JioFiber: జియో ఫైబర్ ప్లాన్స్ ఇవే... ఏ ప్లాన్‌లో ఏఏ బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసుకోండి

JioFiber Plans and Benefits | జియోఫైబర్ వెల్‌కమ్ ఆఫర్‌లో భాగంగా అన్ని ప్లాన్స్‌పై రూ.5000 విలువైన జియో హోమ్ గేట్‌వే, రూ.6400 విలువైన జియో 4కే సెట్ టాప్ బాక్స్ ఉచితంగా లభిస్తాయి.

news18-telugu
Updated: September 6, 2019, 1:02 PM IST
JioFiber: జియో ఫైబర్ ప్లాన్స్ ఇవే... ఏ ప్లాన్‌లో ఏఏ బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసుకోండి
JioFiber: జియో ఫైబర్ ప్లాన్స్ ఇవే... ఏ ప్లాన్‌లో ఏఏ బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసుకోండి (image: JioFiber)
  • Share this:
జియో ఫైబర్... గత ఏడాదిగా వార్తల్లో నిలుస్తున్న హాట్ టాపిక్. టెలికామ్ సెక్టార్‌లో రికార్డులు క్రియేట్ చేసిన రిలయెన్స్ జియో... బ్రాండ్‌బ్యాండ్ సెక్టార్‌లోనూ జియోఫైబర్‌తో సంచలనాలు సృష్టించడం ఖాయమన్న చర్చ జరుగుతోంది. గత ఏడాదే జియోఫైబర్‌ రిజిస్ట్రేషన్స్ ప్రారంభమయ్యాయి. అధికారికంగా సెప్టెంబర్ 5న సేవలు మొదలయ్యాయి. జియో ఫైబర్ ప్లాన్స్‌ని కూడా సెప్టెంబర్ 5న అధికారికంగా ప్రకటించింది రిలయెన్స్. అందరూ అనుకున్నట్టుగానే అదిరిపోయే ఆఫర్లను జియోఫైబర్ ప్రకటించింది. జియోఫైబర్ నుంచి బ్రాంజ్, సిల్వర్, గోల్డ్, డైమండ్, ప్లాటినం, టైటానియం పేరుతో మొత్తం 6 ప్లాన్స్ ఉన్నాయి. జియోఫైబర్‌లో ఏ ప్లాన్ ఎంచుకున్నా రూ.2500 వన్ టైమ్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఇందులో రూ.1500 సెక్యూరిటీ డిపాజిట్, రూ.1000 నాన్ రీఫండబుల్ ఇన్‌స్టాలేషన్ ఛార్జీలు. మరి జియో ఫైబర్‌లోని ప్లాన్స్‌లో వచ్చే బెనిఫిట్స్ ఏంటీ? వేర్వేరు ప్లాన్స్ మధ్య ఉన్న తేడాలు ఏంటీ? తెలుసుకోండి.

JioFiber Bronze Plan: జియోఫైబర్ సిల్వర్ ప్లాన్ ధర రూ.699. ఇది 30 రోజుల ప్లాన్. 100 ఎంబీపీఎస్ స్పీడ్‌తో అన్‌లిమిటెడ్ (100జీబీ+50జీబీ అదనం) ఇంటర్నెట్ డేటా లభిస్తుంది. వాయిస్ కాల్స్ ఉచితం. ఏడాదికి రూ.1200 విలువైన టీవీ వీడియో కాలింగ్ ఉచితం. ఏడాదికి రూ.1200 విలువైన గేమింగ్ ఉచితం. హోమ్ నెట్‌వర్కింగ్ కూడా లభిస్తుంది. 5 డివైజ్‌లకు రూ.999 విలువైన నార్టాన్ డివైజ్ సెక్యూరిటీ కూడా ఈ ప్లాన్‌లో లభిస్తుంది. బ్లూటూత్ స్పీకర్ ఉచితం.

JioFiber Silver Plan: జియోఫైబర్ సిల్వర్ ప్లాన్ ధర రూ.849. ఇది 30 రోజుల ప్లాన్. 100 ఎంబీపీఎస్ స్పీడ్‌తో అన్‌లిమిటెడ్ (200జీబీ+200జీబీ అదనం) ఇంటర్నెట్ డేటా లభిస్తుంది. వాయిస్ కాల్స్ ఉచితం. ఏడాదికి రూ.1200 విలువైన టీవీ వీడియో కాలింగ్ ఉచితం. ఏడాదికి రూ.1200 విలువైన గేమింగ్ ఉచితం. హోమ్ నెట్‌వర్కింగ్ కూడా లభిస్తుంది. 5 డివైజ్‌లకు రూ.999 విలువైన నార్టాన్ డివైజ్ సెక్యూరిటీ కూడా ఈ ప్లాన్‌లో లభిస్తుంది. బ్లూటూత్ స్పీకర్ ఉచితం.

JioFiber Gold Plan: జియోఫైబర్ గోల్డ్ ప్లాన్ ధర రూ.1299. ఇది 30 రోజుల ప్లాన్. 100 ఎంబీపీఎస్ స్పీడ్‌తో అన్‌లిమిటెడ్ (500జీబీ+250జీబీ అదనం) ఇంటర్నెట్ డేటా లభిస్తుంది. వాయిస్ కాల్స్ ఉచితం. ఏడాదికి రూ.1200 విలువైన టీవీ వీడియో కాలింగ్ ఉచితం. ఏడాదికి రూ.1200 విలువైన గేమింగ్ ఉచితం. హోమ్ నెట్‌వర్కింగ్ కూడా లభిస్తుంది. 5 డివైజ్‌లకు రూ.999 విలువైన నార్టాన్ డివైజ్ సెక్యూరిటీ కూడా ఈ ప్లాన్‌లో లభిస్తుంది. 24 అంగుళాల హెచ్‌డీ టీవీ ఉచితం.



JioFiber Diamond Plan: జియోఫైబర్ డైమండ్ ప్లాన్ ధర రూ.2499. ఇది 30 రోజుల ప్లాన్. 100 ఎంబీపీఎస్ స్పీడ్‌తో అన్‌లిమిటెడ్ (12500జీబీ+250జీబీ అదనం) ఇంటర్నెట్ డేటా లభిస్తుంది. వాయిస్ కాల్స్ ఉచితం. ఏడాదికి రూ.1200 విలువైన టీవీ వీడియో కాలింగ్ ఉచితం. ఏడాదికి రూ.1200 విలువైన గేమింగ్ ఉచితం. హోమ్ నెట్‌వర్కింగ్ కూడా లభిస్తుంది. 5 డివైజ్‌లకు రూ.999 విలువైన నార్టాన్ డివైజ్ సెక్యూరిటీ కూడా ఈ ప్లాన్‌లో లభిస్తుంది.  24 అంగుళాల హెచ్‌డీ టీవీ ఉచితం.

JioFiber Platinum Plan: జియోఫైబర్ ప్లాటినమ్ ప్లాన్ ధర రూ.3999. ఇది 30 రోజుల ప్లాన్. 100 ఎంబీపీఎస్ స్పీడ్‌తో అన్‌లిమిటెడ్ (2500జీబీ) ఇంటర్నెట్ డేటా లభిస్తుంది. వాయిస్ కాల్స్ ఉచితం. ఏడాదికి రూ.1200 విలువైన టీవీ వీడియో కాలింగ్ ఉచితం. ఏడాదికి రూ.1200 విలువైన గేమింగ్ ఉచితం. హోమ్ నెట్‌వర్కింగ్ కూడా లభిస్తుంది. 5 డివైజ్‌లకు రూ.999 విలువైన నార్టాన్ డివైజ్ సెక్యూరిటీ కూడా ఈ ప్లాన్‌లో లభిస్తుంది. వీటితో పాటు వీఆర్ ఎక్స్‌పీరియెన్స్, ఫస్ట్ డే ఫస్ట్ షో మూవీస్‌తో ప్రీమియం కంటెంట్ యాక్సెస్ చేయొచ్చు.  32 అంగుళాల హెచ్‌డీ టీవీ ఉచితం.
Loading...
JioFiber Titanium Plan: జియోఫైబర్ టైటానియం ప్లాన్ ధర రూ.8499. ఇది 30 రోజుల ప్లాన్. 100 ఎంబీపీఎస్ స్పీడ్‌తో అన్‌లిమిటెడ్ (5000జీబీ) ఇంటర్నెట్ డేటా లభిస్తుంది. వాయిస్ కాల్స్ ఉచితం. ఏడాదికి రూ.1200 విలువైన టీవీ వీడియో కాలింగ్ ఉచితం. ఏడాదికి రూ.1200 విలువైన గేమింగ్ ఉచితం. హోమ్ నెట్‌వర్కింగ్ కూడా లభిస్తుంది. 5 డివైజ్‌లకు రూ.999 విలువైన నార్టాన్ డివైజ్ సెక్యూరిటీ కూడా ఈ ప్లాన్‌లో లభిస్తుంది. వీటితో పాటు వీఆర్ ఎక్స్‌పీరియెన్స్, ఫస్ట్ డే ఫస్ట్ షో మూవీస్‌తో ప్రీమియం కంటెంట్ యాక్సెస్ చేయొచ్చు.  43 అంగుళాల 4కే టీవీ ఉచితం.

వెల్‌కమ్ ఆఫర్‌లో భాగంగా అన్ని ప్లాన్స్‌పై రూ.5000 విలువైన జియో హోమ్ గేట్‌వే, రూ.6400 విలువైన జియో 4కే సెట్ టాప్ బాక్స్ ఉచితంగా లభిస్తాయి. బ్రాంజ్, సిల్వర్‌ ప్లాన్స్‌పై జియో సినిమా, జియోసావన్‌తో పాటు ఇతర ఓటీటీ యాప్స్ 3 నెలల సబ్‌స్క్రిప్షన్ ఉచితం. గోల్డ్, డైమండ్, ప్లాటినం, టైటానియం ప్లాన్స్‌పై జియో సినిమా, జియోసావన్‌తో పాటు ఇతర ఓటీటీ యాప్స్ వార్షిక సబ్‌స్క్రిప్షన్ ఉచితం. అంటే జియోఫైబర్ కనెక్షన్ తీసుకున్నవారు ఓటీటీ యాప్స్‌కు వేరుగా సబ్‌స్క్రిప్షన్ చేయించాల్సిన అవసరం లేదు. జియోఫైబర్ ప్లాన్స్ గురించి వివరంగా తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి. జియోఫైబర్‌కు ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలో తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.

Mi A3: అద్భుతమైన ఫీచర్లతో షావోమీ ఎంఐ ఏ3 రిలీజ్... ఎలా ఉందో చూడండి


ఇవి కూడా చదవండి:

Smartphone: రూ.10,000 లోపు బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ ఇవే...

Android 10: ఆండ్రాయిడ్ 10 వచ్చేసింది... ఆకట్టుకునే ఫీచర్స్ ఇవే

Post Office Scheme: ప్రతీ నెలా ఆదాయం కావాలా? ఈ పోస్ట్ ఆఫీస్ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేయండి
First published: September 6, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...