Reliance Jio: జియో నుంచి కొత్తగా రూ.594, రూ.297 ప్లాన్స్... వివరాలివే

రూ.594 ప్లాన్‌తో 168 రోజుల పాటు అన్‌లిమిటెడ్ డేటా, కాల్స్ పొందొచ్చు. జియో అప్లికేషన్లు కాంప్లిమెంటరీగా వాడుకోవచ్చు. 0.5 జీబీ డేటా పూర్తైన తర్వాత స్పీడ్ 64కేబీపీఎస్‌కు తగ్గిపోతుంది.

news18-telugu
Updated: January 24, 2019, 6:03 PM IST
Reliance Jio: జియో నుంచి కొత్తగా రూ.594, రూ.297 ప్లాన్స్... వివరాలివే
Reliance Jio: జియో నుంచి కొత్తగా రూ.594, రూ.297 ప్లాన్స్... వివరాలివే
news18-telugu
Updated: January 24, 2019, 6:03 PM IST
ఎక్కువ వ్యాలిడిటీతో జియో ప్లాన్స్ కోసం ఎదురుచూస్తున్నవారికి శుభవార్త. రిలయెన్స్ జియో మరో రెండు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్స్ ప్రకటించింది. రూ.594, రూ.297 ప్లాన్స్‌తో రీఛార్జ్ చేసుకుంటే ఎక్కువ వ్యాలిడిటీ పొందొచ్చు. రూ.594 ప్లాన్‌తో 168 రోజుల పాటు అన్‌లిమిటెడ్ డేటా, కాల్స్ పొందొచ్చు. జియో అప్లికేషన్లు కాంప్లిమెంటరీగా వాడుకోవచ్చు. 0.5 జీబీ డేటా పూర్తైన తర్వాత స్పీడ్ 64కేబీపీఎస్‌కు తగ్గిపోతుంది. ఈ ప్లాన్‌లో 28 రోజులకు 300 ఎస్ఎంఎస్‌లు వస్తాయి.

ఇవి కూడా చదవండి:

Channel Selector Application: ఛానెళ్ల ఎంపికకు ట్రాయ్ కొత్త అప్లికేషన్... ఇలా సెలెక్ట్ చేసుకోండి

IRCTC: టికెట్ బుక్ చేస్తున్నారా? ఐఆర్‌సీటీసీలో 10 కొత్త ఫీచర్లు ఇవే...



రూ.297 ప్లాన్‌లో 84 రోజుల పాటు అన్‌లిమిటెడ్ లోకల్, నేషనల్ కాల్స్‌, డేటా పొందొచ్చు. 0.5 జీబీ డేటా పూర్తైన తర్వాత స్పీడ్ 64కేబీపీఎస్‌కు తగ్గిపోతుంది. ఈ ప్లాన్‌లో 28 రోజులకు 300 ఎస్ఎంఎస్‌లు వస్తాయి. తక్కువ రీఛార్జ్‌తో ఎక్కువ వ్యాలిడిటీ కోరుకునేవారికి ఈ ప్లాన్స్ ఉపయోగపడతాయి. ఇవే కాకుండా జియో నుంచి రూ.200 లోపు చవకైన ప్లాన్స్ కూడా ఉన్నాయి. రూ.19 మొదలుకొని రూ.52, రూ.98, రూ.149, రూ.198 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్స్ ఉన్నాయి.

ఇవి కూడా చదవండి:Paytm Offer: డబ్బులు లేకపోయినా పేటీఎంలో రూ.60,000 షాపింగ్

WhatsApp Features: వాట్సప్‌లో ఈ 9 ఫీచర్లు ట్రై చేశారా?

 
First published: January 24, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు