8 భాషల్లో జియో బ్రౌజర్ లాంఛ్ చేసిన రిలయెన్స్

భారతీయుల కోసం జియో బ్రౌజర్ లాంఛ్ చేసిన రిలయెన్స్

జియోబ్రౌజర్‌లో ఇంకా మార్పుచేర్పులు చేసేందుకు ఫీడ్‌బ్యాక్ కోరుతోంది రిలయెన్స్ జియో. ఇక యాప్ హోమ్ పేజీలో ముఖ్యమైన వార్తలు, ట్రెండింగ్ ఈవెంట్స్, వీడియోస్ ఒకేచోట ఉంటాయి. అంతేకాదు... లోకల్ న్యూస్ కేటగిరీ కూడా ఉంది. అందులో మీరు కస్టమైజ్ చేసుకుంటే స్థానిక వార్తలు కనిపిస్తాయి.

 • Share this:
  స్మార్ట్‌ఫోన్ యూజర్లు ఏదైనా సెర్చ్ చేయాలంటే బ్రౌజర్లు లేకుండా పని జరగదు. గూగుల్ క్రోమ్, మొజిల్లా, ఒపెరా... ఇలా చాలా బ్రౌజర్లే ఉన్నాయి. అయితే ఇప్పుడు భారతీయుల అవసరాల్ని దృష్టిలో పెట్టుకొని ప్రత్యేకంగా జియో బ్రౌజర్‌ని లాంఛ్ చేసింది రిలయెన్స్. జియో బ్రౌజర్ గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉంది. ఈ బ్రౌజర్‌ని జియో యూజర్లు మాత్రమే కాదు... ఎవరైనా ఉపయోగించుకోవచ్చు. జియో బ్రౌజర్ ఎనిమిది భాషల్ని సపోర్ట్ చేస్తుంది. యాప్ సైజ్ 4.8 ఎంబీ మాత్రమే. ఎంట్రీ లెవెల్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లకు ఈ బ్రౌజర్ ఎంతగానో ఉపయోగపడనుంది.

  బ్రౌజర్‌లో ఇంకా మార్పుచేర్పులు చేసేందుకు ఫీడ్‌బ్యాక్ కోరుతోంది రిలయెన్స్ జియో. ఇక యాప్ హోమ్ పేజీలో ముఖ్యమైన వార్తలు, ట్రెండింగ్ ఈవెంట్స్, వీడియోస్ ఒకేచోట ఉంటాయి. అంతేకాదు... లోకల్ న్యూస్ కేటగిరీ కూడా ఉంది. అందులో మీరు కస్టమైజ్ చేసుకుంటే స్థానిక వార్తలు కనిపిస్తాయి. ప్రైవేట్ సర్ఫింగ్ కోసం ఇన్‌కాగ్నిటో మోడ్ కూడా ఉంది. ఏవైనా ఫైల్స్ షేర్ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఆండ్రాయిడ్ యూజర్లకు మాత్రమే ఈ యాప్ అందుబాటులో ఉంది. యాపిల్ యూజర్లకు త్వరలో అందుబాటులోకి వస్తుంది.

  ఇవి కూడా చదవండి:

  2019లో వాట్సప్‌లో కొత్తగా వచ్చే ఫీచర్లు ఇవేనా?

  సిమ్ కార్డుతో మీ అకౌంట్ ఖాళీ... జాగ్రత్తలు తెలుసుకోండి

  ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ మారింది... కొత్త రేట్లు ఇవే

  కస్టమర్లకు ఎస్‌బీఐ కొత్త వార్నింగ్... తీసుకోవాల్సిన జాగ్రత్తలివే
  First published: