ఇండియన్ టెలికామ్ సెక్టార్‌లో రిలయెన్స్ జియో జోరు కొనసాగుతోంది. అక్టోబర్‌లో రిలయెన్స్ జియో 91 లక్షల మంది కొత్త సబ్‌స్క్రైబర్లను చేర్చుకుంది. దీంతో రిలయెన్స్ జియో యూజర్ బేస్ 36.43 కోట్లకు చేరుకుందని టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా-TRAI తాజా లెక్కలు చెబుతున్నాయి. రిలయెన్స్ జియో ఐయూసీ ఛార్జీలను ప్రకటించినా యూజర్ల నుంచి ఆదరణ తగ్గలేదని ఈ లెక్కలు చెబుతున్నాయి. నిమిషానికి 6 పైసల చొప్పున ఐయూసీ ఛార్జీలను రిలయెన్స్ జియో అక్టోబర్‌లోనే ప్రకటించింది. అదే నెలలో జియో యూజర్ల సంఖ్య భారీగా పెరగడం విశేషం. అక్టోబర్ లెక్కల ప్రకారం రిలయెన్స్ జియో మార్కెట్ షేర్ 30.79%. ఆంధ్రప్రదేశ్, కోల్‌కతా, మధ్యప్రదేశ్, పంజాబ్, రాజస్తాన్ సర్కిళ్లలో రిలయెన్స్ జియో టాప్‌లో నిలిచింది.
వొడాఫోన్ ఐడియా 1.9 లక్షల మంది సబ్‌స్క్రైబర్లను చేర్చుకొని 37.27 కోట్ల యూజర్ బేస్‌కు చేరుకోగా, 81,974 మంది సబ్‌స్క్రైబర్లను చేర్చుకొని 32.56 కోట్లకు చేరుకుంది భారతీ ఎయిర్‌టెల్. ఇక మొత్తంగా చూస్తే వైర్‌లెస్ టెలికామ్ సబ్‌స్క్రైబర్ల సంఖ్య సెప్టెంబర్‌లో 117.37 కోట్లు ఉండగా, అక్టోబర్‌లో 118.34 కోట్లకు చేరుకుంది. 0.82 శాతం వృద్ధి కనిపించింది. వొడాఫోన్ ఐడియా మార్కెట్ షేర్ 31.49% కాగా, భారతీ ఎయిర్‌టెల్ మార్కెట్ షేర్ 27.52%.
Redmi K20 Pro: తక్కువ ధర, అదిరిపోయిన ఫీచర్స్... రెడ్‌మీ కే20, రెడ్‌మీ కే20 ప్రో ఎలా ఉందో చూడండి
ఇవి కూడా చదవండి:
WhatsApp New Feature: వాట్సప్‌లో మరో సరికొత్త ఫీచర్... వాడుకోవచ్చు ఇలా
Special Trains: సంక్రాంతికి ఊరెళ్లేవారికి గుడ్ న్యూస్... మరిన్ని స్పెషల్ ట్రైన్స్ ప్రకటించిన రైల్వే
EPFO: మీకు రెండు పీఎఫ్ అకౌంట్లు ఉన్నాయా? కలిపేస్తే లాభమిదే...
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: AIRTEL, Jio, Jio phone, Reliance Jio, Telecom, TRAI, VODAFONE, Vodafone Idea