news18-telugu
Updated: June 25, 2020, 1:53 PM IST
Jio offer: జియో నుంచి డిస్నీ+ హాట్‌స్టార్ సబ్స్క్రిప్షన్ ఉచితం... పొందండి ఇలా
రిలయెన్స్ జియో మరో అద్భుతమైన ఆఫర్‌ను తమ యూజర్లకు అందిస్తోంది. డిస్నీ+ హాట్‌స్టార్ వీఐపీ సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా అందిస్తోంది. డిస్నీ+ హాట్‌స్టార్ ప్లాన్స్ ప్రత్యేకంగా ప్రకటించింది. రూ.401, రూ.2599 వాయిస్ ప్లాన్స్‌తో పాటు రూ.612, రూ.1004, రూ.1206, రూ.1208 డేటా ప్లాన్స్ రీఛార్జ్ చేసుకునేవారికి డిస్నీ+ హాట్‌స్టార్ వీఐపీ సబ్స్క్రిప్షన్ ఫ్రీగా లభిస్తుంది. వీటిలో ఏ ప్లాన్ రీఛార్జ్ చేసుకున్నా రూ.399 విలువైన డిస్నీ+ హాట్‌స్టార్ వీఐపీ ఏడాది సబ్స్క్రిప్షన్ కాంప్లిమెంటరీగా పొందొచ్చు. మరి ఏ ప్లాన్‌పై ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయో తెలుసుకోండి.
Jio Rs 401 Plan: రిలయెన్స్ జియో రూ.401 ప్లాన్ రీఛార్జ్ చేసేవారికి 28 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజుకు 3జీబీ చొప్పున 84జీబీ డేటాతో పాటు అదనంగా 6జీబీ డేటా లభిస్తుంది. అంటే మొత్తం 90 జీబీ డేటా ఉపయోగించుకోవచ్చు. జియో నుంచి జియోకు అన్లిమిటెడ్ కాల్స్, జియో నుంచి ఇతర నెట్వర్క్స్కు 1000 నిమిషాలు మాట్లాడొచ్చు. రోజూ 100 ఎస్ఎంఎస్లు ఉపయోగించుకోవచ్చు. జియో యాప్స్ కాంప్లిమెంటరీ సబ్స్క్రిప్షన్ లభిస్తుంది.
Jio Rs 2599 Plan: రిలయెన్స్ జియో రూ.2599 ప్లాన్ రీఛార్జ్ చేసేవారికి 365 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజుకు 2జీబీ చొప్పున 730జీబీ డేటాతో పాటు అదనంగా 10జీబీ డేటా లభిస్తుంది. అంటే మొత్తం 740 జీబీ డేటా ఉపయోగించుకోవచ్చు. జియో నుంచి జియోకు అన్లిమిటెడ్ కాల్స్, జియో నుంచి ఇతర నెట్వర్క్స్కు 12000 నిమిషాలు మాట్లాడొచ్చు. రోజూ 100 ఎస్ఎంఎస్లు ఉపయోగించుకోవచ్చు. జియో యాప్స్ కాంప్లిమెంటరీ సబ్స్క్రిప్షన్ లభిస్తుంది.Jio Rs 612 Plan: రిలయెన్స్ జియో రూ.612 యాడ్ ఆన్ ప్లాన్. అంటే ప్రస్తుతం ఏదైనా ప్లాన్‌లో ఉన్నవారు మాత్రమే ఈ ప్లాన్ రీఛార్జ్ చేయాలి. వారికి రూ.51 విలువైన 12 వోచర్లు వస్తాయి. 6జీబీ డేటా లభిస్తుంది. జియో నుంచి జియోకు అన్లిమిటెడ్ కాల్స్, జియో నుంచి ఇతర నెట్వర్క్స్కు 500 నిమిషాలు మాట్లాడొచ్చు. జియో యాప్స్ కాంప్లిమెంటరీ సబ్స్క్రిప్షన్ లభిస్తుంది.
Jio Rs 1004 Plan: రిలయెన్స్ జియో రూ.1004 యాడ్ ఆన్ ప్లాన్. వేలిడిటీ 120 రోజులు. మొత్తం 200 జీబీ డేటా లభిస్తుంది. జియో యాప్స్ కాంప్లిమెంటరీ సబ్స్క్రిప్షన్ లభిస్తుంది.
Jio Rs 1206 Plan: రిలయెన్స్ జియో రూ.1206 యాడ్ ఆన్ ప్లాన్. వేలిడిటీ 180 రోజులు. మొత్తం 240 జీబీ డేటా లభిస్తుంది. జియో యాప్స్ కాంప్లిమెంటరీ సబ్స్క్రిప్షన్ లభిస్తుంది.
Jio Rs 1208 Plan: రిలయెన్స్ జియో రూ.1208 యాడ్ ఆన్ ప్లాన్. వేలిడిటీ 240 రోజులు. మొత్తం 240 జీబీ డేటా లభిస్తుంది. జియో యాప్స్ కాంప్లిమెంటరీ సబ్స్క్రిప్షన్ లభిస్తుంది.
పైన వివరించిన ఆరు ప్లాన్స్‌ను జియో ప్రత్యేకంగా హాట్‌స్టార్ ప్లాన్స్ పేరుతో ప్రకటించింది. ఈ అన్ని ప్లాన్స్‌కు రూ.399 విలువైన డిస్నీ+ హాట్‌స్టార్ వీఐపీ ఏడాది సబ్స్క్రిప్షన్ ఉచితంగా పొందొచ్చు. ప్రస్తుతం ఇండియాలో డిస్నీ+హాట్‌స్టార్ సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ రెండు ఉన్నాయి. అందులో ఒకటి డిస్నీ+హాట్‌స్టార్ వీఐపీ. ఈ ప్లాన్ ధర ఏడాదికి రూ.399. డిస్నీ, పిక్సర్, మార్వెల్, స్టార్ వార్స్, నేషనల్ జాగ్రఫీ కంటెంట్‌తో పాటు హాట్‌స్టార్ ఒరిజినల్స్, లైవ్ స్పోర్ట్స్ మ్యాచెస్, బాలీవుడ్ మూవీస్, రీజనల్ కంటెంట్ చూడొచ్చు.
First published:
June 25, 2020, 1:53 PM IST