Reliance Jio: తెలంగాణ యూజర్లకు రిలయెన్స్ జియో గుడ్ న్యూస్

Reliance Jio | మూడేళ్ల క్రితం ప్రారంభమైన రిలయెన్స్ జియో భారత టెలికామ్ రంగంలో సృష్టిస్తున్న రికార్డులెన్నో. హైస్పీడ్ ఇంటర్నెట్ 4జీ డేటాను అందిస్తూ వినియోగదారుల్ని ఆకట్టుకుంటోంది రిలయెన్స్ జియో.

news18-telugu
Updated: August 21, 2019, 6:18 PM IST
Reliance Jio: తెలంగాణ యూజర్లకు రిలయెన్స్ జియో గుడ్ న్యూస్
Reliance Jio: తెలంగాణ యూజర్లకు రిలయెన్స్ జియో గుడ్ న్యూస్
  • Share this:
తెలంగాణలో జియో నెట్‌వర్క్ ఉపయోగిస్తున్నవారికి శుభవార్త. తెలంగాణలో 10,000 టవర్ల కీలక మైలురాయిని రిలయెన్స్ జియో చేరుకుంది. తిరుగులేని నెట్‌వర్క్‌తో మార్కెట్‌లో ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది జియో. తెలంగాణలో కోటి మందికి పైగా సబ్‌స్క్రైబర్లు జియో డిజిటల్ లైఫ్ సేవల్ని పొందుతున్నారు. ప్రతీ నెలా ప్రతీ జిల్లాలో సబ్‌స్క్రైబర్ల సంఖ్య కూడా పెరుగుతోంది. వీరికి మెరుగైన సేవల్ని అందించేందుకు రిలయెన్స్ జియో నెట్‌వర్క్‌ని విస్తరిస్తోంది. డేటా సేవల్ని మరింత చేరువ చేసేందుకు టవర్ల ఏర్పాటను కొనసాగిస్తోంది. కొంతకాలం క్రితం ఆంధ్రప్రదేశ్‌లో 10,000 టవర్ల మైలురాయిని దాటిన రిలయెన్స్ జియో... ఇప్పుడు తెలంగాణలోనూ 10,000 టవర్ల ఏర్పాటు చేయడం విశేషం. వినియోగదారులకు విస్తృతమైన 4జీ నెట్‌వర్క్, సాటిలేని కనెక్టివిటీ, జియో ప్రీమియం యాప్స్ బెనిఫిట్స్, జియో టీవీ, జియో మ్యూజిక్, జియో సినిమా లాంటి యాప్స్‌తో సేవలు అందించడం, జియో సిమ్ కార్డుల్ని అందుబాటులో ఉంచడం ద్వారా మార్కెట్‌లో రిలయెన్స్ జియోకు ఆదరణ విపరీతంగా పెరుగుతుందన్నది వాస్తవం.

మూడేళ్ల క్రితం ప్రారంభమైన రిలయెన్స్ జియో భారత టెలికామ్ రంగంలో సృష్టిస్తున్న రికార్డులెన్నో. హైస్పీడ్ ఇంటర్నెట్ 4జీ డేటాను అందిస్తూ వినియోగదారుల్ని ఆకట్టుకుంటోంది రిలయెన్స్ జియో. 2019 జూన్‌ ట్రాయ్ లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా రిలయెన్స్ జియోకు 33.12 కోట్ల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ టెలికామ్ సర్కిల్ (తెలంగాణ, ఆంధ్రప్రదేశ్) లో 2.64 కోట్ల వినియోగదారులున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో జియోకు 20,000 పైగా టవర్లు ఉండటం విశేషం. ఇంటింటికీ సేవలు అందాలన్న లక్ష్యంతో రిలయెన్స్ జియో ముందడుగు వేస్తూనే ఉంది.

Mi A3: అద్భుతమైన ఫీచర్లతో షావోమీ ఎంఐ ఏ3 రిలీజ్... ఎలా ఉందో చూడండి




ఇవి కూడా చదవండి:

Parle G: పార్లే-జీకి తగ్గిన డిమాండ్... 10,000 మంది ఉద్యోగాలకు గండం

KBC Play Along: స్మార్ట్‌ఫోన్ ఉందా? కౌన్ బనేగా కరోడ్‌పతీ మీరూ ఆడొచ్చు ఇలా
Loading...
Top 10 Apps: ఇండియాలో టాప్-10 యాప్స్ ఇవే... మీ దగ్గర ఎన్ని ఉన్నాయి?
First published: August 21, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...