హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Jio True 5G: ఏపీలో మరో 7 నగరాల్లో జియో ట్రూ 5జీ సేవలు... అన్‌లిమిటెడ్ 5జీ డేటా

Jio True 5G: ఏపీలో మరో 7 నగరాల్లో జియో ట్రూ 5జీ సేవలు... అన్‌లిమిటెడ్ 5జీ డేటా

Jio True 5G: ఏపీలో మరో 7 నగరాల్లో జియో ట్రూ 5జీ సేవలు... అన్‌లిమిటెడ్ 5జీ డేటా
(ప్రతీకాత్మక చిత్రం)

Jio True 5G: ఏపీలో మరో 7 నగరాల్లో జియో ట్రూ 5జీ సేవలు... అన్‌లిమిటెడ్ 5జీ డేటా (ప్రతీకాత్మక చిత్రం)

Jio True 5G | ఆంధ్రప్రదేశ్‌లోని మరో 7 నగరాలతో పాటు తెలంగాణలోని ఓ పట్టణంలో జియో ట్రూ 5జీ సేవలు (Jio True 5G Services) అందుబాటులోకి వచ్చాయి. వెల్‌కమ్ ఆఫర్‌లో భాగంగా అన్‌లిమిటెడ్ 5జీ డేటా వాడుకోవచ్చు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

రిలయన్స్ జియో (Reliance Jio) దేశవ్యాప్తంగా దూకుడుగా జియో ట్రూ 5జీ (Jio True 5G) సేవ‌ల్ని ప్రారంభిస్తోంది. అందులో భాగంగా 17 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 50 పట్టణాల్లో జియో ట్రూ 5జీ ప్రారంభించినట్టు రిలయన్స్ జియో ప్రకటించింది. వీటిలో కొత్తగా గోవా, హర్యానా, పుదుచ్చెరీ చేరాయి.

కోటాలో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, హర్యానా సర్కిల్‌లో ఆ రాష్ట్ర హోం మంత్రి అనిల్ విజ్ జియో ట్రూ 5జీ సేవల్ని ప్రారంభించారు. దీంతో దేశవ్యాప్తంగా 184 పట్టణాలు, నగరాల్లో జియో ట్రూ 5జీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. తాజాగా జియో ట్రూ 5జీ సేవలు అందుబాటులోకి వచ్చిన పట్టణాల జాబితాలో తెలుగు రాష్ట్రాలు కూడా ఉన్నాయి. తెలంగాణలోని నల్గొండ, ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూర్, కడప , నర్సారావుపేట, ఒంగోలు, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం , విజయనగరంలో జియో ట్రూ 5జీ సేవలు ప్రారంభం అయ్యాయి.

కొత్త సంవత్సరంలో ప్రతీ జియో యూజర్ జియో ట్రూ 5జీ సాంకేతిక పరివర్తన ప్రయోజనాలను ఆస్వాదించాలని తాము కోరుకుంటున్నామని, దేశవ్యాప్తంగా ట్రూ 5జీ రోల్‌అవుట్ వేగాన్ని, తీవ్రతను పెంచామని, 2023 డిసెంబర్ నాటికి దేశమంతా 5జీ సేవల్ని అందిస్తామని రిలయన్స్ జియో ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్, అస్సాం, ఛత్తీస్‌గఢ్, గోవా, హర్యానా, జార్ఖండ్, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, ఒడిశా, పుదుచ్చేరి, పంజాబ్, రాజస్తాన్, తమిళనాడు, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వాలకు రిలయన్స్ జియో కృతజ్ఞతలు తెలిపింది.

Samsung Galaxy A23 5G: పాపులర్ ప్రాసెసర్, 50MP OIS కెమెరాతో సాంసంగ్ గెలాక్సీ ఏ23 5జీ మొబైల్ ... భారీ ఎక్స్‌ఛేంజ్ డిస్కౌంట్

jio 5g plans, jio true 5g in andhra pradesh, jio true 5g in telangana, jio true 5g near me, jio true 5g offer, jio true 5g total cities, jio true 5g welcome offer, జియో ట్రూ 5జీ ఆంధ్రప్రదేశ్, జియో ట్రూ 5జీ ఆఫర్, జియో ట్రూ 5జీ కవరేజీ, జియో ట్రూ 5జీ తెలంగాణ, జియో ట్రూ 5జీ ప్లాన్స్

జియో వెల్‌కమ్ ఆఫర్

జియో ట్రూ 5జీ సేవల లాంఛింగ్ సందర్భంగా రిలయన్స్ జియో వెల్‌కమ్ ఆఫర్ అందిస్తోంది. జియో యూజర్లు ప్రస్తుతం ఉచితంగానే జియో 5జీ సేవల్ని వాడుకోవచ్చు. 1జీబీపీఎస్ వరకు స్పీడ్‌తో అన్‌లిమిటెడ్ డేటా వాడుకోవచ్చు. జియో యూజర్లు సిమ్ కార్డ్ మార్చాల్సిన అవసరం లేకుండా జియో 5జీ సేవల్ని ఉపయోగించుకోవచ్చు.

తమ స్మార్ట్‌ఫోన్‌లో జియో 5జీ ఉపయోగించలేకపోతున్నవారు మైజియో యాప్ ఓపెన్ చేసి ఇన్విటేషన్ వచ్చిందో లేదో చెక్ చేయాలి. ఇన్విటేషన్ ఉన్నా, పైన చెప్పిన సెట్టింగ్స్ మార్చినా మీరు 5జీ నెట్వర్క్ ఉపయోగించలేకపోతే ఓసారి సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ చేయాలి. ఈ కింది సెట్టింగ్స్ మార్చి జియో 5జీ నెట్వర్క్ వాడుకోవచ్చు.

Tecno Phantom X2 Pro: ప్రపంచంలోనే తొలిసారి ముడుచుకుపోయే కెమెరాతో స్మార్ట్‌ఫోన్ ... విశేషాలివే

ముందుగా ఫోన్‌లో సెట్టింగ్స్ ఓపెన్ చేయాలి.

ఆ తర్వాత Mobile network లేదా సిమ్ కార్డ్‌కు సంబంధించిన ఆప్షన్ సెలెక్ట్ చేయాలి.

అందులో Jio SIM పైన క్లిక్ చేయాలి.

ఆ తర్వాత Preferred network type ఆప్షన్ క్లిక్ చేయాలి.

3G,4G, 5G ఆప్షన్ సెలెక్ట్ చేయాలి.

మీరు 5G నెట్వర్క్ సెలెక్ట్ చేస్తే స్మార్ట్‌ఫోన్‌లో నెట్వర్క్ స్టేటస్ బార్‌లో 5G సింబల్ కనిపిస్తుంది.

మీరు జియో 5జీ నెట్వర్క్‌ను ఉపయోగించుకోవచ్చు.

రిలయన్స్ జియో స్టాండలోన్ 5జీ నెట్వర్క్ అందిస్తున్న సంగతి తెలిసిందే. అంటే జియో 5జీ నెట్వర్క్ 4జీ నెట్వర్క్‌పై ఆధారపడదు. అడ్వాన్స్‌డ్ 5జీ నెట్వర్క్ లభిస్తుంది. 5G కోసం రిలయన్స్ జియో దగ్గర 700MHz, 3500 MHz, 26 GHz బ్యాండ్‌లతో అతిపెద్ద, అత్యంత సముచితమైన వైర్‌లెస్ స్పెక్ట్రమ్ మిక్స్ ఉంది.

First published:

Tags: Jio, Jio TRUE 5G, Reliance Jio

ఉత్తమ కథలు