రిలయెన్స్ జియో నుంచి అద్భుతమైన అవకాశం లభిస్తోంది. జియో కొత్తగా లాంఛ్ చేసిన జియోపీఓఎస్ లైట్ కమ్యూనిటీ రీఛార్జ్ యాప్‌తో మీరు డబ్బులు సంపాదించొచ్చు. ఈ యాప్ గూగుల్ ప్లేస్టోర్‌లో అందుబాటులో ఉంది. ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకొని మీరు జియో పార్ట్నర్గా మారొచ్చు. జియో సబ్స్క్రైబర్లకు రీఛార్జ్ చేసి డబ్బులు సంపాదించొచ్చు. అంటే ఎవరైనా జియో యూజర్ ఉంటే వారి నెంబర్‌కు మీరు రీఛార్జ్ చేసి కమిషన్ పొందొచ్చు. ఈ యాప్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా సులువుగానే ఉంది. ఎలాంటి డాక్యుమెంట్, ఫిజికల్ వెరిఫికేషన్ అవసరం లేదు. కేవలం JioPOS Lite యాప్ డౌన్లోడ్ చేసుకొని రిజిస్టర్ చేసుకుంటే చాలు. రిజిస్టర్ చేయడానికి ఈ స్టెప్స్ ఫాలో అవండి.
ముందుగా గూగుల్ ప్లే స్టోర్‌లో JioPOS Lite డౌన్లోడ్ చేయండి. అన్ని పర్మిషన్స్ Allow చేయండి. Sign Up పైన క్లిక్ చేయండి. ఇమెయిల్ ఐడీ, జియో నెంబర్‌తో రిజిస్టర్ చేసుకోండి. Generate OTP పైన క్లిక్ చేయండి. ఓటీపీ ఎంటర్ చేసి రిజిస్ట్రేషన్ పూర్తి చేయండి. రిజిస్ట్రేషన్ పూర్తైన తర్వాత డబ్బులు లోడ్ చేయాలి. రూ.500, రూ.1,000, రూ.2,000 ఇలా ఎంతైనా లోడ్ చేయొచ్చు. ఆ తర్వాత మీరు ఏ జియో నెంబర్‌కైనా రీఛార్జ్ చేయొచ్చు. మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో పాటు ఇతర కస్టమర్లకు కూడా రీఛార్జ్ చేయొచ్చు.
మీరు చేసే రీఛార్జ్‌లపై మీకు 4.16 శాతం కమిషన్ వస్తుంది. అంటే మీరు రూ.100 రీఛార్జ్ చేస్తే మీకు రూ.4.16 కమిషన్ వస్తుంది. యాప్‌లో పాస్‌బుక్ ఉంటుంది. అందులో మీకు ఎంత కమిషన్ వచ్చిందో తెలుసుకోవచ్చు. గత 20 రోజుల ట్రాన్సాక్షన్స్ కూడా చూడొచ్చు. అయితే ఇప్పటికే మైజియో యాప్ లేదా వెబ్సైట్లు ఉపయోగించేవారికి మీరు రీఛార్జ్ చేస్తే ఎలాంటి కమిషన్ రాదు. వారికి రీఛార్జ్ మాత్రమే చేయగలరు.
ఇవి కూడా చదవండి:
Credit Card: డబ్బులు లేవా? క్రెడిట్ కార్డ్ బిల్లు కట్టండి ఇలా
Lockdown: ఏటీఎం కార్డులు వాడట్లేదా? స్విచ్చాఫ్ చేయండి ఇలా
SBI phone banking: మీ ఫోన్ నుంచే ఎస్బీఐ బ్యాంకింగ్ సేవలు పొందొచ్చు ఇలా
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Business, Business Ideas, BUSINESS NEWS, Jio, Personal Finance, Reliance Jio, Small business