దేశవ్యాప్తంగా 40 కోట్ల మంది మొబైల్ యూజర్లకు సేవలందిస్తున్న రిలయన్స్ జియో.. మొబైల్ డౌన్లోడ్ స్పీడ్‌లో మరోసారి నంబర్‌వన్ స్థానంలో నిలిచింది. 19.3 ఎంబీపీఎస్ డౌన్లోడ్ స్పీడ్‌తో జియో ప్రత్యర్థి కంపెనీలకు అందనంత ఎత్తులో ఉందని ట్రాయ్(టెలికాం రెగ్యూలలేటరీ ఆథారిటీ ఆఫ్ ఇండియా) తాజా నివేదిక వెల్లడించింది. ఈ అంశంలో జియో తరువాత 8.6 ఎంబీపీఎస్ స్పీడ్‌తో ఐడియా రెండో స్థానంలో ఉండగా, 7.9 ఎంబీపీఎస్ స్పీడ్‌తో వోడాఫోన్ మూడో స్థానంలో నిలిచింది. ఇక 7.5 ఎంబీపీఎస్ స్పీడ్‌తో ఎయిర్టెల్ ఆ తరువాతి స్థానంలో ఉంది. అక్టోబర్ 10 ట్రాయ్ ఈ నివేదికను వెల్లడించింది.
వొడాఫోన్, ఐడియా కంపెనీలు విలీనమైనప్పటికీ.. ట్రాయ్ మాత్రం ఆ కంపెనీల పనితీరును విడివిడిగానే పరిగణనలోకి తీసుకుంది. దేశంలోని 49 నగరాల్లో ఓపెన్‌సిగ్నల్ అనే ప్రైవేటు సంస్థ నిర్వహించిన స్టడీ ఆధారంగా ఈ నివేదిక రూపొందించారు. రియల్ టైమ్ బేసిన్ ఆధారంగా డేటా స్పీడ్‌ను ట్రాయ్ లెక్క గట్టింది. ఆగస్టు నెలతో పోల్చితే సెప్టెంబర్‌లో దాదాపు అన్ని కంపెనీల డౌన్లోడ్ స్పీడ్ పెరిగింది. ఆగస్టులో 15.9గా ఉన్న జియో డౌన్లోడ్ స్పీడ్.. 21శాతం మెరుగుపడి సెప్టెంబర్‌లో 19.3 శాతానికి చేరుకుంది.
ఆగస్టులో 7 శాతంగా ఉన్న ఎయిర్టెల్ డౌన్లోడ్ స్పీడ్.. 7 శాతం మెరుగుపడి సెప్టెంబర్‌లో 7.5 శాతానికి చేరుకుంది. ఇక అప్లోడ్ స్పీడ్ విషయంలో 6.5 శాతంతో వొడాఫోన్ తొలిస్థానంలో నిలవగా.. 6.4 శాతంతో ఐడియా, 3.5 శాతంతో జియో, ఎయిర్టెల్ ఆ తరువాతి స్థానాల్లో నిలిచాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Jio, Reliance Jio