Jio Saarthi: సరికొత్త సేవలు అందించనున్న రిలయెన్స్ జియో డిజిటల్ అసిస్టెంట్

Jio Saarthi | మైజియో యాప్‌లో 'జియో సారథి' ఐకాన్ పైన క్లిక్ చేస్తే మీ ఫోన్ నెంబర్‌కు రీఛార్జ్ చేయడానికి కావాల్సిన స్టెప్స్ వివరిస్తుంది డిజిటల్ అసిస్టెంట్.

news18-telugu
Updated: July 29, 2019, 2:09 PM IST
Jio Saarthi: సరికొత్త సేవలు అందించనున్న రిలయెన్స్ జియో డిజిటల్ అసిస్టెంట్
Jio Saarthi: సరికొత్త సేవలు అందించనున్న రిలయెన్స్ జియో డిజిటల్ అసిస్టెంట్
  • Share this:
రిలయెన్స్ జియో తమ యూజర్లకు సరికొత్త సేవల్ని అందిస్తోంది. మై జియో యాప్‌లో 'జియో సారథి' పేరుతో డిజిటల్ అసిస్టెంట్ సేవల్ని ప్రారంభించింది. మై జియో యాప్‌లో భాగంగా ఉండే డిజిటల్ అసిస్టెంట్ జియో సబ్‌స్క్రైబర్లకు కావాల్సిన రీఛార్జ్ సేవల్ని అందించనుంది. ఆన్‌లైన్ రీఛార్జ్‌లను ప్రోత్సహించేందుకు రిలయెన్స్ జియో ప్రారంభించిన సరికొత్త సేవలివి. ఇప్పటివరకు ఆన్‌లైన్ రీఛార్జ్ చేయనివాళ్లు కూడా సులువుగా తమ నెంబర్‌కు రీఛార్జ్ చేసుకోవచ్చు. రీఛార్జ్ కోసం ఇతరులపై ఆధారపడాల్సిన అవసరం లేదు. అయితే ఇప్పటివరకు ఆన్‌లైన్‌లో రీఛార్జ్ చేయనివాళ్లకు మాత్రమే 'జియో సారథి' సర్వీస్ అందుబాటులో ఉంటుంది. ఇప్పటికే మీరు ఆన్‌లైన్‌లో రీఛార్జ్ చేసినట్టైదే మీ ఫోన్‌లోని మై జియో యాప్‌లో 'జియో సారథి' డిజిటల్ అసిస్టెంట్ కనిపించదు. 'జియో సారథి' డిజిటల్ అసిస్టెంట్ ఎలా పనిచేస్తుందో ఈ వీడియోలో చూడండి.


మైజియో యాప్‌లో 'జియో సారథి' ఐకాన్ పైన క్లిక్ చేస్తే మీ ఫోన్ నెంబర్‌కు రీఛార్జ్ చేయడానికి కావాల్సిన స్టెప్స్ వివరిస్తుంది డిజిటల్ అసిస్టెంట్. రీఛార్జ్ ప్లాన్ ఎంచుకోవడం దగ్గర్నుంచి పేమెంట్ పూర్తి చేసేవరకు మొత్తం ప్రాసెస్ డిజిటల్ అసిస్టెంట్ సాయంతో పూర్తి చేయొచ్చు. ప్రస్తుతానికి 'జియో సారథి' కేవలం ఇంగ్లీష్, హిందీ భాషల్లో మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలో 12 ప్రాంతీయ భాషల్లో సేవల్ని అందించేందుకు రిలయెన్స్ జియో కసరత్తు చేస్తోంది.

BMW X7: ఇండియాలోనే బీఎండ్ల్యూ ఎక్స్7 తయారీ... కారు ఎలా ఉందో చూడండి


ఇవి కూడా చదవండి:

SBI: ఎస్‌బీఐ ఇంటర్నెట్ బ్యాంకింగ్... రిజిస్టర్ చేసుకోవడానికి స్టెప్స్ ఇవే...Location: మీ లొకేషన్ షేర్ చేయడానికి 4 టిప్స్

WhatsApp Status: వాట్సప్ స్టేటస్ ఈజీగా డౌన్‌లోడ్ చేయండి ఇలా...
First published: July 29, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading