హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Jio Cashback: జియో యూజర్లకు ప్రతీ రోజూ రూ.200 Cashback... ఎలా పొందాలంటే

Jio Cashback: జియో యూజర్లకు ప్రతీ రోజూ రూ.200 Cashback... ఎలా పొందాలంటే

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

Jio Cashback | జియో యూజర్లు మూడు ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్స్‌పై (Jio Plans) జియోమార్ట్ మహా క్యాష్‌బ్యాక్ పొందొచ్చు. రోజూ రూ.200 వరకు క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఏ ప్లాన్స్‌పై క్యాష్‌బ్యాక్ పొందొచ్చో తెలుసుకోండి.

జియో యూజర్లకు శుభవార్త. రిలయన్స్ జియో కొన్ని రీఛార్జ్ ప్లాన్స్‌పై 'జియోమార్ట్ మహా క్యాష్‌బ్యాక్' ఆఫర్ ప్రకటించింది. ఈ ఆఫర్ ద్వారా జియో యూజర్లు ప్రతీ రోజూ రూ.200 వరకు క్యాష్‌బ్యాక్ పొందొచ్చు. ఇందుకోసం యూజర్లు జియో మొబైల్ నెంబర్‌కు రూ.200 కన్నా ఎక్కువ రీఛార్జ్ చేయాలి. వారికి 20 శాతం లేదా రూ.200 వరకు 'జియోమార్ట్ మహా క్యాష్‌బ్యాక్' లభిస్తుంది. కేవలం మూడు ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్స్‌కు మాత్రమే ఈ ఆఫర్ లభిస్తోంది. రూ.249, రూ.555, రూ.599 ప్లాన్స్‌పై ఈ క్యాష్‌బ్యాక్ పొందొచ్చు. ఈ ప్లాన్స్ ద్వారా లభించే బెనిఫిట్స్ గురించి తెలుసుకోండి.

Jio Rs 249 Plan: రిలయన్స్ జియో రూ.249 ప్లాన్ రీఛార్జ్ చేస్తే 28 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 2జీబీ డేటా వాడుకోవచ్చు. మొత్తం 56 జీబీ డేటా ఉపయోగించుకోవచ్చు. అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ చేయొచ్చు. రోజూ 100 ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి. జియో యాప్స్ సబ్‌స్క్రిప్షన్ ఉచితం. 20 శాతం జియోమార్ట్ మహా క్యాష్‌బ్యాక్ లభిస్తుంది.

Jio Plans: ఈ ప్లాన్స్ రీఛార్జ్ చేసి ఇండియా-పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ ఫ్రీగా చూడండి

Jio Rs 555 Plan: రిలయన్స్ జియో రూ.555 ప్లాన్ రీఛార్జ్ చేస్తే 84 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 1.5జీబీ డేటా వాడుకోవచ్చు. మొత్తం 126 జీబీ డేటా ఉపయోగించుకోవచ్చు. అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ చేయొచ్చు. రోజూ 100 ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి. జియో యాప్స్ సబ్‌స్క్రిప్షన్ ఉచితం. 20 శాతం జియోమార్ట్ మహా క్యాష్‌బ్యాక్ లభిస్తుంది.

Jio Rs 599 Plan: రిలయన్స్ జియో రూ.599 ప్లాన్ రీఛార్జ్ చేస్తే 84 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 2జీబీ డేటా వాడుకోవచ్చు. మొత్తం 168 జీబీ డేటా ఉపయోగించుకోవచ్చు. అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ చేయొచ్చు. రోజూ 100 ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి. జియో యాప్స్ సబ్‌స్క్రిప్షన్ ఉచితం. 20 శాతం జియోమార్ట్ మహా క్యాష్‌బ్యాక్ లభిస్తుంది.

Poco F3 GT: తొలిసారి ఆఫర్‌లో పోకో ఎఫ్3 జీటీ... రూ.28,999 విలువైన స్మార్ట్‌ఫోన్ రూ.12,000 లోపే కొనండి ఇలా

జియో రీఛార్జ్‌లతో మాత్రమే కాదు... రిలయన్స్ స్మార్ట్, రిలయన్స్ ఫ్రెష్, స్మార్ట్ పాయింట్, జియో మార్ట్, రిలయన్స్ డిజిటల్, మైజియో స్టోర్, జియో పాయింట్స్, రిలయన్స్ ట్రెండ్స్, ప్రాజెక్ట్ ఈవ్, ఆజియో లాంటి రిలయన్స్ స్టోర్స్ అన్నింటిలో జరిపే లావాదేవీలకు జియోమార్ట్ క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ప్రతీ చోటా కనీసం రూ.200 లావాదేవీ జరిపితేనే క్యాష్‌బ్యాక్ పొందొచ్చు. ప్రతీ రోజు గరిష్టంగా రూ.200 వరకు క్యాష్‌బ్యాక్ పొందొచ్చు. జియోమార్ట్ క్యాష్‌బ్యాక్‌ను వేర్వేరు ప్రొడక్ట్స్‌కి రీడీమ్ చేసుకోవచ్చు.

First published:

Tags: Jio, JioMart, Reliance Jio