రిలయెన్స్ జియో యూజర్లకు శుభవార్త. రోజూ 3 జీబీ డేటాతో సరికొత్త క్వార్టర్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ ప్లాన్‌ను ప్రకటించింది రిలయెన్స్ జియో. ఈ ప్లాన్ ధర రూ.999. వేలిడిటీ 84 రోజులు. అంటే సుమారు మూడు నెలల పాటు ఈ ప్లాన్ వాడుకోవచ్చు. మూడు నెలలకు 252 జీబీ హైస్పీడ్ డేటా వాడుకోవచ్చు. అంటే 1 జీబీ డేటాకు ధర రూ.4 లోపే చెల్లిస్తే చాలు. రోజూ 3జీబీ డేటా లిమిట్ పూర్తైనా డేటా వాడుకోవచ్చు. కాకపోతే స్పీడ్ 64కేబీపీఎస్‌కు తగ్గుతుంది. ఈ స్పీడ్‌తో అన్లిమిటెడ్ డేటా ఉపయోగించుకోవచ్చు. ఇక డేటాతో పాటు జియో నుంచి జియోకు, ల్యాండ్‌లైన్‌కు అన్లిమిటెడ్ కాల్స్ మాట్లాడుకోవచ్చు. జియో నుంచి ఇతర నెట్‌వర్క్స్‌కి కాల్ చేయడానికి 3,000 నిమిషాల వాయిస్ కాల్స్ లభిస్తాయి. రోజూ 100 ఎస్ఎంఎస్లు వాడుకోవచ్చు. వీటితో పాటు జియో యాప్స్‌కు కాంప్లిమెంటరీ సబ్స్క్రిప్షన్ లభిస్తుంది.
లాక్డౌన్ కారణంగా హైస్పీడ్ డేటా అవసరం పెరిగింది. అనేక మంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. మరికొందరు ఎంటర్టైన్మెంట్ కోసం డేటా ఎక్కువ ఉపయోగిస్తున్నారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని క్వార్టర్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ ప్లాన్‌ను రూ.999 ధరకు రూపొందించింది రిలయెన్స్ జియో. ఇక దీంతో పాటు రోజూ 2 జీబీ డేటాతో వర్క్ ఫ్రమ్ హోమ్ యాన్యువల్ ప్లాన్‌ను అందిస్తోంది జియో. ఈ ప్లాన్ ధర రూ.2399. మరోవైపు 336 రోజుల పాటు రోజూ 1.5 జీబీ డేటా అందించే రూ.2,121 ప్లాన్‌ను రిలయెన్స్ జియో కొనసాగిస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.