ఆంధ్రప్రదేశ్‌లోని జియో యూజర్లకు శుభవార్త. రాష్ట్రంలో 5జీ సేవలను అతి త్వరలో ప్రారంభించేందుకు రిలయన్స్ జియో (Reliance Jio) సమాయత్తమవుతోంది. జియో ట్రూ 5జీ (Jio True 5G) సేవలు వీలైనంత త్వరగా అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్ర ప్రజలకు 5జీ సేవలను వేగంగా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు జియో తన నెట్వర్క్‌పై దృష్టి పెట్టింది. విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి నగరాలతో సహా రాష్ట్రవ్యాప్తంగా కొన్ని ప్రధాన పట్టణాల్లో జియో తన 4జీ నెట్వర్క్‌ను 5జీ నెట్వర్క్‌గా అప్డేట్ చేయనుంది. దశల వారీగా రాష్ట్రవ్యాప్తంగా మిగతా పట్టణాలకు కూడా 5జీ సేవలను విస్తరించేందుకు కంపెనీ ప్రణాళికలను రూపొందించింది.
దసరా రోజున ముంబై, కోల్‌కతా, ఢిల్లీ, వారణాసి పట్టణాల్లో జియో 5జీ సేవలను ప్రయోగాత్మకంగా ప్రారంభించింది. 'జియో వెల్కమ్ ఆఫర్' పేరుతో ప్రారంభించిన ఈ ప్రత్యేక ఆఫర్ కింద వినియోగదారులకు 1జీబీపీఎస్ స్పీడుతో అన్ లిమిటెడ్ డాటా అందించనున్నట్లు జియో ప్రకటించింది. 'జియో ట్రూ 5జీ' సేవలు పొందేందుకు కస్టమర్లు సిమ్ కార్డు, 5జీ మొబైల్ మార్చాల్సిన అవసరం లేదని, కస్టమర్లకు ఆటోమేటిగ్గా సర్వీస్ అప్‌గ్రేడ్ అవుతుందని జియో చెప్పింది.
Aadhaar Update: 10 ఏళ్లకు ఓసారి ఆధార్ ఎందుకు అప్‌డేట్ చేయాలి? ఎలా చేయాలి? తెలుసుకోండి
జియో 5జీ సేవలు అందరికీ అందుబాటులో ఉంటాయని, ప్రతి వ్యక్తికి, ప్రతి ఇంటికి, అన్ని రకాల వారికి అందుబాటులో ఉంటాయని తెలిపింది. ప్రస్తుతం జియోకు 42.5 కోట్ల మంది కస్టమర్లు ఉన్నారు. తాము ప్రారంభించనున్న 5జీ సేవల ద్వారా దేశంలో హెల్త్ కేర్, స్కిల్ డెవలప్‌మెంట్, ఎడ్యుకేషన్ , అగ్రికల్చర్ వంటి అనేక రంగాలు మరింత ప్రగతి సాధిస్తాయని జియో విశ్వసిస్తోంది.
4జీ సేవలను అందించటంలో తన ఆధిపత్యాన్ని చాటుకున్న జియో 5జీ వేగంలోనూ అగ్రస్థానంలో నిలిచింది. 5జీ డేటా వేగం గణాంకాలను ఇంటర్నెట్ టెస్టింగ్ సంస్థ ఊక్లా విడుదల చేసింది. దీని ప్రకారం రిలయన్స్ జియో 598.58 ఎంబీపీఎస్ డౌన్ లోడింగ్ వేగాన్ని నమోదు చేసింది. ఢిల్లీ, కోల్ కతా, ముంబై, వారణాసి ప్రాంతాల్లో జూన్ నుంచి ఈ పరీక్ష నిర్వహించారు.
5G Smartphones: హైస్పీడ్ 5జీ డేటా వాడుకుంటారా? రూ.15 వేల లోపు బెస్ట్ 5జీ స్మార్ట్‌ఫోన్లు ఇవే
భారతదేశంలో అక్టోబర్ 1న జియో 5జీ సేవలు ప్రారంభం అయ్యాయి. ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2022 ఎగ్జిబిషన్‌లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 5జీ సేవల్ని ప్రారంభించారు. అక్టోబర్ 5న జియో ట్రూ 5జీ ప్రారంభమయ్యాయి. ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, వారణాసి నగరాల్లో ఇన్విటేషన్ ద్వారా వెల్‌కమ్ ఆఫర్ అందిస్తోంది జియో. ఇకపై ఎక్కడ జియో ట్రూ 5జీ సేవలు అందుబాటులోకి వచ్చినా అక్కడి యూజర్లకు ఈ వెల్‌కమ్ ఆఫర్ వర్తిస్తుంది. బీటా ట్రయల్ పూర్తయ్యేవరకు అన్‌లిమిటెడ్ 5జీ డేటా లభిస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Jio, Jio 5G, Jio TRUE 5G, Reliance Jio