Reliance Jio: మహిళల కోసం రిలయెన్స్ జియో కొత్త కార్యక్రమం

Reliance Jio | భారతదేశంలో డిజిటల్ విప్లవంలో మహిళలకు యాక్సెస్ లేకపోవడం, స్తోమత లేకపోవడం కారణంగా జెండర్ గ్యాప్ కనిపిస్తోంది. అందుకే టెక్నాలజీ వాడకంలో జెండర్ గ్యాప్ తగ్గించేందుకు రిలయెన్స్ జియో ముందడుగు వేసింది.

news18-telugu
Updated: July 15, 2019, 6:18 PM IST
Reliance Jio: మహిళల కోసం రిలయెన్స్ జియో కొత్త కార్యక్రమం
Reliance Jio: మహిళల కోసం రిలయెన్స్ జియో కొత్త కార్యక్రమం
  • Share this:
ప్రపంచంలోనే అతిపెద్ద మొబైల్ డేటా నెట్‌వర్క్ అయిన రిలయెన్స్ జియో... జీఎస్ఎంఏ చేపట్టిన కనెక్టెడ్ వుమెన్ ఇనీషియేటీవ్‌తో చేతులు కలిపింది. భారతదేశంలోని మహిళలకు డిజిటల్ అడాప్షన్, డిజిటల్ లిటరసీలో ఉన్న జెండర్ గ్యాప్ తగ్గించడానికి కనెక్టెడ్ వుమెన్ ఇనీషియేటీవ్‌ కార్యక్రమాన్ని చేపట్టింది GSMA. జీవితాల్ని మెరుగుపర్చే డిజిటల్ సర్వీసుల్ని వాడుకునేలా మహిళల్ని ప్రోత్సహించేందుకు జీఎస్ఎంఏతో కలిసి పనిచేయనుంది రిలయెన్స్ జియో. మొబైల్, ఇంటర్నెట్ టెక్నాలజీతో ప్రజలు విజ్ఞానంతో పాటు వినోదాన్ని పొందుతుండటం ఇటీవల కాలంలో బాగా పెరిగిపోయింది. అయితే భారతదేశంలో డిజిటల్ విప్లవంలో మహిళలకు యాక్సెస్ లేకపోవడం, స్తోమత లేకపోవడం కారణంగా జెండర్ గ్యాప్ కనిపిస్తోంది. అందుకే టెక్నాలజీ వాడకంలో జెండర్ గ్యాప్ తగ్గించేందుకు రిలయెన్స్ జియో ముందడుగు వేసింది.

దశాబ్దకాలంగా మొబైల్, ఇంటర్నెట్ టెక్నాలజీస్‌లో వృద్ది వేగంగా, గొప్పగా ఉంది. సమాచారాన్ని అందుబాటులోకి తీసుకురావడం, విద్య, ఆర్థిక చేయూత, జీవితాన్ని మెరుగుపర్చే సేవలు, ఉపాధి అవకాశాల ద్వారా మహిళా సాధికారతకు, వారి జీవితాలను మార్చేందుకు మొబైల్, ఇంటర్నెట్ టెక్నాలజీ అద్భుతమైన అవకాశాన్ని కల్పిస్తోంది. అందుకే జియో ముందడుగు వేసింది. భారతీయులందరి కలల్ని నిజం చేసేందుకు మేం కట్టుబడి ఉన్నాం.
ఇషా అంబానీ, డైరెక్టర్, రిలయెన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్


జియోఫోన్ ద్వారా మొదటిసారి మొబైల్ వాడుతున్నవారికి డిజిటల్ లైఫ్‌ను అందిస్తోంది రిలయెన్స్ జియో. నెలకు కేవలం రూ.49 ధరకే వాయిస్, డేటా సేవల్ని అందిస్తోంది రిలయెన్స్ జియో. అనేక మంది డిజిటల్ సేవల్ని పొందేలా జియోఫోన్ ప్రోత్సహిస్తోంది. కోట్లాది మంది మహిళల సాంకేతిక సాధికారత కోసం ఇప్పటికే రిలయెన్స్ జియో ప్రభుత్వం ఆధ్వర్యంలోని పలు కార్యక్రమాల్లో భాగస్వామిగా ఉంది. ఇక కనెక్టెడ్ వుమెన్ ఇనీషియేటీవ్‌లో భాగంగా మొబైల్ ఆపరేటర్లతో కలిసి పనిచేస్తుంది జీఎస్ఎంఏ. మొబైల్ ఇంటర్నెట్, మొబైల్ మనీ సేవల్ని వాడుకోవడంలో ప్రపంచవ్యాప్తంగా మహిళలు ఎదుర్కొంటున్న అడ్డంకుల్ని అధిగమించేందుకు తోడ్పడుతుంది. మొబైల్ ఇండస్ట్రీలో మహిళలకు ఉన్న గణనీయమైన మార్కెట్ అవకాశాల్ని మహిళలకు అందించేందుకు సర్వీస్ ప్రొవైడర్లతో కలిసి జీఎస్ఎంఏ పనిచేస్తుంది.



ఇవి కూడా చదవండి:

Realme 3i: మరో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ రియల్‌మీ 3ఐ రిలీజ్... ధర రూ.7,999

Realme X: రియల్‌మీ ఎక్స్ వచ్చేసింది... ధర ఎంతో తెలుసా?
Loading...
Apple Watch: నీళ్లల్లో మునిగిపోతుంటే కాపాడిన యాపిల్ వాచ్... నమ్మాల్సిందే
First published: July 15, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...