హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Jio 2GB Plans: జియో ప్లాన్స్ మారాయి... రోజూ 2జీబీ డేటా ఇచ్చే ప్లాన్స్ ఇవే

Jio 2GB Plans: జియో ప్లాన్స్ మారాయి... రోజూ 2జీబీ డేటా ఇచ్చే ప్లాన్స్ ఇవే

Jio (ప్రతీకాత్మక చిత్రం)

Jio (ప్రతీకాత్మక చిత్రం)

Jio 2GB Plans | జియో యూజర్లు రోజూ 2జీబీ డేటా పొందాలనుకుంటే కొత్త ప్రీపెయిడ్ ప్లాన్స్ (Jio Prepaid Plans) రీఛార్జ్ చేయాల్సి ఉంటుంది. ఏ ప్లాన్స్ రీఛార్జ్ చేస్తే రోజూ 2జీబీ డేటా లభిస్తుందో తెలుసుకోండి.

  మీరు రిలయన్స్ జియో (Reliance Jio) కస్టమరా? గతంలో మీ జియో నెంబర్‌కు రీఛార్జ్ చేశారా? జియో ప్లాన్స్ (Jio Plans) ఇటీవల మారాయి. కొత్త ప్లాన్స్ అమలులోకి వచ్చాయి. గతంలో మీరు రీఛార్జ్ చేసిన ప్లాన్స్ ఇప్పుడు అందుబాటులో ఉండకపోవచ్చు. అందుకే వేలిడిటీ పూర్తైన తర్వాత కొత్త ప్లాన్స్ రీఛార్జ్ చేయాల్సి ఉంటుంది. మీరు రోజూ 2జీబీ డేటా కోసం గతంలో రీఛార్జ్ చేసినట్టైతే ఆ ప్లాన్స్‌లో కొన్ని మార్పులు ఉన్నాయి. మీరు ఇకపై మీ స్మార్ట్‌ఫోన్‌లో రోజూ 2జీబీ డేటా కావాలనుకుంటే ఈ కింద వివరించిన ప్లాన్స్ రీఛార్జ్ చేయాల్సి ఉంటుంది. మరి కొత్త ప్లాన్స్ ద్వారా లభించే బెనిఫిట్స్ గురించి తెలుసుకోండి.

  Jio Rs 249 Plan: జియో రూ.249 ప్లాన్ రీఛార్జ్ చేస్తే 23 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 2జీబీ డేటా వాడుకోవచ్చు. మొత్తం 46జీబీ డేటా లభిస్తుంది. అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ చేయొచ్చు. రోజూ 100 ఎస్ఎంఎస్‌లు వాడుకోవచ్చు. జియో యాప్స్ సబ్‌స్క్రిప్షన్ ఉచితం.

  Jio Rs 299 Plan: జియో రూ.299 ప్లాన్ రీఛార్జ్ చేస్తే 28 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 2జీబీ డేటా వాడుకోవచ్చు. మొత్తం 56జీబీ డేటా వాడుకోవచ్చు. అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ చేయొచ్చు. రోజూ 100 ఎస్ఎంఎస్‌లు వాడుకోవచ్చు. జియో యాప్స్ సబ్‌స్క్రిప్షన్ ఉచితం. గతంలో రూ.249 గా ఉన్న ప్లాన్ రూ.299 ధరకు పెరిగింది.

  Moto G31: బడ్జెట్ ధరలో అదిరిపోయే ఫీచర్స్... కాసేపట్లో మోటో జీ31 సేల్

  Jio Rs 533 Plan: జియో రూ.533 ప్లాన్ రీఛార్జ్ చేస్తే 56 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 2జీబీ డేటా వాడుకోవచ్చు. మొత్తం 112జీబీ డేటా వాడుకోవచ్చు. అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ చేయొచ్చు. రోజూ 100 ఎస్ఎంఎస్‌లు వాడుకోవచ్చు. జియో యాప్స్ సబ్‌స్క్రిప్షన్ ఉచితం. గతంలో రూ.444 గా ఉన్న ప్లాన్ రూ.533 ధరకు పెరిగింది.

  Jio Rs 719 Plan: జియో రూ.719 ప్లాన్ రీఛార్జ్ చేస్తే 84 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 2జీబీ డేటా వాడుకోవచ్చు. మొత్తం 168జీబీ డేటా వాడుకోవచ్చు. అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ చేయొచ్చు. రోజూ 100 ఎస్ఎంఎస్‌లు వాడుకోవచ్చు. జియో యాప్స్ సబ్‌స్క్రిప్షన్ ఉచితం. గతంలో రూ.599 గా ఉన్న ప్లాన్ రూ.719 ధరకు పెరిగింది.

  Jio Rs 2879 Plan: జియో రూ.2879 ప్లాన్ రీఛార్జ్ చేస్తే 365 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 2జీబీ డేటా వాడుకోవచ్చు. మొత్తం 730జీబీ డేటా వాడుకోవచ్చు. అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ చేయొచ్చు. రోజూ 100 ఎస్ఎంఎస్‌లు వాడుకోవచ్చు. జియో యాప్స్ సబ్‌స్క్రిప్షన్ ఉచితం. గతంలో జియో రూ.2399 గా ఉన్న ప్లాన్ రూ.2879 ధరకు పెరిగింది.

  Redmi Note 10S: రెడ్‌మీ నోట్ 10ఎస్ కొత్త వేరియంట్ వచ్చేసింది... ధర ఎంతంటే

  Jio Rs 799 Plan: జియో రూ.799 ప్లాన్ రీఛార్జ్ చేస్తే 56 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 2జీబీ డేటా వాడుకోవచ్చు. మొత్తం 112జీబీ డేటా వాడుకోవచ్చు. అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ చేయొచ్చు. రోజూ 100 ఎస్ఎంఎస్‌లు వాడుకోవచ్చు. ఒక ఏడాది డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది. జియో యాప్స్ సబ్‌స్క్రిప్షన్ ఉచితం.

  Jio Rs 1066 Plan: జియో రూ.1066 ప్లాన్ రీఛార్జ్ చేస్తే 84 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 2జీబీ డేటా వాడుకోవచ్చు. అదనంగా మరో 5జీబీ డేటా లభిస్తుంది. మొత్తం 173జీబీ డేటా వాడుకోవచ్చు. అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ చేయొచ్చు. రోజూ 100 ఎస్ఎంఎస్‌లు వాడుకోవచ్చు. ఒక ఏడాది డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది. జియో యాప్స్ సబ్‌స్క్రిప్షన్ ఉచితం.

  Jio Rs 3119 Plan: జియో రూ.3119 ప్లాన్ రీఛార్జ్ చేస్తే 365 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 2జీబీ డేటా వాడుకోవచ్చు. అదనంగా మరో 105జీబీ డేటా లభిస్తుంది. మొత్తం 740జీబీ డేటా వాడుకోవచ్చు. అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ చేయొచ్చు. రోజూ 100 ఎస్ఎంఎస్‌లు వాడుకోవచ్చు. ఒక ఏడాది డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది. జియో యాప్స్ సబ్‌స్క్రిప్షన్ ఉచితం.

  Published by:Santhosh Kumar S
  First published:

  Tags: Jio, Reliance Jio

  ఉత్తమ కథలు