RELIANCE JIO PLANS BECOME CHEAPER AND DATA LIMIT INCREASED KNOW NEW PLANS AND BENEFITS SS
JIO Plans: ధర తగ్గింది... డేటా పెరిగింది... జియో కొత్త ప్లాన్స్ ఇవే
JIO Plans: ధర తగ్గింది... డేటా పెరిగింది... జియో కొత్త ప్లాన్స్ ఇవే
JIO New Plans | గతంలో రోజుకు 1.5 జీబీ డేటా పొందిన వారికి ఇకపై 2జీబీ డేటా లభిస్తుంది. గతంలో ఉన్న ప్లాన్స్‌కి ఇప్పుడు మారిన ప్లాన్స్‌కు మధ్య తేడా ఏంటీ? ధర ఎంత తగ్గింది? డేటా ఎంత పెరిగింది? తెలుసుకోండి.
రిలయెన్స్ జియో యూజర్లకు గుడ్ న్యూస్. జియో ప్రీపెయిడ్ ప్లాన్స్ ధరలు తగ్గాయి. డేటా లిమిట్ కూడా పెరిగింది. మీరు జియో ప్లాన్ రీఛార్జ్ చేయాలంటే రూ.19 ఉన్నా చాలు. రూ.19 నుంచి రూ.9,999 వరకు ప్లాన్స్ ఆఫర్ చేస్తోంది రిలయెన్స్ జియో. ప్లాన్స్ ధరలు తగ్గడంతో పాటు డేటా పెరగడం మరో శుభవార్త. గతంలో రోజుకు 1 జీబీ డేటా పొందినవారికి ఇకపై 1.5 జీబీ డేటా లభిస్తుంది. గతంలో రోజుకు 1.5 జీబీ డేటా పొందిన వారికి ఇకపై 2జీబీ డేటా లభిస్తుంది. గతంలో ఉన్న ప్లాన్స్‌కి ఇప్పుడు మారిన ప్లాన్స్‌కు మధ్య తేడా ఏంటీ? ధర ఎంత తగ్గింది? డేటా ఎంత పెరిగింది? తెలుసుకోండి.
Reliance JIO: ధరలు తగ్గిన ప్లాన్స్ ఇవే...
గతంలో రూ.199 ఉన్న ప్లాన్ ఇప్పుడు రూ.149 ధరకే ఆఫర్ చేస్తోంది రిలయెన్స్ జియో. అంతేకాదు... రూ.రూ.199 ప్లాన్‌లో రోజుకు 1 జీబీ డేటా మాత్రమే లభించేది. కానీ ఇప్పుడు రూ.149 రీఛార్జ్ చేసుకొని రోజుకు 1.5 జీబీ డేటా పొందొచ్చు. వేలిడిటీ 28 రోజులు. మొత్తం 42 జీబీ డేటా లభిస్తుంది. గతంలో రూ.399 ఉన్న ప్లాన్ ఇకపై రూ.349 ధరకే పొందొచ్చు. 70 రోజుల పాటు 105 జీబీ డేటా లభిస్తుంది. గతంలో రూ.459 ఉన్న ప్లాన్‌ని ఇప్పుడు రూ.399 ధరకే పొందొచ్చు. మొత్తం 126 జీబీ డేటా లభిస్తుంది. వేలిడిటీ 84 రోజులు. గతంలో రూ.509 ఉన్న ప్లాన్‌ను రూ.499 ధరకే పొందొచ్చు. 91 రోజుల పాటు 136.5 జీబీ డేటా లభిస్తుంది. రూ.1,699 ప్లాన్‌లో ఎలాంటి మార్పు లేదు. అయితే గతంలో 365 జీబీ డేటా లభించేది. ఇకపై 547.5 జీబీ డేటా పొందొచ్చు. వేలిడిటీ 365 రోజులు.
గతంలో రోజుకు 1.5 జీబీ డేటా అందించిన ప్లాన్స్ అన్నింటికీ ఇకపై రోజుకు 2 జీబీ డేటా ఇవ్వనుంది రిలయెన్స్ జియో. ప్లాన్స్ ధరలు అలాగే ఉంటాయి. రూ.198 రీఛార్జ్ చేసుకుంటే 28 రోజుల పాటు 56 జీబీ డేటా లభిస్తుంది. రూ.398 రీఛార్జ్ చేసుకుంటే 70 రోజుల పాటు 140 జీబీ డేటా లభిస్తుంది. రూ.448 రీఛార్జ్ చేస్తే 84 రోజుల పాటు 168 జీబీ డేటా పొందొచ్చు. రూ.498 రీఛార్జ్ చేస్తే 91 రోజుల పాటు 182 జీబీ డేటా పొందొచ్చు. ఇక రూ.299 ప్లాన్ తీసుకున్న వారికి గతంలో రోజుకు 2 జీబీ డేటా ఇచ్చింది జియో. ఇకపై రోజుకు 3 జీబీ డేటా పొందొచ్చు. అంటే ఈ ప్లాన్‌లో 28 రోజుల పాటు రోజుకు 3 జీబీ డేటా చొప్పున 84 జీబీ డేటా లభిస్తుంది. ఇక రూ.509 ప్లాన్ తీసుకున్న వారికి 28 రోజుల పాటు రోజుకు 3 జీబీ చొప్పున డేటా లభించేది. ఇకపై రోజుకు 4 జీబీ డేటా చొప్పున మొత్తం 112 జీబీ డేటా పొందొచ్చు.
Reliance JIO: జియో ప్లాన్స్‌తో లభించే ప్రయోజనాలివే...
జియో ప్లాన్ తీసుకున్న వారికి డేటాతో పాటు ఫ్రీ వాయిస్ కాల్స్ లభిస్తాయి. రోజుకు 100 ఎస్ఎంఎస్లు పొందొచ్చు. కేటాయించిన హైస్పీడ్ డేటా పూర్తిగా వాడుకున్నవారికి ఆ తర్వాత 64 కేబీసీఎస్ స్పీడ్‌తో డేటా లభిస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.