Home /News /technology /

RELIANCE JIO OFFERS 4G DATA ADD ON PLANS AND 4G DATA VOUCHERS FROM RS 15 KNOW BENEFITS SS

Jio Data Plans: కేవలం రూ.15 నుంచే జియో డేటా ప్లాన్స్... బెనిఫిట్స్ ఇవే

Jio Data Plans: కేవలం రూ.15 నుంచే జియో డేటా ప్లాన్స్... బెనిఫిట్స్ ఇవే
(ప్రతీకాత్మక చిత్రం)

Jio Data Plans: కేవలం రూ.15 నుంచే జియో డేటా ప్లాన్స్... బెనిఫిట్స్ ఇవే (ప్రతీకాత్మక చిత్రం)

Jio Data Plans | జియోలో 4జీ డేటా వోచర్స్, 4జీ డేటా యాడ్ ఆన్ ప్లాన్స్ (Jio Data Add on Plans) అందుబాటులో ఉన్నాయి. ఈ ప్లాన్స్ కేవలం రూ.15 నుంచే ప్రారంభం అవుతాయి.

మీరు రిలయన్స్ జియో (Reliance Jio) యూజరా? జియోలో రోజూ 1జీబీ, 1.5జీబీ, 2జీబీ డేటా ఇచ్చే ప్లాన్స్ రీఛార్జ్ చేశారా? అయినా ఎప్పుడైనా ఈ డేటా చాలట్లేదా? జియో నుంచి డేటా ప్లాన్స్ కూడా ఉన్నాయి. డైలీ డేటా లిమిట్ పూర్తైతే ఆ రోజు అదనంగా 4జీ డేటా (4G Data) వాడుకోవాలనుకునేవారికి ఈ ప్లాన్స్ ఉపయోగపడతాయి. 4జీ డేటా వోచర్స్, 4జీ డేటా యాడ్ ఆన్ ప్లాన్స్ అందుబాటులో ఉన్నాయి. జియో డేటా ప్లాన్స్ రూ.15 నుంచే ప్రారంభం అవుతాయి. ఈ ప్లాన్స్ రీఛార్జ్ చేసేవారికి అదనంగా డేటా లభిస్తుంది. డైలీ డేటా లిమిట్ పూర్తైన తర్వాత ఈ డేటా ఉపయోగించుకోవచ్చు. మరి ఏ ప్లాన్ రీఛార్జ్ చేస్తే ఎంత డేటా వస్తుందో తెలుసుకోండి.

జియో 4జీ డేటా వోచర్స్ ఇవే...


Jio Rs 15 Data Plan: జియో రూ.15 విలువైన 4జీ డేటా వోచర్ రీఛార్జ్ చేస్తే 1జీబీ డేటా లభిస్తుంది.

Jio Rs 25 Data Plan: జియో రూ.25 విలువైన 4జీ డేటా వోచర్ రీఛార్జ్ చేస్తే 2జీబీ డేటా లభిస్తుంది.

Jio Rs 61 Data Plan: జియో రూ.61 విలువైన 4జీ డేటా వోచర్ రీఛార్జ్ చేస్తే 6జీబీ డేటా లభిస్తుంది.

Jio Rs 121 Data Plan: జియో రూ.121 విలువైన 4జీ డేటా వోచర్ రీఛార్జ్ చేస్తే 12జీబీ డేటా లభిస్తుంది.

ఈ నాలుగు ప్లాన్స్ యాక్టీవ్ ప్లాన్ ఉన్నవారి కోసమే. వారు మాత్రమే ఈ ప్లాన్ రీఛార్జ్ చేయాలి. ఇవి కాకుండా యాడ్ ఆన్ ప్యాక్స్ కూడా ఉన్నాయి. ఏ ప్లాన్ రీఛార్జ్ చేస్తే ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయో తెలుసుకోండి.

Amazon Offer: 5,000mAh బ్యాటరీ, భారీ డిస్‌ప్లే, పవర్‌ఫుల్ ప్రాసెసర్... ఆఫర్ ధర రూ.5,849 మాత్రమే

జియో 4జీ డేటా యాడ్ ఆన్ ప్లాన్స్ ఇవే...


Jio Rs 181 Data Add On Plan: జియో రూ.181 డేటా యాడ్ ఆన్ ప్లాన్ రీఛార్జ్ చేస్తే 30జీబీ డేటా లభిస్తుంది. వేలిడిటీ 30 రోజులు.

Jio Rs 241 Data Add On Plan: జియో రూ.241 డేటా యాడ్ ఆన్ ప్లాన్ రీఛార్జ్ చేస్తే 40జీబీ డేటా లభిస్తుంది. వేలిడిటీ 30 రోజులు.

Jio Rs 301 Data Add On Plan: జియో రూ.301 డేటా యాడ్ ఆన్ ప్లాన్ రీఛార్జ్ చేస్తే 50జీబీ డేటా లభిస్తుంది. వేలిడిటీ 30 రోజులు.

Jio Rs 555 Data Add On Plan: జియో రూ.555 డేటా యాడ్ ఆన్ ప్లాన్ రీఛార్జ్ చేస్తే 55జీబీ డేటా లభిస్తుంది. వేలిడిటీ 55 రోజులు. రూ.499 విలువైన డిస్నీ+ హాట్‌స్టార్ స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది. జియో టీవీ, జియో సినిమా, జియో సెక్యూరిటీ, జియో క్లౌడ్ సబ్‌స్క్రిప్షన్స్ ఉచితంగా లభిస్తాయి.

Big Battery Mobile: 7,000mAh బ్యాటరీతో స్మార్ట్‌ఫోన్... ఆఫర్ ధర రూ.10,349 మాత్రమే



Jio Rs 2878 Data Add On Plan: జియో రూ.2878 డేటా యాడ్ ఆన్ ప్లాన్ రీఛార్జ్ చేస్తే రోజూ 2జీబీ డేటా లభిస్తుంది. మొత్తం 730జీబీ డేటా వాడుకోవచ్చు. వేలిడిటీ 365 రోజులు.

Jio Rs 2998 Data Add On Plan: జియో రూ.2998 డేటా యాడ్ ఆన్ ప్లాన్ రీఛార్జ్ చేస్తే రోజూ 2.5జీబీ డేటా లభిస్తుంది. మొత్తం 912.5జీబీ డేటా వాడుకోవచ్చు. వేలిడిటీ 365 రోజులు.

ఇవన్నీ డేటా యాడ్ ఆన్ ప్లాన్స్ మాత్రమే. ఇందులో వాయిస్ కాల్స్, ఎస్ఎంఎస్ బెనిఫిట్స్ లభించవు.
Published by:Santhosh Kumar S
First published:

Tags: Jio, Reliance Jio

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు