Reliance Jio: రిలయన్స్ జియోకు 'హార్ట్‌ఫుల్‌నెస్ ఆర్గనైజేషన్' అవార్డు

ఈ ఏడాదితో హార్ట్‌ఫుల్‌నెస్ ఇన్‌స్టిట్యూట్ 75 సంవత్సరాలను పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా, తన భాగస్వామి సంస్థలను 'ది హార్ట్‌ఫుల్ ఆర్గనైజేషన్ అవార్డు'తో సత్కరించింది.

news18-telugu
Updated: February 8, 2020, 3:11 PM IST
Reliance Jio: రిలయన్స్ జియోకు 'హార్ట్‌ఫుల్‌నెస్ ఆర్గనైజేషన్' అవార్డు
'ది హార్ట్‌ఫుల్‌నెస్ ఆర్గనైజేషన్ అవార్డు' అందుకుంటున్న రిలయెన్స్ జియో తెలంగాణ సీఈఓ శ్రీ కేసీ రెడ్డి
  • Share this:
టెలికామ్ రంగంలో సంచలనాలు సృష్టిస్తున్న రిలయెన్స్ జియోకు హార్ట్‌ఫుల్‌నెస్ ఇనిస్టిట్యూట్ నుంచి 'ది హార్ట్‌ఫుల్‌నెస్ ఆర్గనైజేషన్ అవార్డు' లభించింది. హైదరాబాద్‌ శివారులోని కన్హా శాంతివనంలోని హార్ట్‌ఫుల్‌నెస్ ఇన్‌స్టిట్యూట్ ప్రపంచ ప్రధాన కార్యాలయంలో ఈ అవార్డు ప్రదానోత్సవం జరిగింది. రిలయెన్స్ జియో తెలంగాణ సీఈఓ శ్రీ కేసీ రెడ్డి ఈ అవార్డును అందుకున్నారు. హార్ట్‌ఫుల్‌నెస్ ఇన్‌స్టిట్యూట్ అంతర్జాతీయ లాభాపేక్షలేని సంస్థ. ఇది 130 దేశాలలో విస్తరించి ఉంది. సంస్థకు 2020 సంవత్సరం ఒక ముఖ్యమైన మైలురాయి. ఈ ఏడాదితో హార్ట్‌ఫుల్‌నెస్ ఇన్‌స్టిట్యూట్ 75 సంవత్సరాలను పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా, తన భాగస్వామి సంస్థలను 'ది హార్ట్‌ఫుల్ ఆర్గనైజేషన్ అవార్డు'తో సత్కరించింది.

ఉద్యోగుల శ్రేయస్సును ప్రోత్సహించడానికి హార్ట్‌ఫుల్‌నెస్ ఇన్‌స్టిట్యూట్‌తో ప్రపంచవ్యాప్తంగా భాగస్వామ్యం కలిగిన 1,200 కి పైగా సంస్థల నుంచి 10 ఉత్తమ కంపెనీలను ఎంపిక చేశారు. నూతన సంవత్సరం సందర్భంగా, రిలయన్స్ జియో హార్ట్‌ఫుల్‌నెస్ ఇన్‌స్టిట్యూట్‌ భాగస్వామ్యంతో దేశవ్యాప్తంగా 180 పైగా జియో కార్యాలయాల్లో 3 రోజుల వర్క్‌షాప్ నిర్వహించింది. ఈ వర్క్‌షాప్‌లో 3000 మందికి పైగా జియో ఉద్యోగులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి:

Realme PaySa: ఐదు నిమిషాల్లో రూ.1,00,000 వరకు అప్పు... 'రియల్‌మీ పేసా' ఆఫర్

Digital Cash: ఈ టిప్స్‌తో మీ పేటీఎం, ఫోన్‌ పేలో డబ్బులు సేఫ్

Auto Sweep: ఈ టెక్నిక్ తెలిస్తే... మీ బ్యాంక్ అకౌంట్‌లోకి డబుల్ వడ్డీ
Published by: Santhosh Kumar S
First published: February 8, 2020, 3:08 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading