Jio Offers | మీరు రిలయన్స్ జియో కస్టమరా? జియో సిమ్ కార్డు వాడుతున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. జియో తన యూజర్లకు గ్రేట్ ప్రిపెయిడ్ (Jio Prepaid) ప్లాన్స్ అందిస్తోంది. అలాగే యూజర్లకు పోస్ట్‌పెయిడ్ ప్లాన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. జియో పోస్ట్‌పెయిడ్ ప్లాన్స్‌లో (Jio Postpaid) రూ. 399 ప్లాన్ కూడా ఒకటి. ఈ ప్లాన్ ఎంచుకున్న వారికి అపరిమిత కాలింగ్ సదుపాయంతో పాటుగా 100 ఉచిత ఎస్ఎంఎస్లు పొందొచ్చు. అంతేకాకుండా నెట్‌ఫ్లిక్స్ మొబైల్ ప్లాన్ సబ్స్క్రిప్షన్ కూడా ఫ్రీగా లభిస్తుంది.
అంతేకాకుండా జియో తన కస్టమర్లకు ఉచిత అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్ కూడా ఆఫర్ చేస్తోంది. ఈ ప్లాన్‌లో యూజర్లకు 75 జీబీ డేటా వస్తుంది. డేటా లిమిట్ అయిపోయిన తర్వాత రూ.10కు ఒక జీబీ డేటా పొందొచ్చు. ఈ ప్లాన్ డేటా రోలోవర్ బెనిఫిట్‌తో వస్తోంది. 200 జీబీ వరకు ఈ బెనిఫిట్ పొందొచ్చు.
ఇలా బంగారు ఆభరణాలు, డైమండ్ జువెలరీ కొంటే రూ.35 వేల తగ్గింపు!
599 ప్లాన్ ఎంచుకుంటే నెట్‌ఫ్లిక్స్ , అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్ ఉచితంగా వస్తుంది. 100 జీబీ డేటా పొందొచ్చు. ఇంకా అదనం ఒక సిమ్ పొందొచ్చు. ఉచిత కాల్స్, ఎస్ఎంఎస్ బెనిఫిట్స్ ఉన్నాయి. అలాగే రూ.799 ప్లాన్ కూడా ఉంది. ఈ ప్లాన్ ఎంచుకుంటే రెండు అదనపు సిమ్ కార్లులు పొందొచ్చు. కంపెనీ 150 జీబీ డేటా అందిస్తోంది. 200 జీబీ వరకు డేటా రోలోవర్ బెనిఫిట్ పొందొచ్చు. అపరిమిత కాల్స్, 100 ఎస్ఎంఎస్లు వంటి సదుపాయాలు ఉన్నాయి. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ లభిస్తుంది.
బ్యాంకులకు ఈ వారంలో 4 రోజులు సెలవులు.. ఏ ఏ ప్రాంతాల్లో ఎప్పుడెప్పుడు పని చేయవంటే?
ఇంకా 999 ప్లాన్ అయితే 200 జీబీ డేటా వస్తుంది. ఈ ప్లాన్‌లో 500 జీబీ డేటా వరకు రోలోవర్ బెనిఫిట్ పొందొచ్చు. ఉచిత కాల్స్, ఎస్ఎంఎస్లు వంటి బెనిఫిట్స్ ఉన్నాయి. అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ పొందొచ్చు. ఇక చివరిగా రూ. 1499 ప్లాన్ కూడా ఉంది. ఇందులో కూడా ఉచిత నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్ వస్తుంది. 300 జీబీ వరకు డేటా లభిస్తుంది. డేటా రోలోవర్ బెనిఫిట్ 500 జీబీ వరకు ఉంటుంది. ఇలా జియో కస్టమర్లకు రీచార్జ్ చేసుకోవడం ద్వారా ఉచితంగా నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్ సొంతం చేసుకోవచ్చు. జియో ప్రిపెయిడ్ సిమ్ కార్డు వాడే వారు పోస్ట్ పెయిడ్లోకి మారిపోవచ్చు. తద్వారా ఈ బెనిఫిట్స్ సొంతం చేసుకోవచ్చు. ఎంటర్టైన్మెంట్ ప్రియులకు ఈ ప్లాన్స్ అనువుగా ఉంటాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Akash Ambani, Jio, Jio 5G, Jio Recharge Plans, Mukesh Ambani, Reliance Jio