హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Jio New Plans: నేటి నుంచి జియో కొత్త ప్లాన్స్... ఏ ప్లాన్‌పై ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయంటే

Jio New Plans: నేటి నుంచి జియో కొత్త ప్లాన్స్... ఏ ప్లాన్‌పై ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయంటే

Jio New Plans: నేటి నుంచి జియో కొత్త ప్లాన్స్... ఏ ప్లాన్‌పై ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయంటే
(ప్రతీకాత్మక చిత్రం)

Jio New Plans: నేటి నుంచి జియో కొత్త ప్లాన్స్... ఏ ప్లాన్‌పై ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయంటే (ప్రతీకాత్మక చిత్రం)

Jio New Plans | జియో కొత్త ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్స్ (Jio Prepaid Plans) అమలులోకి వచ్చాయి. రిలయన్స్ జియో ప్లాన్స్ ధరల్ని పెంచిన సంగతి తెలిసిందే. మరి కొత్త ప్లాన్స్ ధర ఎంత, బెనిఫిట్స్ ఏమేం ఉన్నాయో తెలుసుకోండి.

  రిలయన్స్ జియో యూజర్లకు అలర్ట్. రిలయన్స్ జియో (Reliance Jio) ప్లాన్స్ ధరల్ని పెంచుతున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా కూడా ప్లాన్స్ ధరల్ని పెంచాయి. ఎయిర్‌టెల్ 20 నుంచి 25 శాతం వరకు, వొడాఫోన్ ఐడియా 25 శాతం వరకు ప్లాన్స్ ధరల్ని పెంచాయి. రిలయన్స్ జియో కూడా ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్స్ (Prepaid Recharge Plans) ధరల్ని పెంచింది. ఈ కొత్త ధరలు డిసెంబర్ 1న అమలులోకి వచ్చాయి. బేసిక్ ప్లాన్స్ నుంచి అన్‌లిమిటెడ్ ప్లాన్స్ వరకు అన్ని ప్లాన్స్ ధరలు పెరిగాయి. మరి లేటెస్ట్ ప్లాన్స్ ధరలు ఎలా ఉన్నాయి, బెనిఫిట్స్ ఏమేం వస్తాయి? తెలుసుకోండి.

  Jio Rs 91 Plan: జియో రూ.75 ప్లాన్ రూ.91 ధరకు పెరిగింది. రూ.91 ప్లాన్ రీఛార్జ్ చేస్తే 28 రోజుల వేలిడిటీ లభిస్తుంది. అన్‌లిమిటెడ్ కాల్స్ చేయొచ్చు. నెలకు 3జీబీ డేటా వాడుకోవచ్చు. 50 ఎస్ఎంఎస్‌లు ఉపయోగించుకోవచ్చు.

  Jio Rs 155 Plan: జియో రూ.129 ప్లాన్ రూ.155 ధరకు పెరిగింది. రూ.155 ప్లాన్ రీఛార్జ్ చేస్తే 28 రోజుల వేలిడిటీ లభిస్తుంది. నెలకు 2జీబీ డేటా వాడుకోవచ్చు. అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ చేయొచ్చు. 300 ఎస్ఎంఎస్‌లు వాడుకోవచ్చు.

  Redmi Note 11T vs Redmi Note 10T: రెడ్‌మీ నోట్ 10టీ కన్నా 11టీ బాగుందా? పోలికలు, తేడాలు తెలుసుకోండి

  Jio Rs 179 Plan: జియో రూ.149 ప్లాన్ రూ.179 ధరకు పెరిగింది. రూ.179 ప్లాన్ రీఛార్జ్ చేస్తే 24 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 1జీబీ డేటా వాడుకోవచ్చు. అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ చేయొచ్చు. రోజూ 100 ఎస్ఎంఎస్‌లు వాడుకోవచ్చు.

  Jio Rs 239 Plan: జియో రూ.199 ప్లాన్ రూ.239 ధరకు పెరిగింది. రూ.239 ప్లాన్ రీఛార్జ్ చేస్తే 28 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 1.5జీబీ డేటా వాడుకోవచ్చు. అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ చేయొచ్చు. రోజూ 100 ఎస్ఎంఎస్‌లు వాడుకోవచ్చు.

  Jio Rs 299 Plan: జియో రూ.249 ప్లాన్ రూ.299 ధరకు పెరిగింది. రూ.299 ప్లాన్ రీఛార్జ్ చేస్తే 28 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 2జీబీ డేటా వాడుకోవచ్చు. అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ చేయొచ్చు. రోజూ 100 ఎస్ఎంఎస్‌లు వాడుకోవచ్చు.

  Jio Rs 479 Plan: జియో రూ.399 ప్లాన్ రూ.479 ధరకు పెరిగింది. రూ.479 ప్లాన్ రీఛార్జ్ చేస్తే 56 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 1.5జీబీ డేటా వాడుకోవచ్చు. అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ చేయొచ్చు. రోజూ 100 ఎస్ఎంఎస్‌లు వాడుకోవచ్చు.

  WhatsApp: వాట్సప్‌లో లాస్ట్ సీన్ టైమ్ అసలైనదేనా? ఇందులో తప్పులను ఎలా గుర్తించాలి?

  Jio Rs 533 Plan: జియో రూ.444 ప్లాన్ రూ.533 ధరకు పెరిగింది. రూ.533 ప్లాన్ రీఛార్జ్ చేస్తే 56 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 2జీబీ డేటా వాడుకోవచ్చు. అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ చేయొచ్చు. రోజూ 100 ఎస్ఎంఎస్‌లు వాడుకోవచ్చు.

  Jio Rs 395 Plan: జియో రూ.329 ప్లాన్ రూ.395 ధరకు పెరిగింది. రూ.395 ప్లాన్ రీఛార్జ్ చేస్తే 84 రోజుల వేలిడిటీ లభిస్తుంది. మొత్తం 6జీబీ డేటా వాడుకోవచ్చు. అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ చేయొచ్చు. మొత్తం 1000 ఎస్ఎంఎస్‌లు వాడుకోవచ్చు.

  Jio Rs 666 Plan: జియో రూ.555 ప్లాన్ రూ.666 ధరకు పెరిగింది. రూ.666 ప్లాన్ రీఛార్జ్ చేస్తే 84 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 1.5జీబీ డేటా వాడుకోవచ్చు. అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ చేయొచ్చు. రోజూ 100 ఎస్ఎంఎస్‌లు వాడుకోవచ్చు.

  Jio Rs 719 Plan: జియో రూ.599 ప్లాన్ రూ.719 ధరకు పెరిగింది. రూ.719 ప్లాన్ రీఛార్జ్ చేస్తే 84 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 2జీబీ డేటా వాడుకోవచ్చు. అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ చేయొచ్చు. రోజూ 100 ఎస్ఎంఎస్‌లు వాడుకోవచ్చు.

  Smartphone Tips: పొరపాటున ఫోటోలు, వీడియోలు డిలిట్ చేశారా? ఇలా తిరిగి పొందొచ్చు

  Jio Rs 1559 Plan: జియో రూ.1299 ప్లాన్ రూ.1599 ధరకు పెరిగింది. రూ.1599 ప్లాన్ రీఛార్జ్ చేస్తే 336 రోజుల వేలిడిటీ లభిస్తుంది. మొత్తం 24జీబీ డేటా వాడుకోవచ్చు. అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ చేయొచ్చు. మొత్తం 3600 ఎస్ఎంఎస్‌లు వాడుకోవచ్చు.

  Jio Rs 2879 Plan: జియో రూ.2399 ప్లాన్ రూ.2879 ధరకు పెరిగింది. రూ.2879 ప్లాన్ రీఛార్జ్ చేస్తే 365 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 2జీబీ డేటా వాడుకోవచ్చు. అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ చేయొచ్చు. రోజూ 100 ఎస్ఎంఎస్‌లు వాడుకోవచ్చు.

  Jio Rs 61 Plan: జియో రూ.51 ప్లాన్ రూ.61 కి పెరిగింది. ఈ ప్లాన్‌కు వేలిడిటీ రాదు. ఇది డేటా యాడ్ ఆన్ ప్లాన్. 6జీబీ డేటా వాడుకోవచ్చు.

  Jio Rs 121 Plan: జియో రూ.101 ప్లాన్ రూ.121 కి పెరిగింది. ఈ ప్లాన్‌కు వేలిడిటీ రాదు. ఇది డేటా యాడ్ ఆన్ ప్లాన్. 12జీబీ డేటా వాడుకోవచ్చు.

  Jio Rs 301 Plan: జియో రూ.251 ప్లాన్ రూ.301 కి పెరిగింది. ఈ ప్లాన్‌కు 30 రోజుల వేలిడిటీ లభిస్తుంది. ఇది డేటా యాడ్ ఆన్ ప్లాన్. 50జీబీ డేటా వాడుకోవచ్చు.

  Published by:Santhosh Kumar S
  First published:

  Tags: Jio, Reliance Jio

  ఉత్తమ కథలు