RELIANCE JIO LAUNCHES JIOMEET VIDEO CALLING PLATFORM KNOW HOW TO USE SS
JioMeet: జియో మీట్ వచ్చేసింది... వీడియో కాల్స్ చేయండి ఇలా
JioMeet: జియో మీట్ వచ్చేసింది... వీడియో కాల్స్ చేయండి ఇలా
(ప్రతీకాత్మక చిత్రం)
JioMeet video calling | మీరు ఎక్కువగా వీడియో కాల్స్ చేస్తుంటారా? గ్రూప్ కాల్స్ అటెండ్ అవుతుంటారా? వీడియో కాల్స్, మీచింగ్స్ కోసం జియోమీట్ ప్రారంభించింది రిలయెన్స్ జియో. ఎలా పనిచేస్తుందో తెలుసుకోండి.
రిలయెన్స్ జియో మీట్ వచ్చేసింది. 2019-20 నాలుగో త్రైమాసిక ఫలితాలను ప్రకటించినప్పుడు జియో మీట్‌ను అధికారికంగా రిలీజ్ చేస్తున్నట్టు వెల్లడించింది రిలయెన్స్. వాస్తవానికి జియోమీట్‌ను గతంలోనే పరిచయం చేసింది రిలయెన్స్. ఇప్పుడు జియో ప్లాట్‌ఫామ్స్‌లో అధికారికంగా జియోమీట్‌ను లాంఛ్ చేయడం విశేషం. జియోమీట్ యాప్ వీడియోకాల్స్ చేసుకోవడానికి ఉపయోగపడే ప్లాట్‌ఫామ్. మీరు ఈ యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్‌లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. మైక్రోసాఫ్ట్ విండోస్ మార్కెట్‌ప్లేస్ నుంచి, మ్యాక్ యాప్ స్టోర్ నుంచి జియోమీట్ యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఔట్‌లుక్‌లో ప్లగిన్ కూడా ఉంది. అంతేకాదు ఎవరికైనా జియోమీట్‌లో మీటింగ్‌లో జాయిన్ కావాలని లింక్ పంపిస్తే వాళ్లు గూగుల్ క్రోమ్, మొజిల్లా ఫైర్ఫాక్స్ లాంటి వెబ్ బ్రౌజర్లలో కూడా వీడియో కాల్ మాట్లాడొచ్చు. యాప్ డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. జియోమీట్‌ను స్మార్ట్‌ఫోన్, ట్యాబ్లెట్, ల్యాప్‌టాప్, డెస్క్‌టాప్ ఇలా ఏ యాప్‌లో అయినా యాక్సెస్ చేయొచ్చు.
JioMeet: జియోమీట్ యాప్‌ను ఉపయోగించండి ఇలా
స్మార్ట్‌ఫోన్‌లో ముందుగా గూగుల్ ప్లే స్టోర్ లేదా యాపిల్ యాప్ స్టోర్‌లో జియోమీట్ యాప్‌ను డౌన్లోడ్ చేయండి.
మీ ఇమెయిల్ ఐడీ, పాస్‌వర్డ్‌తో లాగిన్ చేయండి. గెస్ట్ లేదా ఓటీపీ ద్వారా కూడా లాగిన్ కావొచ్చు.
గెస్ట్ పైన క్లిక్ చేస్తే మీ పేరు, మీటింగ్ ఐడీ యూఆర్ఎల్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
యూజర్ ఐడీ, పాస్వర్డ్ లేదా ఓటీపీతో లాగిన్ చేస్తే జియోమీట్ ప్లాట్‌ఫామ్ పైన ఉన్న కాంటాక్ట్స్ కనిపిస్తాయి. వారిని ఇన్వైట్ చేయొచ్చు.
విండోస్‌లో అయితే https://jiomeet.jio.com/ వెబ్సైట్ ఓపెన్ చేయండి.
హోమ్ పేజీ నుంచి విండోస్ వర్షన్ డౌన్లోడ్ చేయొచ్చు.
.exe ఫైల్ డౌన్లోడ్ చేసిన తర్వాత యాప్ ఇన్స్టాల్ చేయాలి.
మీ డెస్క్‌టాప్ పైన షార్ట్‌కట్ క్రియేట్ అవుతుంది.
అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత మీ ఇమెయిల్ ఐడీ, పాస్వర్డ్ లేదా ఓటీపీతో లాగిన్ కావాలి.
ఓటీపీ లాగిన్ ఉపయోగిస్తున్నట్టైతే మీ స్మార్ట్‌ఫోన్‌లో జియోమీట్ యాప్ ఉండాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.