలివిజన్ సేవలు కూడా ప్రారంభం కానున్నాయి. దాంతో పాటు జియో ఫరెవర్ యాన్యువల్ ప్లాన్ సబ్‌స్క్రైబ్ చేసుకున్నవారికి ఉచితంగా 4కే టీవీ సెట్స్ కూడా లభించనున్నాయి. అయితే ఈ వార్తలపై రిలయెన్స్ జియో నుంచి అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు. అయితే ప్రస్తుత కస్టమర్లు, కొత్త యూజర్లు జియోఫైబర్ ఇన్‌స్టాలేషన్ టెక్నీషియన్లను సెట్-టాప్ బాక్సుల గురించి అడిగితే ఈ ఏడాది చివరినాటికి వస్తాయని సమాధానం చెబుతున్నారు.

జియోఫైబర్ సెట్-టాప్ బాక్స్‌తో ఐపీటీవీ సేవల్ని పొందొచ్చు. అంటే వేరుగా డీటీహెచ్ కనెక్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. వాస్తవానికి స్థానిక కేబుల్ ఆపరేటర్లతో కలిసి కేబుల్ సేవల్ని అందించాలని రిలయెన్స్ జియో భావించింది. అయితే ఎంఎస్ఓలు, స్థానిక కేబుల్ ఆపరేటర్లతో రిలయెన్స్ జియో ఎలాంటి ఒప్పందం కుదుర్చుకోలేదన్న వార్తలొస్తున్నాయి. అందుకే సబ్‌స్క్రైబర్లకు ఐపీటీవీ సేవల్ని రిలయెన్స్ జియో అందించనుందన్న చర్చ జరుగుతోంది. జియోఫైబర్ సెట్-టాప్ బాక్స్ ఆండ్రాయిడ్ 9.0 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. కొన్ని స్ట్రీమింగ్ యాప్స్ ముందుగానే ఇన్‌స్టాల్ చేసి ఉంటాయి.

తక్కువ ధరతో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది... రెడ్‌మీ 8 ఎలా ఉందో చూడండి





ఇవి కూడా చదవండి:

TikTok: డౌన్‌లోడ్స్‌లో ఫేస్‌బుక్‌ను మించిపోయిన టిక్‌టాక్

Mi Note 10: షావోమీ మరో సంచలనం... 108 మెగాపిక్సెల్ కెమెరాతో స్మార్ట్‌ఫోన్LG W30 Pro: మరో కొత్త ఫోన్ వచ్చేసింది... ఎల్‌జీ డబ్ల్యూ30 ప్రో ధర రూ.12,490
First published: October 30, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>