Home /News /technology /

Jio 1.5GB Data plans: రోజూ 1.5జీబీ డేటా కావాలా? రిలయన్స్ జియో కొత్త ప్రీపెయిడ్ ప్లాన్స్ ఇవే

Jio 1.5GB Data plans: రోజూ 1.5జీబీ డేటా కావాలా? రిలయన్స్ జియో కొత్త ప్రీపెయిడ్ ప్లాన్స్ ఇవే

Jio 1.5GB Data plans: రోజూ 1.5జీబీ డేటా కావాలా? రిలయన్స్ జియో కొత్త ప్రీపెయిడ్ ప్లాన్స్ ఇవే
(ప్రతీకాత్మక చిత్రం)

Jio 1.5GB Data plans: రోజూ 1.5జీబీ డేటా కావాలా? రిలయన్స్ జియో కొత్త ప్రీపెయిడ్ ప్లాన్స్ ఇవే (ప్రతీకాత్మక చిత్రం)

Jio 1.5GB Data plans | రిలయన్స్ జియో కొత్త ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్స్ (Prepaid Recharge Plans) అమల్లోకి వచ్చాయి. మీకు రోజూ 1.5జీబీ లేదా 1జీబీ డేటా కావాలనుకుంటే ఈ ప్లాన్స్ రీఛార్జ్ చేయండి.

    రిలయన్స్ జియో (Reliance Jio), ఎయిర్‌టెల్ (Airtel), వొడాఫోన్ ఐడియా (Vi) టెలికామ్ కంపెనీలన్నీ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్స్ (Prepaid Recharge Plans) ధరల్ని పెంచిన సంగతి తెలిసిందే. పెరిగిన ధరలు అమలులోకి వచ్చాయి. వేలిడిటీ పూర్తైనవారు కొత్త ప్లాన్స్ రీఛార్జ్ చేయాల్సి ఉంటుంది. ఇక కొత్త సిమ్ కార్డ్ తీసుకున్నవారికీ ఈ కొత్త ప్లాన్స్ వర్తిస్తాయి. మీరు కాల్స్ ఎక్కువగా డేటా తక్కువగా ఉపయోగించేటట్టైతే మీకు రోజూ 1.5జీబీ లేదా 1జీబీ డేటా లభించే ప్లాన్స్ సరిపోతాయి. మరి మీరు జియో కస్టమర్ అయితే రోజూ 1.5జీబీ లేదా 1జీబీ డేటా ఇచ్చే ప్లాన్స్ ఏవి ఉన్నాయో తెలుసుకోండి. ఈ కింద వెల్లడించిన ప్లాన్స్ అన్నింటికీ వాయిస్ కాల్స్ బెనిఫిట్స్‌తో పాటు జియో యాప్స్ సబ్‌స్క్రిప్షన్స్ కూడా లభిస్తాయి.

    Jio Rs 119 Plan: జియో రూ.119 ప్లాన్ రీఛార్జ్ చేస్తే 14 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 1.5జీబీ డేటా వాడుకోవచ్చు. మొత్తం 21జీబీ డేటా వాడుకోవచ్చు. అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ చేయొచ్చు.

    Jio Rs 199 Plan: జియో రూ.199 ప్లాన్ రీఛార్జ్ చేస్తే 23 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 1.5జీబీ డేటా వాడుకోవచ్చు. మొత్తం 34.5జీబీ డేటా వాడుకోవచ్చు. అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ చేయొచ్చు. రోజూ 100 ఎస్ఎంఎస్‌లు వాడుకోవచ్చు.

    Mi 4A Pro: రూ.19,999 విలువైన ఈ స్మార్ట్ టీవీని రూ.4,999 ధరకే కొనండి ఇలా

    Jio Rs 239 Plan: జియో రూ.239 ప్లాన్ రీఛార్జ్ చేస్తే 28 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 1.5జీబీ డేటా వాడుకోవచ్చు. మొత్తం 42జీబీ డేటా వాడుకోవచ్చు. అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ చేయొచ్చు. రోజూ 100 ఎస్ఎంఎస్‌లు వాడుకోవచ్చు. గతంలో ఈ ప్లాన్ ధర రూ.199 ఉండగా ఇప్పుడు రూ.239 ధరకు పెరిగింది.

    Jio Rs 479 Plan: జియో రూ.479 ప్లాన్ రీఛార్జ్ చేస్తే 56 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 1.5జీబీ డేటా వాడుకోవచ్చు. మొత్తం 84జీబీ డేటా వాడుకోవచ్చు. అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ చేయొచ్చు. రోజూ 100 ఎస్ఎంఎస్‌లు వాడుకోవచ్చు. గతంలో ఈ ప్లాన్ ధర రూ.399 ఉండగా ఇప్పుడు రూ.479 ధరకు పెరిగింది.

    Jio Rs 666 Plan: జియో రూ.666 ప్లాన్ రీఛార్జ్ చేస్తే 84 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 1.5జీబీ డేటా వాడుకోవచ్చు. మొత్తం 126జీబీ డేటా వాడుకోవచ్చు. అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ చేయొచ్చు. రోజూ 100 ఎస్ఎంఎస్‌లు వాడుకోవచ్చు. గతంలో ఈ ప్లాన్ ధర రూ.555 ఉండగా ఇప్పుడు రూ.666 ధరకు పెరిగింది.

    WhatsApp Tricks: నెంబర్ సేవ్ చేసుకోకుండా వాట్సప్ మెసేజ్ పంపండి ఇలా

    Jio Rs 2545 Plan: జియో రూ.2545 ప్లాన్ రీఛార్జ్ చేస్తే 336 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 1.5జీబీ డేటా వాడుకోవచ్చు. మొత్తం 504జీబీ డేటా వాడుకోవచ్చు. అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ చేయొచ్చు. రోజూ 100 ఎస్ఎంఎస్‌లు వాడుకోవచ్చు. గతంలో ఈ ప్లాన్ ధర రూ.555 ఉండగా ఇప్పుడు రూ.666 ధరకు పెరిగింది.

    Jio Rs 179 Plan: జియో రూ.179 ప్లాన్ రీఛార్జ్ చేస్తే 24 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 1జీబీ డేటా వాడుకోవచ్చు. మొత్తం 24జీబీ డేటా వాడుకోవచ్చు. అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ చేయొచ్చు. రోజూ 100 ఎస్ఎంఎస్‌లు వాడుకోవచ్చు. గతంలో ఈ ప్లాన్ రూ.149 ఉండగా ఇప్పుడు రూ.179 ధరకు పెరిగింది.

    Jio Rs 149 Plan: జియో రూ.149 ప్లాన్ రీఛార్జ్ చేస్తే 20 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 1జీబీ డేటా వాడుకోవచ్చు. మొత్తం 20జీబీ డేటా వాడుకోవచ్చు. అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ చేయొచ్చు. రోజూ 100 ఎస్ఎంఎస్‌లు వాడుకోవచ్చు.
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: Jio, Reliance Jio

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు