హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Jio Plans: ఈ జియో ప్రీపెయిడ్ ప్లాన్స్‌తో ఐపీఎల్ ఫైనల్ ఫ్రీగా చూడండి

Jio Plans: ఈ జియో ప్రీపెయిడ్ ప్లాన్స్‌తో ఐపీఎల్ ఫైనల్ ఫ్రీగా చూడండి

Jio Plans: ఈ జియో ప్రీపెయిడ్ ప్లాన్స్‌తో ఐపీఎల్ ఫైనల్ ఫ్రీగా చూడండి
(ప్రతీకాత్మక చిత్రం)

Jio Plans: ఈ జియో ప్రీపెయిడ్ ప్లాన్స్‌తో ఐపీఎల్ ఫైనల్ ఫ్రీగా చూడండి (ప్రతీకాత్మక చిత్రం)

Jio Plans | జియో యూజర్లకు కొన్ని ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్స్‌పై డిస్నీ+ హాట్‌స్టార్ (Disney+ Hotstar) సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది. మే 29న జరగబోయే ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ (IPL Final Match) ఉచితంగా చూడొచ్చు.

ఐపీఎల్ సందడి ఈవారంలోనే ముగుస్తుంది. మే 29న ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ (IPL Final Match) జరగనుంది. మరి ఐపీఎల్ ఫైనల్ ఫ్రీగా చూడాలనుకుంటున్నారా? రిలయన్స్ జియో (Reliance Jio) యూజర్లు కొన్ని ప్రీపెయిడ్ ప్లాన్స్ రీఛార్జ్ చేసి ఐపీఎల్ ఫైనల్ ఉచితంగా చూడొచ్చు. ఐపీఎల్ చూడాలంటే డిస్నీ+ హాట్‌స్టార్ (Disney+ Hotstar) సబ్‌స్క్రిప్షన్ కావాలి. రిలయన్స్ జియో తమ యూజర్లకు కొన్ని ప్లాన్స్‌పై ఉచితంగా డిస్నీ+ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా ఇస్తోంది. డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్‌తో పాటు ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా పొందొచ్చు. మరి ఏ ప్లాన్ రీఛార్జ్ చేస్తే ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయో తెలుసుకోండి.

డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా లభించే ప్లాన్స్ ఇవే...


Jio Rs 333 Plan: జియో రూ.333 ప్లాన్ రీఛార్జ్ చేస్తే 28 రోజుల వేలిడిటీ, రోజూ 1.5జీబీ డేటా, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజూ 100 ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి. మూడు నెలల డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్ ఉచితం.

Jio Rs 583 Plan: జియో రూ.583 ప్లాన్ రీఛార్జ్ చేస్తే 56 రోజుల వేలిడిటీ, రోజూ 1.5జీబీ డేటా, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజూ 100 ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి. మూడు నెలల డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్ ఉచితం.

Jio Rs 783 Plan: జియో రూ.783 ప్లాన్ రీఛార్జ్ చేస్తే 84 రోజుల వేలిడిటీ, రోజూ 1.5జీబీ డేటా, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజూ 100 ఎస్ఎంఎస్‌లు లభిస్కాయి. మూడు నెలల డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్ ఉచితం.

Flipkart Offer: ఫ్లిప్‌కార్ట్‌లో స్మార్ట్‌ఫోన్ సేల్... ఈ మొబైల్ ధర ఇప్పుడు రూ.15,000 లోపే

Jio Rs 499 Plan: జియో రూ.499 ప్లాన్ రీఛార్జ్ చేస్తే 28 రోజుల వేలిడిటీ, రోజూ 2జీబీ డేటా, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజూ 100ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి. ఒక ఏడాది డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్ ఉచితం.

Jio Rs 799 Plan: జియో రూ.799 ప్లాన్ రీఛార్జ్ చేస్తే 56 రోజుల వేలిడిటీ, రోజూ 2జీబీ డేటా, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజూ 100ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి. ఒక ఏడాది డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్ ఉచితం.

Jio Rs 1066 Plan: జియో రూ.1,066 ప్లాన్ రీఛార్జ్ చేస్తే 84 రోజుల వేలిడిటీ, రోజూ 2జీబీ డేటా, అదనంగా మరో 5జీబీ డేటా, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, 100ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి. ఒక ఏడాది డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్ ఉచితం.

Jio Rs 2999 Plan: జియో రూ.2999 ప్లాన్ రీఛార్జ్ చేస్తే 365 రోజుల వేలిడిటీ, రోజూ 2.5జీబీ డేటా, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజూ 100ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి. ఒక ఏడాది డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్ ఉచితం.

Realme Narzo 50 5G: డైమెన్సిటీ ప్రాసెసర్, 5,000ఎంఏహెచ్ బ్యాటరీ... రియల్‌మీ నార్జో 50 5జీ స్మార్ట్‌ఫోన్ సేల్ ఈరోజే

డిస్నీ+ హాట్‌స్టార్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా లభించే ప్లాన్స్ ఇవే...


Jio Rs 1499 Plan: జియో రూ.1499 ప్రీపెయిడ్ ప్లాన్ రీఛార్జ్ చేస్తే 84 రోజుల వేలిడిటీ, రోజూ 2జీబీ డేటా, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజూ 100ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి. ఒక ఏడాది డిస్నీ+ హాట్‌స్టార్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ఉచితం.

Jio Rs 4199 Plan: జియో రూ.4199 ప్రీపెయిడ్ ప్లాన్ రీఛార్జ్ చేస్తే 365రోజుల వేలిడిటీ, రోజూ 3జీబీ డేటా, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజూ 100ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి. ఒక ఏడాది డిస్నీ+ హాట్‌స్టార్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ఉచితం.

జియో యూజర్లు ఈ ప్లాన్స్ రీఛార్జ్ చేసిన తర్వాత అదే నెంబర్‌తో డిస్నీ+ హాట్‌స్టార్ యాప్‌లో లాగిన్ కావాలి. జియో నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేస్తే డిస్నీ+ హాట్‌స్టార్ ప్లాన్ యాక్టివేట్ అవుతుంది.

First published:

Tags: Disney+ Hotstar, IPL 2022, Jio, Reliance Jio

ఉత్తమ కథలు