Home /News /technology /

RELIANCE JIO OFFERS 100 MINUTES OF CALLS AND 100 SMS COMPLIMENTARY TILL 2020 APRIL 17 FOR JIOPHONE USERS SS

JioPhone: జియోఫోన్ యూజర్లకు శుభవార్త... 10 రెట్లు లాభాలివే తెలుసుకోండి

JioPhone: జియోఫోన్ యూజర్లకు శుభవార్త... 10 రెట్లు లాభాలివే తెలుసుకోండి
(ప్రతీకాత్మక చిత్రం)

JioPhone: జియోఫోన్ యూజర్లకు శుభవార్త... 10 రెట్లు లాభాలివే తెలుసుకోండి (ప్రతీకాత్మక చిత్రం)

Reliance JioPhone | జియోఫోన్ ఉపయోగిస్తున్నవారికి శుభవార్త. దేశవ్యాప్తంగా కరోనావైరస్ సంక్షోభం నెలకొనడంతో జియోఫోన్ యూజర్లకు అదనపు ప్రయోజనాలను అందిస్తోంది రిలయెన్స్ జియో.

    రిలయెన్స్ జియోఫోన్ యూజర్లకు శుభవార్త. రిలయెన్స్ జియో 10 రెట్ల లాభాలను ప్రకటించింది. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతుండటం, జనమంతా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటనున్న సంగతి తెలిసిందే. వారి కోసం రిలయెన్స్ జియో ప్రత్యేకమైన రీఛార్జ్ ఆఫర్స్, బెనిఫిట్స్ అందిస్తోంది. అందులో భాగంగా జియోఫోన్ యూజర్లకు కూడా బెనిఫిట్స్ ప్రకటించింది. జియో ఫోన్ ఉన్నవారందరికీ 100 నిమిషాల కాల్స్, 100 ఎస్ఎంఎస్‌లను కాంప్లిమెంటరీగా అందిస్తోంది. 2020 ఏప్రిల్ 17 వరకు ఈ బెనిఫిట్స్ వర్తిస్తాయి. అంతేకాదు... జియో ఫోన్‌లో వేలిడిటీ పూర్తైన తర్వాత కూడా ఇన్‌కమింగ్ కాల్స్ వస్తాయి.

    ఇక జియో నెంబర్‌కు రీఛార్జ్ చేయడాన్ని కూడా మరింత సులభతరం చేసింది. చాలామంది తమతో పాటు తమ కుటుంబ సభ్యులు, స్నేహితులకు ఆన్‌లైన్‌లోనే రీఛార్జ్ చేస్తుంటారు. అయితే రీటైల్ స్టోర్లల్లో రీఛార్జులు చేసేవారు ప్రస్తుతం లాక్‌డౌన్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారి కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది జియో. యూపీఐ, ఏటీఎం, ఎస్ఎంఎస్‌ల ద్వారా రీఛార్జ్ చేసే అవకాశం కల్పిస్తోంది. ఏఏ పద్ధతిలో ఎలా రీఛార్జ్ చేయాలో తెలుసుకోండి.

    MyJio: మైజియో యాప్ ఓపెన్ చేసి రీఛార్జ్ పైన క్లిక్ చేసి, మొబైల్ నెంబర్, అమౌంట్ వివరాలు ఎంటర్ చేసి పేమెంట్ చేస్తే చాలు.

    Jio Website: https://www.jio.com/ వెబ్‌సైట్‌లో క్విక్ పే పైన క్లిక్ చేసి రీఛార్జ్ సెలెక్ట్ చేయాలి. ఆ తర్వాత ఫోన్ నెంబర్, అమౌంట్ ఎంటర్ చేసి పేమెంట్ చేయాలి.

    Online: గూగుల్ పే, పేటీఎం, ఫోన్ పే, అమెజాన్ పే, మొబిక్విక్, ఫ్రీఛార్జ్ ద్వారా రీఛార్జ్ చేయొచ్చు. డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డుల ద్వారా రీఛార్జ్ సులభమే.

    SMS: యాక్సిస్ బ్యాంక్ కస్టమర్లు Mobile స్పేస్ 10 అంకెల మొబైల్ నెంబర్ స్పేస్ ఇచ్చి JIO స్పేస్ అమౌంట్ స్పేస్ బ్యాంక్ అకౌంట్‌లోని చివరి 6 నెంబర్లు టైప్ చేసి 9717000002 లేదా 5676782 నెంబర్లకు ఎస్ఎంఎస్ చేయాలి. ఐసీఐసీఐ బ్యాంక్ కస్టమర్లు MTOPUP స్పేస్ JIO స్పేస్ 10 అంకెల ఫోన్ నెంబర్ స్పేస్ అమౌంట్ స్పేస్ బ్యాంకు అకౌంట్‌లోని చివరి 6 నెంబర్లు టైప్ చేసి 9222208888 నెంబర్‌కు ఎస్ఎంఎస్ చేయాలి.

    JIO Store: దగ్గర్లోని జియో స్టోర్‌లో రీఛార్జ్ చేయొచ్చు.

    ATM: ముందుగా ఏటీఎంలో మీ డెబిట్ కార్డును ఇన్సర్ట్ చేయండి. మెనూలో 'Recharge' ఆప్షన్ సెలెక్ట్ చేయాలి. ఆ తర్వాత మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. 10 అంకెలు మాత్రమే ఎంటర్ చేయాలి. కంట్రీ కోడ్ అంటే 91 ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత ఏటీఎం పిన్ ఎంటర్ చేయాలి.
    మీరు ఎంత రీఛార్జ్ చేయాలనుకుంటారో అంత అమౌంట్ టైప్ చేయండి. ఆ తర్వాతి స్టెప్‌లో కన్ఫామ్ చేయాలి. స్క్రీన్ పైన రీఛార్జ్ మెసేజ్ కనిపిస్తుంది. మీ అకౌంట్‌లోంచి డబ్బులు డెబిట్ అవుతాయి. మీ మొబైల్ నెంబర్‌కు జియో నుంచి మెసేజ్ వస్తుంది.

    ఇవి కూడా చదవండి:

    Jio New Plans: రిలయెన్స్ జియో ప్రకటించిన 5 కొత్త రీఛార్జ్ ప్లాన్స్ వివరాలివే...

    Driving Licence: వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్

    Work From Home: ఈ 9 టిప్స్‌తో మీ వైఫై స్పీడ్ పెంచుకోండి
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: Corona, Corona virus, Coronavirus, Covid-19, Jio, Lockdown, Reliance Jio

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు