Reliance Jio: ఏపీ టెలికామ్ సర్కిల్‌లో రిలయెన్స్ జియో రికార్డ్

Reliance Jio | 2019 జూలైలో రిలయెన్స్ జియోకు ఏపీ సర్కిల్‌లో 6.59 మంది కొత్త సబ్‌స్క్రైబర్లు చేరారు. దీంతో ఏపీ టెలికామ్ సర్కిల్‌లో జియో సబ్‌స్క్రైబర్ల సంఖ్య 2.71 కోట్లకు చేరింది.

news18-telugu
Updated: September 18, 2019, 9:13 PM IST
Reliance Jio: ఏపీ టెలికామ్ సర్కిల్‌లో రిలయెన్స్ జియో రికార్డ్
Reliance Jio: ఏపీ టెలికామ్ సర్కిల్‌లో రిలయెన్స్ జియో రికార్డ్ (image: Reliance Jio)
news18-telugu
Updated: September 18, 2019, 9:13 PM IST
రిలయెన్స్ జియో... టెలికామ్ రంగంలో సంచలనాలకు మారుపేరు. మూడేళ్ల క్రితం రిలయెన్స్ జియో ప్రారంభమైననాటి నుంచి రికార్డులు సృష్టిస్తూనే ఉంది జియో. ఇప్పుడు మరో రికార్డ్ సొంతం చేసుకుంది. టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా-TRAI లెక్కల ప్రకారం 2019 జూలైలో ఆంధ్రప్రదేశ్ సర్కిల్‌‌లో(తెలంగాణ, ఏపీ) కొత్త సబ్‌స్క్రైబర్లను పొందిన ఏకైక టెలికామ్ కంపెనీ రిలయెన్స్ జియో మాత్రమే. 2019 జూలై 31 నాటికి టెలికామ్ సబ్‌స్క్రిప్షన్ డేటాను రిలీజ్ చేసింది ట్రాయ్. ఈ లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌ సర్కిల్‌లో రిలయెన్స్ జియోకు మాత్రమే సబ్‌స్క్రైబర్ బేస్ పెరిగింది. 2019 జూలైలో రిలయెన్స్ జియోకు ఏపీ సర్కిల్‌లో 6.59 మంది కొత్త సబ్‌స్క్రైబర్లు చేరారు. దీంతో ఏపీ టెలికామ్ సర్కిల్‌లో జియో సబ్‌స్క్రైబర్ల సంఖ్య 2.71 కోట్లకు చేరింది. ఇక మిగతా టెలికాం కంపెనీలు చూస్తే జూలైైలో అన్ని కంపెనీలు సబ్‌స్క్రైబర్లను కోల్పోయారు. ఎయిర్‌టెల్‌ 1 లక్ష కస్టమర్లను, వొడాఫోన్ ఐడియా 2 లక్షల సబ్‌స్క్రైబర్లను, బీఎస్ఎన్‌ఎల్‌ 11,000 మంది యూజర్లను కోల్పోయాయి.

దేశవ్యాప్తంగా చూస్తే రిలయెన్స్ జియోకు కొత్తగా 85 లక్షల మంది యూజర్లు చేరడం విశేషం. దేశవ్యాప్తంగా జియో తర్వాత కొత్త యూజర్లను పొందిన మరో టెలికామ్ సంస్థ బీఎస్ఎన్ఎల్ మాత్రమే. ఎయిర్‌టెల్, వొడాఫోన్ కలిసి 60 లక్షల సబ్‌స్క్రైబర్లను కోల్పోయాయి. 2019 జూలై నాటికి రిలయెన్స్ జియో యూజర్ బేస్ 33.13 కోట్లు కాగా, వొడాఫోన్ ఐడియా యూజర్ బేస్ 32 కోట్లు. 2020 చివరి నాటికి 50 కోట్ల సబ్‌స్క్రైబర్ల మార్క్‌ను దాటాలని రిలయెన్స్ జియో లక్ష్యంగా పెట్టుకుంది. జియో ఫోన్ స్ట్రాటజీ, తక్కువ ధరకే ప్లాన్స్ ద్వారా ఈ లక్ష్యాన్ని చేరుకోవాలని రిలయెన్స్ జియో భావిస్తోంది. 2017లో జియోఫోన్ లాంఛైంది. జియో ఫోన్ ద్వారా కేవలం రూ.49 చెల్లించి యూజర్లు అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. అంతేకాదు... జియో టీవీ, జియో సినిమా, జియోసావన్ లాంటి సేవల్ని కూడా పొందొచ్చు.

Samsung: సాంసంగ్ గెలాక్సీ ఎం30ఎస్ రిలీజ్... ఎలా ఉందో చూడండి




ఇవి కూడా చదవండి:

Flipkart Offer: డబ్బుల్లేవా..? అయినా ఫ్లిప్‌కార్ట్‌లో షాపింగ్ చేయొచ్చు ఇలా...

Bank Holidays: బ్యాంకులకు వరుసగా సెలవులు... అప్రమత్తమవండి
Loading...
IRCTC: తిరుమల తీసుకెళ్తున్న ఐఆర్‌సీటీసీ... ప్యాకేజీ వివరాలివే...
First published: September 18, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...