Jio-Redmi Go Offer: ఇవాళే రెడ్‌మీ గో సేల్... జియో నుంచి రూ.2200 క్యాష్‌బ్యాక్, 100 జీబీ డేటా అదనం

Reliance Jio-Xiaomi Redmi Go Offer | రూ.198 రీఛార్జ్ చేసుకుంటే రూ.148 చెల్లిస్తే చాలు. రూ.299 రీఛార్జ్ చేసుకుంటే రూ.249 చెల్లిస్తే చాలు. ఇలా 44 రీఛార్జ్‌లపై డిస్కౌంట్ పొందొచ్చు. 100 జీబీ డేటా అదనంగా లభిస్తుంది. 10 జీబీ డేటా కూపన్లు 10 వస్తాయి.

news18-telugu
Updated: March 25, 2019, 12:12 PM IST
Jio-Redmi Go Offer: ఇవాళే రెడ్‌మీ గో సేల్... జియో నుంచి రూ.2200 క్యాష్‌బ్యాక్, 100 జీబీ డేటా అదనం
Jio-Redmi Go Offer: ఇవాళే రెడ్‌మీ గో సేల్... జియో నుంచి రూ.2200 క్యాష్‌బ్యాక్, 100 జీబీ డేటా అదనం
  • Share this:
రెడ్‌మీ గో స్మార్ట్‌ఫోన్ కొన్నవారికి, కొనాలనుకునేవారికీ శుభవార్త. జియో నుంచి రూ.2,200 ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. దాంతో పాటు 100 జీబీ డేటా అదనంగా పొందొచ్చు. ఈ మేరకు రిలయెన్స్ జియో, షావోమీల మధ్య ఒప్పందం కుదిరింది. #AapkiNayiDuniya పేరుతో షావోమీ ఇటీవల రిలీజ్ చేసిన రెడ్‌మీ గో... బడ్జెట్ సెగ్మెంట్‌లో సంచలనాలు సృష్టిస్తోంది. రెడ్‌మీ గో తొలి సేల్ మార్చి 22న జరిగింది. మార్చి 25 మధ్యాహ్నం 2 గంటలకు మరోసారి రెడ్‌మీ గో ఫ్లాష్ సేల్ జరగనుంది.

Jio-Redmi Go Offer: వివరాలివే


రూ.2,200 ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్... రూ.50 చొప్పున 44 డిస్కౌంట్ ఓచర్లు. రూ.198, రూ.299 రీఛార్జ్‌లకు మాత్రమే వర్తింపు. ఈ రీఛార్జ్‌లపై డిస్కౌంట్ ఓచర్లు రీడీమ్ చేసుకోవచ్చు. అంటే రూ.198 రీఛార్జ్‌కు రూ.148 చెల్లిస్తే చాలు. రూ.299 రీఛార్జ్‌కు రూ.249 చెల్లిస్తే చాలు. ఇలా 44 రీఛార్జ్‌లపై డిస్కౌంట్ పొందొచ్చు. 100 జీబీ డేటా అదనంగా లభిస్తుంది. 10 జీబీ డేటా కూపన్లు 10 వస్తాయి.

Xiaomi Redmi Go JIO offer, Redmi Go JIO discount, Xiaomi Redmi Go sale, Xiaomi Redmi Go android go, Xiaomi Redmi Go specs, Xiaomi Redmi Go features, Xiaomi Redmi Go specifications, Xiaomi Redmi Go india price, Xiaomi Redmi Go flipkart, smartphone under Rs 5000, రెడ్‌మీ గో జియో ఆఫర్, జియో ఆఫర్స్, రిలయెన్స్ జియో, రెడ్‌మీ గో సేల్, రెడ్‌మీ గో ఫ్లిప్‌కార్ట్, రెడ్‌మీ గో, రెడ్‌మీ గో స్పెసిఫికేషన్స్, రెడ్‌మీ గో ఫీచర్స్, రెడ్‌మీ గో సేల్, ఆండ్రాయిడ్ గో స్మార్ట్‌ఫోన్
రెడ్‌మీ గో


ఆండ్రాయిడ్ లైట్ వర్షన్ 'ఆండ్రాయిడ్ గో' ఓఎస్‌తో షావోమీ రిలీజ్ చేసిన తొలి ఫోన్ రెడ్‌మీ గో. ఫేస్‌బుక్, వాట్సప్, టిక్‌టాక్, యూట్యూబ్‌ లాంటి యాప్స్ అన్నీ లైట్‌ వర్షన్‌లో లభిస్తాయి. మెమొరీ 128 జీబీ వరకు పెంచుకోవచ్చు. డ్యూయెల్ సిమ్ స్లాట్‌ ఉండటం మరో విశేషం. ఇరవైకి పైగా ప్రాంతీయ భాషల్ని సపోర్ట్ చేస్తుంది. హిందీ, ఇంగ్లీష్‌లో గూగుల్ అసిస్టెంట్‌ ఉపయోగించుకోవచ్చు.



రెడ్‌మీ గో స్పెసిఫికేషన్స్
డిస్‌ప్లే: 5 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే, 1280x720 పిక్సెల్స్ర్యామ్: 1 జీబీ ర్యామ్
ఇంటర్నల్ స్టోరేజ్: 8 జీబీ
ప్రాసెసర్: స్నాప్‌డ్రాగన్ 425
రియర్ కెమెరా: 8 మెగాపిక్సెల్
ఫ్రంట్ కెమెరా: 5 మెగాపిక్సెల్
బ్యాటరీ: 3000 ఎంఏహెచ్
ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 8.1 ఓరియో
సిమ్ సపోర్ట్: డ్యూయెల్ సిమ్
కలర్స్: బ్లూ, రెడ్, బ్లాక్
ధర: రూ.4,499

Photos: చీప్ అండ్ బెస్ట్ స్మార్ట్‌ఫోన్... Redmi Go ధర రూ.4,499 మాత్రమే...

ఇవి కూడా చదవండి:

Post Office RD: పోస్ట్ ఆఫీసులో రికరింగ్ డిపాజిట్... లాభాలు ఇవే

Flipkart Mobiles Bonanza: ఐపీఎల్ స్పెషల్... ఫ్లిప్‌కార్ట్‌లో మరోసారి మొబైల్ బొనాంజా

PUBG Mobile Ban: పబ్‌జీపై ఆంక్షలు... 6 గంటలు ఆడేందుకే అనుమతి
First published: March 25, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు