Home /News /technology /

RELIANCE JIO INTRODUCED RS 2999 PREPAID RECHARGE PLAN WITH VOICE CALLS DATA AND OTHER BENEFITS SS

Jio New Plan: జియో నుంచి కొత్త ప్లాన్... 912జీబీ డేటా వాడుకోవచ్చు

Jio New Plan: జియో నుంచి కొత్త ప్లాన్... 912జీబీ డేటా వాడుకోవచ్చు
(ప్రతీకాత్మక చిత్రం)

Jio New Plan: జియో నుంచి కొత్త ప్లాన్... 912జీబీ డేటా వాడుకోవచ్చు (ప్రతీకాత్మక చిత్రం)

Jio New Plan | రిలయన్స్ జియో మరో కొత్త ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌ను (Prepaid Recharge Plan) ప్రకటించింది. రూ.2999 ప్లాన్ రీఛార్జ్ చేస్తే ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయో తెలుసుకోండి.

    జియో కస్టమర్లకు గుడ్ న్యూస్. రిలయన్స్ జియో (Reliance Jio) మరో కొత్త ప్లాన్ ప్రకటించింది. రోజూ 2.5జీబీ డేటాతో యాన్యువల్ ప్లాన్‌ను లేటెస్ట్‌గా తీసుకొచ్చింది. ఇప్పటికే జియో నుంచి రూ.3,119, రూ.2,879 యాన్యువల్ ప్రీపెయిడ్ ప్లాన్స్ ఉన్న సంగతి తెలిసింది. ఇప్పుడు రూ.2,999 ధరతో మరో యాన్యువల్ ప్లాన్‌ను ప్రకటించింది. రూ.2999 ప్లాన్ రీఛార్జ్ చేస్తే 365 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 2.5జీబీ డేటా చొప్పున మొత్తం 912.5 జీబీ డేటా వాడుకోవచ్చు. అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ చేయొచ్చు. రోజూ 100 ఎస్ఎంఎస్‌లు వాడుకోవచ్చు. జియోటీవీ, జియో సినిమా, జియో సెక్యూరిటీ, జియోక్లౌడ్ లాంటి జియో యాప్స్ సబ్‌స్క్రిప్షన్ ఉచితం.

    జియో రూ.2,999 ప్లాన్‌లో డిస్నీ+ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ లభించదు. డిస్నీ+ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ కావాలనుకుంటే రూ.3,119 యాన్యువల్ ప్లాన్స్ రీఛార్జ్ చేయాల్సి ఉంటుంది. జియో రూ.3,119 ప్లాన్ రీఛార్జ్ చేస్తే 365రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 2జీబీ డేటా చొప్పున మొత్తం 740జీబీ డేటా వాడుకోవచ్చు. అదనంగా మరో 10జీబీ డేటా లభిస్తుంది. అన్‌లిమిటెడ్ కాల్స్ చేయొచ్చు. రోజూ 100 ఎస్ఎంఎస్‌లు వాడుకోవచ్చు. జియో యాప్స్‌తో పాటు రూ.499 విలువైన డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్ ఉచితం.

    Price Hike Alert: వేసవి ముందే షాక్... భారీగా పెరగనున్న ఏసీ, రిఫ్రిజిరేటర్ ధరలు

    ఇక జియో ఇటీవల డిస్నీ+ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ అందించే రూ.499 ప్లాన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. రూ.499 ప్లాన్ రీఛార్జ్ చేస్తే 28 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 2జీబీ డేటా చొప్పున మొత్తం 56జీబీ డేటా వాడుకోవచ్చు. అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ ఉచితం. రోజూ 100ఎస్ఎంఎస్‌లు వాడుకోవచ్చు. డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్‌తో పాటు జియో యాప్స్ సబ్‌స్క్రిప్షన్ ఉచితం.

    జియోలో డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్ అందించే ప్లాన్స్‌లో రూ.499 ప్లాన్‌తో పాటు రూ.601, రూ.799, రూ.1066, రూ.3,119 ప్లాన్స్ ఉన్నాయి. ఈ ప్లాన్స్ అన్నింటికీ రూ.499 విలువైన డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది. వీటితో పాటు రూ.659 ప్లాన్ కూడా ఉంది. ఈ ప్లాన్ రీఛార్జ్ చేస్తే 56 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 1.5జీబీ డేటా చొప్పున 84జీబీ లభిస్తుంది. ఇందులో వాయిస్ కాల్స్, ఎస్ఎంఎస్ బెనిఫిట్స్ ఉండవు.

    Smartphone Blast: ఆ కంపెనీ స్మార్ట్‌ఫోన్ మళ్లీ పేలింది... ఈసారి మరో మోడల్ బ్లాస్ట్

    జియో పోస్ట్‌పెయిడ్‌లో రూ.399, రూ.599, రూ.799, రూ.999, రూ.1499 ప్లాన్స్ తీసుకున్నవారికి డిస్నీ+ హాట్‌స్టార్‌తో పాటు అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్ లాంటి ఓటీటీ సబ్‌స్క్రిప్షన్స్‌తో పాటు జియో యాప్స్ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది.
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: Jio, Reliance Jio

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు