రిలయెన్స్ జియో ఇటీవల ఇంటర్‌కనెక్టెడ్ ఛార్జీలు-IUC తొలగించిన సంగతి తెలిసిందే. 2021 జనవరి 1 డొమెస్టిక్ వాయిస్ కాల్స్ ఉచితం అని ప్రకటించింది. ఫ్రీ వాయిస్ కాల్స్ అమలు చేస్తోంది. దీంతో రిలయెన్స్ జియోకు చెందిన పలు ప్లాన్స్‌లో మార్పులు వచ్చాయి. దాదాపు అన్ని ప్రీపెయిడ్ ప్లాన్స్‌ని సవరించింది రిలయెన్స్ జియో. అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ అందిస్తోంది. కాంప్లిమెంటరీ డేటా కూడా అందిస్తోంది. అంటే ఇప్పటికే ఐయూసీ ఛార్జీలు వసూలు చేసిన ప్లాన్స్‌పై ఈ ఛార్జీలకు బదులు అదనంగా కస్టమర్లకు డేటా అందిస్తోంది. మరి మీరు నెల రోజుల ప్లాన్ అంటే 28 రోజుల ప్రీపెయిడ్ ప్లాన్ తీసుకోవాలనుకుంటే ఎంత రీఛార్జ్ చేయాలి, ఆ ప్లాన్లపై వచ్చే బెనిఫిట్స్ ఏంటీ తెలుసుకోండి.
Jio Rs 129 plan: రిలయెన్స్ జియో రూ.129 ప్లాన్ రీఛార్జ్ చేస్తే 28 రోజుల వేలిడిటీ లభిస్తుంది. డొమెస్టిక్ వాయిస్ కాల్స్ ఉచితం. ఈ ప్లాన్‌పై 2జీబీ డేటా మాత్రమే లభిస్తుంది. అంటే 28 రోజులకు 2జీబీ డేటా మాత్రమే ఉపయోగించుకోగలరు.
Xiaomi Mi 10i: రేపే ఎంఐ 10ఐ ఫస్ట్ సేల్... జియో నుంచి రూ.10,000 బెనిఫిట్స్
Cylinder Booking on Paytm: పేటీఎం యాప్ ఉందా? సింపుల్‌గా సిలిండర్ బుక్ చేయండిలా
Jio Rs 199 plan: రిలయెన్స్ జియో రూ.199 ప్లాన్ రీఛార్జ్ చేస్తే 28 రోజుల వేలిడిటీ లభిస్తుంది. డొమెస్టిక్ వాయిస్ కాల్స్ ఉచితం. రోజూ 1.5 జీబీ డేటా ఉపయోగించుకోవచ్చు. అంటే మొత్తం 42 జీబీ డేటా లభిస్తుంది. అన్లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. రోజూ 100 ఎస్ఎంఎస్లు ఉచితం. జియో యాప్స్‌కు కాంప్లిమెంటరీగా సబ్స్క్రిప్షన్ లభిస్తుంది.
Jio Rs 249 plan: రిలయెన్స్ జియో రూ.249 ప్లాన్ రీఛార్జ్ చేస్తే 28 రోజుల వేలిడిటీ లభిస్తుంది. డొమెస్టిక్ వాయిస్ కాల్స్ ఉచితం. రోజూ 2 జీబీ డేటా ఉపయోగించుకోవచ్చు. అంటే మొత్తం 56 జీబీ డేటా లభిస్తుంది. అన్లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. రోజూ 100 ఎస్ఎంఎస్లు ఉచితం. జియో యాప్స్‌కు కాంప్లిమెంటరీగా సబ్స్క్రిప్షన్ లభిస్తుంది.
Jio Plans: జియో బెనిఫిట్స్ మారాయి... రోజూ 2జీబీ డేటా ఇచ్చే ప్లాన్స్ ఇవే
Jio Rs 349 plan: రిలయెన్స్ జియో రూ.349 ప్లాన్ రీఛార్జ్ చేస్తే 28 రోజుల వేలిడిటీ లభిస్తుంది. డొమెస్టిక్ వాయిస్ కాల్స్ ఉచితం. రోజూ 3 జీబీ డేటా ఉపయోగించుకోవచ్చు. అంటే మొత్తం 84 జీబీ డేటా లభిస్తుంది. అన్లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. రోజూ 100 ఎస్ఎంఎస్లు ఉచితం. జియో యాప్స్‌కు కాంప్లిమెంటరీగా సబ్స్క్రిప్షన్ లభిస్తుంది.
Jio Rs 401 plan: రిలయెన్స్ జియో రూ.401 ప్లాన్ రీఛార్జ్ చేస్తే పైన చెప్పిన రూ.349 బెనిఫిట్స్ అన్నీ లభిస్తాయి. దీంతో పాటు అదనంగా రూ.399 విలువైన డిస్నీ+ హాట్‌స్టార్ వీఐపీ ఏడాది సబ్స్క్రిప్షన్ ఉచితం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Jio, Reliance Jio