మరోసారి భారతదేశంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) సందడి ప్రారంభం కాబోతోంది. మార్చి 31న ఐపీఎల్ సీజన్ ప్రారంభం కానుంది. క్రికెట్ ప్రేమికుల కోసం రిలయన్స్ జియో (Reliance Jio) ఐపీఎల్ ప్లాన్స్ ప్రకటించింది. జియో ఐపీఎల్ ప్లాన్స్ (Jio IPL Plans) రీఛార్జ్ చేసినవారు ఎక్కువ డేటా ఉపయోగించుకోవచ్చు. రూ.219, రూ.399, రూ.999 ధరకు మూడు ప్లాన్స్ ప్రకటించింది. అన్ని క్రికెట్ ప్లాన్‌లతో కూడిన నిజమైన, అపరిమిత ట్రూ 5జీ డేటా ఉపయోగించుకోవచ్చని, జియో వినియోగదారులు 4కే క్లారిటీతో, ప్రత్యక్ష మ్యాచ్‌లను చూడవచ్చని, క్రికెట్ ప్రేమికులు లీనమయ్యే అనుభవాన్ని పొందడానికి ఈ ప్లాన్స్ రూపొందించామని జియో ప్రకటించింది. ఈ ఆఫర్స్‌ని జియో యూజర్లు మార్చి 24 నుంచి పొందొచ్చని కంపెనీ ప్రకటించింది. మరి ఏ ప్లాన్ రీఛార్జ్ చేస్తే ఎలాంటి బెనిఫిట్స్ లభిస్తాయో తెలుసుకోండి.
Jio Rs 999 Plan: జియో రూ.999 ప్లాన్ రీఛార్జ్ చేస్తే 84 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 3జీబీ డేటా చొప్పున మొత్తం 252జీబీ డేటా వాడుకోవచ్చు. రూ.241 విలువైన 40జీబీ డేటా ఓచర్ ఉచితంగా లభిస్తుంది. మొత్తం కలిపి 292జీబీ డేటా వాడుకోవచ్చు. అన్‍లిమిటెడ్ వాయిస్ కాల్స్ ఉచితం. రోజూ 100 ఎస్ఎంఎస్‌లు ఉచితం. జియోటీవీ, జియోసినిమా, జియోసెక్యూరిటీ, జియోక్లౌడ్ యాప్స్‌కి యాక్సెస్ ఉచితం. అర్హులైన సబ్‌స్క్రైబర్స్ అన్‌లిమిటెడ్ 5జీ డేటా వాడుకోవచ్చు.
Nokia C12: నోకియా చీపెస్ట్ స్మార్ట్‌ఫోన్ సేల్ ప్రారంభం... ధర రూ.5,999 మాత్రమే
Jio Rs 399 Plan: జియో రూ.399 ప్లాన్ రీఛార్జ్ చేస్తే 28రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 3జీబీ డేటా చొప్పున మొత్తం 84జీబీ డేటా వాడుకోవచ్చు. రూ.61 విలువైన 6జీబీ డేటా ఓచర్ ఉచితంగా లభిస్తుంది. మొత్తం కలిపి 90జీబీ డేటా వాడుకోవచ్చు. అన్‍లిమిటెడ్ వాయిస్ కాల్స్ ఉచితం. రోజూ 100 ఎస్ఎంఎస్‌లు ఉచితం. జియోటీవీ, జియోసినిమా, జియోసెక్యూరిటీ, జియోక్లౌడ్ యాప్స్‌కి యాక్సెస్ ఉచితం. అర్హులైన సబ్‌స్క్రైబర్స్ అన్‌లిమిటెడ్ 5జీ డేటా వాడుకోవచ్చు.
Jio Rs 219 Plan: జియో రూ.219 ప్లాన్ రీఛార్జ్ చేస్తే 14రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 3జీబీ డేటా చొప్పున మొత్తం 42జీబీ డేటా వాడుకోవచ్చు. రూ.25 విలువైన 2జీబీ డేటా ఓచర్ ఉచితంగా లభిస్తుంది. మొత్తం కలిపి 44జీబీ డేటా వాడుకోవచ్చు. అన్‍లిమిటెడ్ వాయిస్ కాల్స్ ఉచితం. రోజూ 100 ఎస్ఎంఎస్‌లు ఉచితం. జియోటీవీ, జియోసినిమా, జియోసెక్యూరిటీ, జియోక్లౌడ్ యాప్స్‌కి యాక్సెస్ ఉచితం. అర్హులైన సబ్‌స్క్రైబర్స్ అన్‌లిమిటెడ్ 5జీ డేటా వాడుకోవచ్చు.
Exchange Offer: ఈ మొబైల్ కొంటే రూ.15,000 పైనే ఎక్స్‌ఛేంజ్ డిస్కౌంట్
ఈ ప్లాన్స్ కాకుండా ఇప్పటికే యాక్టీవ్ ప్లాన్స్‌లో ఉన్నవారికి డేటా క్రికెట్ యాడ్ ఆన్ ప్లాన్స్ అందుబాటులో ఉన్నాయి. రూ.222 క్రికెట్ యాడ్ ఆన్ ప్లాన్ రీఛార్జ్ చేస్తే 50జీబీ డేటా అదనంగా లభిస్తుంది. బేస్ ప్లాన్ ఉన్నవారు రీఛార్జ్ చేయొచ్చు. రూ.444 క్రికెట్ యాడ్ ఆన్ ప్లాన్ రీఛార్జ్ చేస్తే 60 రోజుల వేలిడిటీతో 100జీబీ డేటా లభిస్తుంది. రూ.667 క్రికెట్ యాడ్ ఆన్ ప్లాన్ రీఛార్జ్ చేస్తే 90 రోజుల వేలిడిటీతో 150జీబీ డేటా లభిస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Jio, Jio TRUE 5G, Reliance Jio