కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేవారికి రిలయన్స్ జియో (Reliance Jio) అద్భుతమైన ఆఫర్ ప్రకటించింది. కొద్ది రోజుల క్రితం వన్‌ప్లస్ 10 సిరీస్‌లో లాంఛ్ అయిన వన్‌ప్లస్ 10ఆర్ (OnePlus 10R) స్మార్ట్‌ఫోన్‌పై క్యాష్‌బ్యాక్ ఆఫర్ ప్రకటించింది. ఈ మొబైల్ కొన్నవారికి రిలయన్స్ జియో నుంచి రూ.7,200 విలువైన బెనిఫిట్స్ క్యాష్‌బ్యాక్ రూపంలో లభిస్తాయి. వన్‌ప్లస్ 10ఆర్ స్మార్ట్‌ఫోన్ కొని జియో నెట్వర్క్ ఉపయోగిస్తూ రీఛార్జ్ చేసేవారికి మొత్తం రూ.7,200 క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. అయితే ఈ ఆఫర్ పొందాలంటే కొన్ని నియమనిబంధనలు ఉన్నాయి. రిలయన్స్ జియో కస్టమర్లు వన్‌ప్లస్ 10ఆర్ స్మార్ట్‌ఫోన్ కొనేముందు ఆ నియమనిబంధనలు తెలుసుకోవాలి.
వన్‌ప్లస్ 10ఆర్ స్మార్ట్‌ఫోన్ కొన్న జియో కస్టమర్లకు రూ.150 విలువైన 48 డిస్కౌంట్ కూపన్స్ వస్తాయి. వీటి మొత్తం విలువ రూ.7,200. కస్టమర్లు 2022 మే 9 తర్వాత వన్‌ప్లస్ 10ఆర్ స్మార్ట్‌ఫోన్ కొని, మొదటి రీఛార్జ్ చేసిన తర్వాత మైజియో యాప్‌లో డిస్కౌంట్ కూపన్స్ చూడొచ్చు. ఇండియన్ వర్షన్ వన్‌ప్లస్ 10ఆర్ స్మార్ట్‌ఫోన్‌కే ఈ ఆఫర్ లభిస్తుంది.
రిలయన్స్ జియో అందిస్తున్న ఈ ఆఫర్ కావాలంటే కస్టమర్లు రూ.1,199 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ రీఛార్జ్ చేయాల్సి ఉంటుంది. ఈ ప్లాన్ పైనే వారికి రూ.150 డిస్కౌంట్ కూపన్ వర్తిస్తుంది. కస్టమర్లు 2023 డిసెంబర్ 31 వరకు 48 డిస్కౌంట్ కూపన్స్ ఉపయోగించుకోవచ్చు. మొత్తం కూపన్స్ ఉపయోగించే కస్టమర్లకు రూ.7,200 విలువైన బెనిఫిట్స్ లభిస్తాయి.
వన్‌ప్లస్ 10ఆర్ స్మార్ట్‌ఫోన్ విషయానికి వస్తే ఈ మొబైల్ ఇటీవల వన్‌ప్లస్ 10 సిరీస్‌లో ఇండియాలో రిలీజైంది. వన్‌ప్లస్ 10ఆర్ రెండు వేరియంట్లలో రిలీజైంది. 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ ధర రూ.38,999 కాగా, 12జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ ధర రూ.42,999. ఒకవేళ 150వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కావాలనుకుంటే 12జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ వేరియంట్‌కు రూ.43,999 చెల్లించాలి. ఈ స్మార్ట్‌ఫోన్‌ను అమెజాన్‌తో పాటు వన్‌ప్లస్ అధికారిక వెబ్సైట్లో కొనొచ్చు.
వన్‌ప్లస్ 10ఆర్ స్పెసిఫికేషన్స్ చూస్తే 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7 అంగుళాల ఫుల్ హెచ్డీ+ అమొలెడ్ డిస్ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 8100 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 12 + ఆక్సిజన్ఓఎస్ 12.1 ఆపరేటింగ్ సిస్టమ్, 50మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా లాంటి ఫీచర్స్ ఉన్నాయి. 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్న మోడల్‌కు 80వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 4,500ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్న మొబైల్‌కి 150వాట్ సూపర్‌వూక్ ఛార్జింగ్ సపోర్ట్ లభిస్తుంది.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.