ఆంధ్రప్రదేశ్‌లోని రిలయన్స్ జియో (Reliance Jio) యూజర్లకు శుభవార్త. జియో ట్రూ 5జీ (Jio True 5G) సేవలు ఆంధ్రప్రదేశ్‌లో ప్రారంభమయ్యాయి. గత నెలలో హైదరాబాద్‌లో జియో ట్రూ 5జీ సేవలు అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లోని తిరుమల (Tirumala), విశాఖపట్నం (Visakhapatnam), విజయవాడ (Vijayawada), గుంటూరు (Guntur) నగరాల్లో జియో ట్రూ 5జీ ప్రారంభమయ్యాయి. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో జియో 5జీ అందుబాటులోకి వచ్చినట్టే. 5జీ స్మార్ట్‌ఫోన్ ఉపయోగిస్తున్న రిలయన్స్ జియో యూజర్లు, తమ స్మార్ట్‌ఫోన్‌లో జియో ట్రూ 5జీ నెట్వర్క్ ఉపయోగించవచ్చు. ఇందుకోసం కొన్ని సెట్టింగ్స్ మార్చాలి. ఆ సెట్టింగ్స్ ఏంటో తెలుసుకోండి.
Step 1- ముందుగా ఫోన్‌లో సెట్టింగ్స్ ఓపెన్ చేయాలి.
Step 2- ఆ తర్వాత Mobile network లేదా సిమ్ కార్డ్‌కు సంబంధించిన ఆప్షన్ సెలెక్ట్ చేయాలి.
Step 3- అందులో Jio SIM పైన క్లిక్ చేయాలి.
Step 4- ఆ తర్వాత Preferred network type ఆప్షన్ క్లిక్ చేయాలి.
Step 5- 3G,4G, 5G ఆప్షన్స్ ఉంటాయి.
Step 6- అందులో 5G ఆప్షన్ సెలెక్ట్ చేయాలి.
Step 7- మీరు 5G నెట్వర్క్ సెలెక్ట్ చేస్తే స్మార్ట్‌ఫోన్‌లో నెట్వర్క్ స్టేటస్ బార్‌లో 5G సింబల్ కనిపిస్తుంది.
Step 8- మీరు జియో 5జీ నెట్వర్క్‌ను ఉపయోగించుకోవచ్చు.
Welcoming Tirumala, Vizag, Vijayawada and Guntur on #JioTrue5G ????#AndhraPradesh #Visakhapatnam #Vijayawada #Tirupati #Guntur #Jio pic.twitter.com/UlvbElrUlO
— Reliance Jio (@reliancejio) December 26, 2022
జియో ట్రూ 5జీ సేవల లాంఛింగ్ సందర్భంగా వెల్‌కమ్ ఆఫర్ కూడా ప్రకటించింది రిలయన్స్ జియో . జియో యూజర్లు ప్రస్తుతం ఉచితంగానే జియో 5జీ సేవల్ని వాడుకోవచ్చు. 500ఎంబీపీఎస్ నుంచి 1జీబీపీఎస్ స్పీడ్‌తో అన్‌లిమిటెడ్ డేటా వాడుకోవచ్చు. జియో యూజర్లు సిమ్ కార్డ్ మార్చాల్సిన అవసరం లేకుండా జియో 5జీ సేవల్ని వాడుకోవచ్చు. తమ స్మార్ట్‌ఫోన్‌లో జియో 5జీ ఉపయోగించలేకపోతున్నవారు మైజియో యాప్ ఓపెన్ చేసి ఇన్విటేషన్ వచ్చిందో లేదో చెక్ చేయాలి. ఇన్విటేషన్ ఉన్నా, పైన చెప్పిన సెట్టింగ్స్ మార్చినా మీరు 5జీ నెట్వర్క్ ఉపయోగించలేకపోతే ఓసారి సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ చేయాలి.
భారతదేశంలోని 50 పైగా నగరాల్లో జియో 5జీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. తెలంగాణ , ఆంధ్రప్రదేశ్‌లోని ఇతర నగరాలు, పట్టణాల్లో కూడా త్వరలోనే జియో ట్రూ 5జీ సేవలు అందుబాటులోకి వస్తాయి. 2023 డిసెంబర్ నాటికి దేశంలోని అన్ని ప్రాంతాల్లో జియో 5జీ సేవలు అందుబాటులోకి వస్తాయి.
రిలయన్స్ జియో స్టాండలోన్ 5జీ నెట్వర్క్ అందిస్తున్న సంగతి తెలిసిందే. అంటే జియో 5జీ నెట్వర్క్ 4జీ నెట్వర్క్‌పై ఆధారపడదు. అడ్వాన్స్‌డ్ 5జీ నెట్వర్క్ లభిస్తుంది. 5G కోసం రిలయన్స్ జియో దగ్గర 700MHz, 3500 MHz, 26 GHz బ్యాండ్‌లతో అతిపెద్ద, అత్యంత సముచితమైన వైర్‌లెస్ స్పెక్ట్రమ్ మిక్స్ ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Guntur, Jio 5G, Jio TRUE 5G, Tirumala, Vijayawada, Visakhapatnam