రిలయన్స్ జియో(Jio), ఎయిర్‌టెల్(Airtel) మరియు వొడాఫోన్ ఐడియా(VI) తమ కస్టమర్ల కోసం పోటాపోటీగా ఆఫర్లు అందిస్తున్నాయి. ఎప్పటికప్పుడు కొత్త కొత్త ప్లాన్లతో వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. చాలా మంది ప్రతీ నెలా రీఛార్జ్ చేసుకోవడానికి ఇబ్బంది పడుతుంటారు. గడువు ముగిసిన అనతరం ఆఫర్ అయిపోయిందన్న విషయాన్ని తెలుసుకుని కాలింగ్ సదుపాయం, ఇంటెర్నెట్ రాక అవస్థలు పడుతుంటారు. అలాంటి వారి కోసం టెలికాం కంపెనీలు వార్షిక ప్లాన్లను తీసుకువచ్చాయి. ఈ ప్లాన్లతో ఒక్క సారి రీఛార్జ్ చేస్తే ఏడాది పాటు ఎంజాయ్ చేయొచ్చు. అన్ లిమిటెడ్ కాలింగ్, డైలీ డేటా, ఎస్ఎంఎస్ లను వినియోగించుకోవచ్చు. అలాంటి ప్లాన్ల వివరాలు..
Airtel Rs 1498 Plan: ఎయిర్‌టెల్ కస్టమర్లు ఈ రూ .1498 ప్లాన్ ను ఎంచుకుంటే 24 GB డేటాను పొందొచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 365 రోజులు. మీరు దీనిని నెలవారీ రీఛార్జ్‌గా చూస్తే, ఒక విధంగా మీరు ప్రతి నెలా రూ .124 ఖర్చు చేస్తున్నట్లు లెక్క. హై స్పీడ్ డేటా అయిపోయిన తర్వాత 64kbps వేగంతో మొబైల్ డేటా వినియోగించుకోవచ్చు. అపరిమిత వాయిస్ కాలింగ్ అందుబాటులో ఉంటుంది. ఇంకా 3600 SMSలు లభిస్తాయి. ఇంకా వివిధ యాప్ లఉచిత సబ్క్రిప్షన్ ను ఉచితంగా పొందొచ్చు.
BSNL Best Offer: బీఎస్ఎన్ఎల్ బంపరాఫర్.. రూ. 187కే అపరిమిత డేటా.. ప్లాన్ వివరాలివే
Jio Rs.1299 Plan: రిలయన్స్ జియో తీసుకువచ్చిన రూ .1299 ప్లాన్‌తో కస్టమర్లకు 24GB డేటా లభిస్తుంది. దీని వ్యాలిడిటీ 336 రోజులు. హై స్పీడ్ డేటా అయిపోయిన తర్వాత 64kbps స్పీడ్ తో మొబైల్ డేటా వస్తుంది. అపరిమిత వాయిస్ కాలింగ్ అందుబాటులో ఉంది. అలాగే 3600 SMSలు అందుబాటులో ఉంటాయి. ఇంకా జియో యాప్‌లకు ఉచితంగా లభ్యత్వం లభిస్తుంది.
VI Rs.1499 Plan: వోడాఫోన్ ఐడియా రూ .1499 ప్లాన్‌తో 24 జీబీ డేటాను పొందొచ్చు. దీని వ్యాలిడిటీ 365 రోజులు. మీరు దీనిని నెలవారీ రీఛార్జ్‌గా చూస్తే, ప్రతీ నెలా రూ .125 ఖర్చు చేస్తున్నట్లు చెప్పొచ్చు. అపరిమిత వాయిస్ కాలింగ్ అందుబాటులో ఉంటుంది. ఇంకా 3600 SMSలు అందుబాటులో ఉంటాయి. ఇది కాకుండా, వి మూవీస్ కు ఉచిత యాక్సెస్ లభిస్తుంది
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Airtel recharge plans, Jio, Reliance Jio, Vodafone Idea