రిలయెన్స్ జియో యూజర్లకు మరో గొప్ప శుభవార్త. 22 ఇంటర్నేషనల్ ఫ్లైట్లలో మొబైల్ సర్వీసుల్ని ప్రారంభించింది. రిలయెన్స్ జియో. ఒక రోజుకు రూ.499 నుంచి ప్లాన్స్ ప్రారంభమౌతాయి. క్యాథే పసిఫిక్, సింగపూర్ ఎయిర్‌లైన్స్, ఎమిరేట్స్, ఎతిహాద్ ఎయిర్వేస్, యూరో వింగ్స్, లుఫ్తాన్సా, మలిండో ఎయిర్, బిమన్ బంగ్లాదేశ్ ఎయిర్‌లైన్స్, అలిటాలియా ఎయిర్‌లైన్స్‌తో రిలయెన్స్ జియో ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో ఇన్ ఫ్లైట్ సర్వీస్ అందిస్తున్న రెండో భారతీయ టెలికామ్ కంపెనీ రిలయెన్స్ జియో. టాటా గ్రూప్‌కు చెందిన నెల్కో లండన్ రూట్లో విస్తారా ఎయిర్‌లైన్స్‌లో ఇన్-ఫ్లైట్ మొబైల్ సర్వీస్‌ను గతంలో ప్రారభించింది. ఇక రిలయెన్స్ జియో భారతదేశం నుంచి విదేశాలకు వెళ్లే ప్రయాణికులకు మూడు ఇంటర్నేషనల్ రోమింగ్ ప్యాక్స్ అందిస్తోంది. రూ.499, రూ.699, రూ.999 ప్లాన్స్ 1 రోజు వేలిడిటీతో లభిస్తాయి.
JioPostpaid Plus: జియోపోస్ట్‌పెయిడ్ ప్లస్‌తో నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, డిస్నీ+ హాట్‌స్టార్ ఫ్రీ
Poco X3: ఇండియాలో రిలీజైన పోకో ఎక్స్3... ధర, స్పెసిఫికేషన్స్ వివరాలివే
రూ.499 ఇన్‌ఫ్లైట్ ప్యాక్ ఎంచుకున్న వారికి 100 నిమిషాల ఔట్‌గోయింగ్ కాల్స్ లభిస్తాయి. ఇన్కమింగ్ కాల్స్ ఉండవు. మొబైల్ డేటా 250ఎంబీ లభిస్తుంది. 100 ఎస్ఎంఎస్లు వాడుకోవచ్చు. వేలిడిటీ 1 రోజు మాత్రమే.
రూ.699 ఇన్‌ఫ్లైట్ ప్యాక్ ఎంచుకున్న వారికి 100 నిమిషాల ఔట్‌గోయింగ్ కాల్స్ లభిస్తాయి. ఇన్కమింగ్ కాల్స్ ఉండవు. మొబైల్ డేటా 500ఎంబీ లభిస్తుంది. 100 ఎస్ఎంఎస్లు వాడుకోవచ్చు. వేలిడిటీ 1 రోజు మాత్రమే.
రూ.999 ఇన్‌ఫ్లైట్ ప్యాక్ ఎంచుకున్న వారికి 100 నిమిషాల ఔట్‌గోయింగ్ కాల్స్ లభిస్తాయి. ఇన్కమింగ్ కాల్స్ ఉండవు. మొబైల్ డేటా 1జీబీ లభిస్తుంది. 100 ఎస్ఎంఎస్లు వాడుకోవచ్చు. వేలిడిటీ 1 రోజు మాత్రమే.
Realme Narzo 20 Pro: రియల్మీ నార్జో 20 స్మార్ట్‌ఫోన్స్ రిలీజ్... ధర రూ.8,499 నుంచి
IPL 2020 Special Jio Plans: ఐపీఎల్ మ్యాచ్‌లో ఫ్రీగా చూడాలా? జియోలో ఈ ప్లాన్స్ రీఛార్జ్ చేయండి
ఈ డేటా, ఎస్ఎంఎస్ సర్వీసులు అన్ని ఎయిర్‌లైన్స్‌లో అందుబాటులో ఉంటాయి. వాయిస్ సర్వీసులు మాత్రం ఎంపిక చేసిన ఎయిర్‌లైన్స్‌లో మాత్రమే లభిస్తాయి. ఏ ప్లాన్‌లో కూడా ఇన్కమింగ్ కాల్స్ ఉండవు. ఇన్కమింగ్ ఎస్ఎంఎస్లు మాత్రం ఉచితం. మొదటిసారి ఈ సేవలు పొందాలనుకునేవారు జియో నెట్‌వర్క్‌లో ఇన్-ఫ్లైట్ మొబైల్ సర్వీసెస్ యాక్టివేట్ చేయాల్సి ఉంటుంది. జియోఫోన్, జియో వైఫై డివైజ్‌లో ఇంటర్నేషనల్ రోమింగ్ సర్వీసులు పనిచేయవు.
ఇక రిలయెన్స్ జియో ఇప్పటికే జియోపోస్ట్‌పెయిడ్ ప్లస్ ప్రకటించింది. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, డిస్నీ+ హాట్‌స్టార్ ఫ్రీ ఉచితంగా అందిస్తోంది. ఇండియాలో, విదేశాలకు వైఫై కాలింగ్ ఉచితం. ఇక ఇంటర్నేషనల్ ప్లస్ సేవల్లో భాగంగా విదేశాలకు వెళ్లే భారతీయులకు మొదటిసారిగా ఇన్ ఫ్లైట్ కనెక్టివిటీ అందిస్తోంది. యూఎస్ఏ, యూఏఈ దేశాలకు ఉచితంగా ఇంటర్నేషనల్ రోమింగ్ కాల్స్ చేసుకోవచ్చు. కేవలం ఒక్క రూపాయికే ఇండియా కాలింగ్ పేరుతో వైఫై కాలింగ్ ద్వారా ఇంటర్నేషనల్ రోమింగ్ సర్వీస్ పొందొచ్చు. ఐఎస్డీ కాల్స్ నిమిషానికి 50 పైసలు మాత్రమే.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Jio, Reliance Jio