JioFiber: రూ.199 కాంబో ప్లాన్‌తో 1000జీబీ డేటా

JioFiber | వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నవారి కోసం రిలయెన్స్ జియోఫైబర్ కాంబో ప్లాన్ ప్రకటించింది. ఆ వివరాలు తెలుసుకోండి.

news18-telugu
Updated: April 20, 2020, 10:12 AM IST
JioFiber: రూ.199 కాంబో ప్లాన్‌తో 1000జీబీ డేటా
Jio Fiber: రూ.199 కాంబో ప్లాన్‌తో 1000జీబీ డేటా (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారా? ప్రస్తుతం మీ ఇంటర్నెట్ డేటా సరిపోవట్లేదా? మీకు రిలయెన్స్ జియో ఫైబర్ కనెక్షన్ ఉందా? జియోఫైబర్ కాంబో ప్లాన్ ప్రకటించింది. రూ.199 కాంబో ప్లాన్ రీఛార్జ్ చేస్తే ఏకంగా 1000 జీబీ డేటా పొందొచ్చు. రూ.199 ప్లాన్ జీఎస్‌టీతో కలిపి రూ.234 చెల్లించాల్సి ఉంటుంది. కొత్త జియో ఫైబర్ కస్టమర్లతో పాటు పాత కస్టమర్లు కూడా ఈ ప్లాన్ వాడుకోవచ్చు. ఇక రూ.199 ప్లాన్ బెనిఫిట్స్ చూస్తే వేలిడిటీ 7 రోజులు. 100 ఎంబీపీఎస్ స్పీడ్‌తో 1000 జీబీ వాడుకోవచ్చు. ఆ తర్వాత డేటా స్పీడ్ 1 ఎంబీపీఎస్‌కు తగ్గుతుంది. ఉచిత వాయిస్ కాల్స్ బెనిఫిట్స్ కూడా వాడుకోవచ్చు. మై జియో యాప్స్‌కు యాక్సెస్, ఉచిత ఎస్ఎంఎస్ లాంటి బెనిఫిట్స్ మాత్రం లేవు.

దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను దృష్టిలో పెట్టుకొని యూజర్ల కోసం రిలయెన్స్ జియో అనేక ఆఫర్లను ప్రకటిస్తోంది. ఉచితంగా రిలయెన్స్ జియోఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ 10ఎంబీపీఎస్ ప్లాన్‌ను ప్రకటించింది. దీంతో పాటు జియో కొత్త ప్లాన్స్‌ని తీసుకొచ్చింది. అంతేకాదు... జియో యూజర్లు ఏటీఎం ద్వారా రీఛార్జ్ చేసే అవకాశాన్ని కల్పించింది. స్మార్ట్‌ఫోన్ యూజర్లకు మాత్రమే కాదు... ఫీచర్ ఫోన్స్ వాడేవారికి కూడా జియో ప్రత్యేక ఆఫర్స్ ప్రకటించింది.

ఇవి కూడా చదవండి:

JioPOS Lite App: ఈ జియో యాప్‌తో డబ్బు సంపాదించండి ఇలా

WhatsApp: వాట్సప్‌లో వీడియోకాల్స్ చేసేవారికి గుడ్ న్యూస్...

LIC Policy: రోజుకు రూ.28 పొదుపు... చేతికి రూ.3.97 లక్షలు... ఆధార్ కార్డ్ ఉన్నవారికి మాత్రమే
First published: April 20, 2020, 10:12 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading