RELIANCE JIO ONCE AGAIN GIVING 2GB FREE DATA PER DAY FOR 5 DAYS TO SELECTED USERS SS
Jio: జియో నుంచి ఉచితంగా 10జీబీ డేటా... మీకు వస్తుందా లేదా చెక్ చేయండి ఇలా
Jio: జియో నుంచి ఉచితంగా 10జీబీ డేటా... ఎవరికంటే
(ప్రతీకాత్మక చిత్రం)
Reliance Jio | మీరు రిలయెన్స్ జియో సిమ్ వాడుతున్నారా? ఎక్కువ డేటా ఉపయోగిస్తున్నారా? అయితే మీకు జియో నుంచి ఉచితంగా డేటా వచ్చే అవకాశముంది. ఎలా చెక్ చేయాలో తెలుసుకోండి.
రిలయెన్స్ జియో యూజర్లకు శుభవార్త. జియో మరోసారి తమ కస్టమర్లకు సర్ప్రైజ్ ఇస్తోంది. గతంలో ఇచ్చినట్టుగానే ఇప్పుడు కూడా మరోసారి రిలయెన్స్ జియో తమ యూజర్లకు ఉచితంగా 4జీ డేటాను అందిస్తోంది. 5 రోజుల వేలిడిటీతో రోజుకు 2జీబీ డేటాను అందిస్తోంది. అంటే 5 రోజుల్లో 10జీబీ డేటా వాడుకోవచ్చు. అయితే ఎంపిక చేసిన కస్టమర్లకు మాత్రమే ఈ ఆఫర్ అందిస్తోంది రిలయెన్స్ జియో. ఏప్రిల్లో కూడా ఇలాగే ఉచితంగా 4జీ డేటా ఇచ్చింది జియో. అప్పుడు 4 రోజులకు రోజూ 2జీబీ చొప్పున మొత్తం 8జీబీ డేటా ఇచ్చింది. ఈసారి 5 రోజులు ఉచితంగా డేటా అందిస్తోంది. కస్టమర్ల యూసేజ్ని బట్టి ఉచిత డేటాను క్రెడిట్ చేస్తోంది జియో. అంటే ఇప్పటికే ఉన్న ప్లాన్లో డేటా మొత్తం వాడేవారికి ఈ ఫ్రీ డేటా ఉపయోగపడుతుంది. అదనంగా ఫ్రీ డేటా వాడుకోవచ్చు. ముఖ్యంగా వర్క్ ఫ్రమ్ హో్మ చేసేవారికి, ఎక్కువగా ఎంటర్టైన్మెంట్ కోసం డేటా ఉపయోగించేవారికి ఉచిత డేటా మేలు చేస్తుంది. మరి మీకు కూడా ఉచిత డేటా వస్తుందో లేదో తెలుసుకోవడానికి మైజియో యాప్లో మై ప్లాన్స్ సెక్షన్లో చూడొచ్చు. జియో డేటా ప్యాక్ కింద అదనపు డేటా వివరాలు ఉంటాయి.
ఇక ఇంటి నుంచే ఆఫీస్ పనులు చేసేవారి కోసం రిలయెన్స్ జియో ప్రత్యేకంగా వర్క్ ఫ్రమ్ హోమ్ ప్లాన్స్ ప్రకటించింది. రూ.151. రూ.201, రూ.251 ధరతో వర్క్ ఫ్రమ్ హోమ్ ప్లాన్స్, రూ.999, రూ.2399 ధరతో లాంగ్ టర్మ్ ప్లాన్స్ ప్రకటించింది. ఎక్కువ డేటా ఉపయోగించేవారికి ఈ ప్లాన్స్ ఉపయోగపడ్తాయి. ఈ ప్లాన్స్ అన్నీ ఎక్కువ 4జీ డేటా అందించేవే. ఈ ప్లాన్స్ పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.