5G అందుబాటులోకి వస్తున్న నేపథ్యంలో, టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) అక్టోబర్ నెలలో 4G స్పీడ్ టెస్ట్ గణాంకాలను విడుదల చేసింది. రిలయన్స్ జియో సగటు 4G డౌన్లోడ్, అప్లోడ్ స్పీడ్‌లో నంబర్ వన్ స్థానంలో కొనసాగుతోంది. TRAI విడుదల చేసిన డేటా ప్రకారం, జియో సగటు 4G డౌన్లోడ్ వేగం సెప్టెంబర్‌లో 19.1 Mbps నుండి అక్టోబర్‌లో 20.3 Mbpsకి పెరిగింది.
సగటు డౌన్లోడ్ స్పీడ్ విషయంలో Airtel, Vi (Vodafone-Idea) మధ్య గట్టి పోరు జరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. అక్టోబర్‌లో ఎయిర్టెల్ సగటు 4G డౌన్లోడ్ వేగం 15 Mbps కాగా Vi (వోడాఫోన్-ఐడియా) 14.5 Mbps. కానీ Airtel, Viతో పోలిస్తే Reliance Jio యొక్క సగటు 4G డౌన్లోడ్ వేగం 5 Mbps ఎక్కువ.
Whatsapp Polls Feature: వాట్సప్‌లో పోల్స్ ఫీచర్ వచ్చేసింది... పోల్ ఇలా క్రియేట్ చేయాలి
సగటు 4G అప్లోడ్ వేగం పరంగా కూడా, రిలయన్స్ జియో గత నెలలో మొదటి సారి తొలి స్థానానికి చేరుకుంది. అక్టోబర్ నెలలో కూడా కంపెనీ తన స్థానాన్ని నిలబెట్టుకుంది. 6.2 Mbps సగటు 4G అప్లోడ్ వేగంతో జియో టాప్ లో నిలిచింది.
Vi (వోడాఫోన్-ఐడియా) 4.5 Mbps వేగంతో రెండవ స్థానంలో కొనసాగింది. అదే సమయంలో, ఎయిర్టెల్ అప్లోడ్ స్పీడ్‌లో నిరంతర క్షీణత ఉంది. అక్టోబర్‌లో ఎయిర్టెల్ సగటు 4G అప్లోడ్ వేగం ఆందోళనకరంగా 2.7 Mbpsకి చేరుకుంది. ఎయిర్టెల్ అప్లోడ్ వేగం జియోలో సగం కంటే తక్కువకు చేరుకుంది.
30 Days Validity: జియో, ఎయిర్టెల్, Vi యూజర్లకు 30 రోజుల వేలిడిటీ ప్లాన్స్ ఇవే
ఇక జియో ట్రూ 5జీ సేవలు గత నెలలో ప్రారంభమయ్యాయి. మొదట ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, వారణాసిలో జియో 5జీ సేవలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇటీవల హైదరాబాద్ , బెంగళూరులో జియో 5జీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. దేశంలో ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, చెన్నై, వారణాసి, నథ్‌ద్వారా, బెంగళూరు, హైదరాబాద్ నగరాల్లో 5జీ సేవలు అందుబాటులోకి ఉన్నాయి. జియో వెల్కమ్ ఆఫర్లో భాగంగా 500ఎంబీపీఎస్ నుంచి 1జీబీపీఎస్ స్పీడ్‌తో జియో యూజర్లు తమ స్మార్ట్ఫోన్లలో జియో 5జీ సేవల్ని వాడుకోవచ్చు. ఎలాంటి ఖర్చు లేకుండా జియో 5జీ నెట్‌వర్క్‌ను ఉపయోగించుకోవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Jio, Jio TRUE 5G, Reliance Jio